చరిత్ర సృష్టించిన సీఎం | Oommen Chandy makes history, hopes to win polls | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన సీఎం

Published Wed, May 18 2016 2:29 PM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

చరిత్ర సృష్టించిన సీఎం

చరిత్ర సృష్టించిన సీఎం

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాంది చరిత్ర సృష్టించారు. కేరళలో అత్యధిక రోజులు సీఎంగా కొనసాగిన ఘనత సాధించారు. సీఎంగా ఆయన బుధవారం నాటికి 1,827 రోజులు పూర్తి చేసుకున్నారు. ఐదేళ్ల కాలంలో ఎక్కువ రోజులు సీఎంగా కొనసాగిన రికార్డు సొంతం చేసుకున్నారు.

రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తన కంటే ముందు సీఎంగా పనిచేసిన వీఎస్ అచ్యుతానందన్ రికార్డును అధిగమించారు. అచ్యుతానందన్ 1,822 రోజులు సీఎంగా పనిచేశారు.

తాజాగా కేరళ అసెంబ్లీకి సోమవారం ఎన్నికలు  జరిగాయి. అయితే మరో పర్యాయం చాందికి అవకాశం దక్కకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ముందస్తు సర్వేలు అంచనాలు తప్పుతాయని, మళ్లీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని చాంది విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారం నిలబెట్టుకుంటామని దీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement