
శ్వేతామీనన్.. ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు కానీ.. ‘రతి నిర్వేదం’హీరోయిన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు.

2011లో మలయాళంలో వచ్చిన ఈ సినిమా తెలుగులోనూ అదే పేరుతో డబ్ అయ్యింది.

యధార్థ సంఘటనలతో పి.పద్మరాజన్ రచించిన నవల 'రతినిర్వేదం' 1978లో సినిమాగా తెరకెక్కి సూపర్ హిట్ అయింది.

అదే టైటిల్‌తో 2011లో ఆ సినిమాను శ్వేతామీనన్‌తో రీమేక్ చేశారు. శృంగార సన్నివేశాలతో నిండిపోయిన ఈ చిత్రంలో హాట్‌హాట్ అందాలతో శ్వేత అలరించింది.

ఆ చిత్రం తర్వాత శ్వేత పలు తెలుగు సినిమాల్లోనూ నటించింది. ఈ మధ్యకాలంలో ఆమె సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.

ప్రస్తుతం పసు మలయాళ సీరియళ్లలో నటిస్తూ బీజీగా ఉంది

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్వేతా..తరచు తన ఫోటోలను షేర్ చేస్తు అభిమానులను అలరిస్తుంది.









