రాజకీయ చిత్రంలో శ్వేతామీనన్ | swetha menon acting in political movie | Sakshi
Sakshi News home page

రాజకీయ చిత్రంలో శ్వేతామీనన్

Published Wed, Dec 11 2013 4:40 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

రాజకీయ చిత్రంలో శ్వేతామీనన్ - Sakshi

రాజకీయ చిత్రంలో శ్వేతామీనన్

 సంచలనాలకు కేంద్రబిందువైన శ్వేతామీనన్ కరిమన్ను అనే చిత్రంలో తన నిజ ప్రసవ దృశ్యాల చిత్రీకరణకు అనుమతించింది. దీనిపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇటీవల కేరళ ఎంపీ అసభ్యంగా ప్రవర్తించారంటూ ఫిర్యాదు చేసి ఆ తరువాత ఆయన క్షమాపణ కోరడంతో ఫిర్యాదును వాపస్ తీసుకుని వార్తల్లో కెక్కారు. 
 
 తాజాగా ఈ కేరళ బ్యూటీ తమిళంలో ఒక రాజకీయ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. సినిమాగా దర్శక నటుడు కె.భాగ్యరాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి తురై మొదలవర్ అనే పేరును నిర్ణయించారు. రాజకీయ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో భాగ్యరాజ్ సరసన శ్వేతామీనన్ హీరోయిన్‌గా నటించనున్నారు. ఇది సమకాలీన రాజకీయాలపై సెటైరికల్‌నెస్ కథా చిత్రం అని తెలిసింది. శ్వేతామీనన్ పాత్ర చర్చనీయాంశంగా ఉంటుందని సమాచారం. అందువల్లనే భాగ్యరాజ్ ఆమెను ఈ పాత్రకు ఎంపిక చేసినట్లు కోడంబాక్కం టాక్. ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి రానుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement