Swetha Menon
-
OTT: ఐదుగురు భార్యలతో 'నాగేంద్రన్స్ హనీమూన్స్' ట్రైలర్
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మలయాళం నటుడు సూరజ్ వెంజరమూడు తన కెరీర్లో మొదటిసారి వెబ్‌సిరీస్‌లో నటించారు. నాగేంద్రన్స్ హనీమూన్స్ పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సిరీస్‌లో సూరజ్ వెంజరమూడుతో పాటు శ్వేత మీనన్, గ్రేస్ ఆంటోనీ,నిరంజన అనూప్, కనికుశృతి, ఆల్ఫీ పంజికరన్ నటిస్తున్నారు. తాజాగా ట్రైలర్‌ను హాట్‌స్టార్ విడుదల చేసింది. నితిన్ రెంజీ పనికర్ ఈ సినిమాను నిర్మించడంతో పాటు రచన దర్శకత్వం వ్యవహరించారు. గతంలో ఆయన కేరళ ఫైల్స్ వెబ్ సిరీస్‌ను నిర్మించి గుర్తింపు పొందారు. ఈ సిరీస్‌లో ఐదుగురు భార్యలున్న భర్తగా సూరజ్ వెంజరమూడు కనిపించారు. గల్ఫ్‌కు వెళ్లాలి అనుకున్న నాగేంద్రన్ అనుకోకుండా ఐదు పెళ్లిలు చేసుకుంటాడు. వారందరిని ఆయన ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనే అంశాలతో మంచి ఎంటర్టైనర్గా ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఐదుగురు భార్యలు ఉన్న నాగేంద్రన్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోన్నాడు..? అనేది తెలియాలంటే జులై 19 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న 'నాగేంద్రన్స్ హనీమూన్స్' చూడాల్సిందే. తెలుగు, తమిళ్, మలయాళంలో ఈ సిరీస్ విడుదల కానుంది. -
‘రతినిర్వేదం’హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి?(ఫోటోలు)
-
బికినీలోనే కాదు అవసరమైతే అంటూ.. బోల్డ్ కామెంట్ చేసిన హీరోయిన్
మలయాళ నటి శ్వేతామీనన్ అందరికీ గుర్తే.. 2011లో ఘన విజయం సాధించిన శృంగార ప్రేమ కథా చిత్రం'రతి నిర్వేదం' ద్వారా ఆమె తెలుగులో కూడా పాపులారిటీ సంపాదించుకుంది. శ్వేతామీనన్ కీలక పాత్ర పోషించగా మలయాళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ ట్రెండ్ సెట్ చేసింది. శ్రీజిత్ విజయ్ కథానాయకుడిగా టి.కె.రాజీవ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యధార్థ సంఘటనలతో పి.పద్మరాజన్ రచించిన నవల 'రతినిర్వేదం' 1978లో సినిమాగా తెరకెక్కి సూపర్ హిట్ అయింది. అదే టైటిల్‌తో 2011లో ఆ సినిమాను శ్వేతామీనన్‌తో రీమేక్ చేశారు. శృంగార సన్నివేశాలతో నిండిపోయిన ఈ చిత్రంలో హాట్‌హాట్ అందాలతో శ్వేత అలరించింది. 1991లో మలయాళ చిత్రంలో అడుగు అడుగు పెట్టిన ఆమె గతంలో కొన్ని రొమాన్స్ సీన్స్‌తో పాటు బికినీలో కూడా కనిపించింది. ఈ అంశంపై ఆమెకు తాజాగా పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇలాంటి పాత్రలలో మళ్లీ నటిస్తారా అని ఆమెకు ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె ధీటుగానే సమాధానం ఇచ్చింది. 'నేను ఏ పాత్రలో నటిస్తున్నానో తెలుసుకున్న తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. సినిమాకు అవసరం అనిపిస్తే బికినీలో నటించాల్సి వచ్చినా నేను నటిస్తాను. కథాంశం కోసం అవసరమైతే మరోక అడుగు ముందుకేసి నగ్నంగా నటించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను.' అని శ్వేతా మీనన్ 50 ఏళ్ల వయసులో ధీటుగా చెప్పింది. -
విభిన్న నేపథ్యంతో...
