'కారు రాలేదు..సీఎం టాక్సీ ఎక్కి వెళ్లాడు'
'కారు రాలేదు..సీఎం టాక్సీ ఎక్కి వెళ్లాడు'
Published Mon, Dec 2 2013 5:16 PM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
అనుకున్న సమయానికి ముఖ్యమంత్రిని తీసుకువెళ్లడానికి వాహనం రాలేదు. దాంతో వేచి చూడటం ఇష్టం లేక ముఖ్యమంత్రి చేత్తో ఓ సైగ చేసి వచ్చిన కారులో ఎక్కి కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ఘటన కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి ఎదురైంది. దేశ రాజధానిలో పర్యటన ముగించుకుని నుంచి రాష్ట్ర రాజధానికి చేరుకున్న ఉమెన్ చాందీని తీసుకువెళ్లాడానికి అనుకున్న సమయానికి వాహనం...విమానాశ్రాయానికి చేరలేకపోయింది. దాంతో అధికార వాహనం కోసం వేచి చూడటం ఇష్టం లేక ప్రైవేట్ టాక్సీలో తన కార్యాలయాన్ని చేరుకున్నారు.
ముఖ్యమంత్రి టాక్సీలో వెళ్లడం భద్రత పరమైన లోపాలంటూ కేరళ రాజధాని తిరువనంతపురంలో పెద్ద దుమారాన్నే లేపింది. అయితే అలాంటిదేమి లేదని.. భద్రతాపరమైన సమస్య కానే కాదు. నేను ఢిల్లీలో కూడా ప్రైవేట్ వాహనంలోనే ప్రయాణిస్తాను అని చాందీ అన్నారు. అయితే ఈ విషయాన్ని కేరళ పోలీసులు సీరియస్ గానే తీసుకున్నారు. వాహనం సకాలంలో ఎందుకు చేరలేదని అంశంపై విచారణకు ఆదేశించారు.
ఈ అంశాన్ని పెద్ద సమస్యగా చూడవద్దని.. అనుకున్న సమయం కంటే ముందుగా విమానం తిరువనంతపురానికి చేరుకోవడం కారణంగానే తాను టాక్సీలో కార్యాలయంలో చేరుకున్నాను అని చాందీ వివరణ ఇచ్చారు. వాస్తవానికి ఢిల్లీ విమానం 10.50 నిమిషాలకు చేరుకోవాల్సి ఉండగా, 10.18 నిమిషాలకే తిరువనంతపురానికి చేరుకుంది. ఈ విషయంపై అనవసర రాద్దాంతం చేయవదు అని కేరళ స్టేట్ కాంగ్రెస్ చీఫ్ రమేశ్ చెన్నితల మీడియాకు విజ్క్షప్తి చేశారు.
Advertisement