ఎంపీ ప్రవర్తనపై కేరళ సీఎంకు శ్వేతా మీనన్ ఫిర్యాదు
కాంగ్రెస్ ఎంపీ తన పట్ల అసభ్యకరం ప్రవర్తించిన సంఘటనపై మలయాళ నటి శ్వేతా మీనన్ కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని కలిశారు. కేసుకు సంబంధించిన వివరాల్ని ముఖ్యమంత్రికి వివరించినట్టు ఆమె చెప్పారు.
కొల్లాంలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ, 73 ఏళ్ల పీతాంబర కురుప్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని శ్వేతా మీనన్ ఆరోపించడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె ఎంపీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అనంతరం ఉపసంహరించుకున్నారు.