‘‘ఇప్పటివరకూ రక రకాల నేపథ్యాలతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో ఎవరూ ఊహించని నేపథ్యం కనిపించి, ఆశ్చర్యానికి గురి చేస్తుంది’’ అని నిర్మాత బొడ్డు దేవికిరణ్ చెప్పారు. శ్వేతామీనన్, బిజుమీనన్, సునీల్‌శెట్టి ముఖ్యతారలుగా జాతీయ ఉత్తమ దర్శకుడు బ్లెస్సీ దర్శకత్వంలో తమిళం, మలయాళంలో రూపొందిన చిత్రం తెలుగులో ‘మల్లెతీగ’గా అనువాదమైంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని సమర్పకులు బొడ్డు చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఈ చిత్రానికి పాటలు: ఛత్రపతి శ్రీనివాస్, మాటలు: నౌండ్ల శ్రీనివాస్. -
రాజకీయ చిత్రంలో శ్వేతామీనన్
సంచలనాలకు కేంద్రబిందువైన శ్వేతామీనన్ కరిమన్ను అనే చిత్రంలో తన నిజ ప్రసవ దృశ్యాల చిత్రీకరణకు అనుమతించింది. దీనిపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇటీవల కేరళ ఎంపీ అసభ్యంగా ప్రవర్తించారంటూ ఫిర్యాదు చేసి ఆ తరువాత ఆయన క్షమాపణ కోరడంతో ఫిర్యాదును వాపస్ తీసుకుని వార్తల్లో కెక్కారు. తాజాగా ఈ కేరళ బ్యూటీ తమిళంలో ఒక రాజకీయ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. సినిమాగా దర్శక నటుడు కె.భాగ్యరాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి తురై మొదలవర్ అనే పేరును నిర్ణయించారు. రాజకీయ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో భాగ్యరాజ్ సరసన శ్వేతామీనన్ హీరోయిన్గా నటించనున్నారు. ఇది సమకాలీన రాజకీయాలపై సెటైరికల్నెస్ కథా చిత్రం అని తెలిసింది. శ్వేతామీనన్ పాత్ర చర్చనీయాంశంగా ఉంటుందని సమాచారం. అందువల్లనే భాగ్యరాజ్ ఆమెను ఈ పాత్రకు ఎంపిక చేసినట్లు కోడంబాక్కం టాక్. ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి రానుంది. -
ఎంపీ ప్రవర్తనపై కేరళ సీఎంకు శ్వేతా మీనన్ ఫిర్యాదు
కాంగ్రెస్ ఎంపీ తన పట్ల అసభ్యకరం ప్రవర్తించిన సంఘటనపై మలయాళ నటి శ్వేతా మీనన్ కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని కలిశారు. కేసుకు సంబంధించిన వివరాల్ని ముఖ్యమంత్రికి వివరించినట్టు ఆమె చెప్పారు. కొల్లాంలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ, 73 ఏళ్ల పీతాంబర కురుప్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని శ్వేతా మీనన్ ఆరోపించడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె ఎంపీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అనంతరం ఉపసంహరించుకున్నారు. -
ఎంపీ నన్ను పదే పదే తాకారు: శ్వేతామీనన్
పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నటి శ్వేతామీనన్ కొల్లాం: కాంగ్రెస్ ఎంపీ పీతాంబర కురుప్ తనను పదేపదే తాకారని మలయాళ నటి శ్వేతామీనన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. పీతాంబర క్షమాపణలు చెప్పడంతో శ్వేతామీనన్ ఎంపీపై ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించిచడం తెలిసిందే. అయితే, కేసు నమోదు చేసినందున పోలీసులు చట్టప్రకారం శ్వేత నుంచి సేకరించిన వాంగ్మూలాన్ని కొల్లాం కోర్టుకు సమర్పించారు. మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్కు శ్వేత చెప్పిన వివరాలిలా ఉన్నాయి. గత శుక్రవారం కొల్లాంలో పడవపోటీల కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్వేత వెళ్లారు. కారులో నుంచి దిగిన వెంటనే పీతాంబర ఆమె చేయిని పట్టుకున్నారు. వేదిక వద్దకు తీసుకెళ్లారు. ఆలోపు ఆమె చేయిని గట్టిగా పదే పదే తాకారు. చివరికి చేయి విడిచిపెడితే వేదికపైకి వెళతానని శ్వేత కోరిన తర్వాత గానీ పీతాంబర పట్టు విడువలేదు. అలాగే, తన భుజాన్ని కూడా అసభ్యకర రీతిలో ఎంపీ తాకారని శ్వేత చెప్పారు.