kerala chief minister
-
ఆ నినాదాలను త్యజించే దమ్ము సంఘ్ పరివార్‌కు ఉందా?
మలప్పురం(కేరళ): స్వాతంత్రోద్యమ వేళ దేశాన్ని ఒకతాటి మీదకు తెచి్చన జాతీయస్థాయి నినాదాలు పురుడుపోసుకోవడంలో ముస్లింల పాత్ర కూడా ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. సంఘ్ పరివార్ శ్రేణుల్లో ఎప్పుడూ ప్రతిధ్వనించే రెండు నినాదాలను వాస్తవానికి ముస్లింలు తొలిసారిగా ఎలుగెత్తి చాటారని విజయన్ అన్నారు. వివాదాస్పద పౌరసత్వ(సవరణ)చట్టాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) నేతృత్వంలో నాలుగురోజులుగా జరుగుతున్న ర్యాలీలో విజయన్ పాల్గొని ప్రసంగించారు. ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే మలప్పురం జిల్లాలోనే ఈ సభ జరగడం గమనార్హం. ‘‘ముస్లిం పాలకులు, సాంస్కృతిక సారథులు, ముస్లింలు ఉన్నతాధికారులు ఎందరో దేశ చరిత్ర, స్వతంత్ర సంగ్రామంలో పాలుపంచుకున్నారు. వీటిపై ఏమాత్రం అవగాహన లేని సంఘ పరివార్ నేతలు ఇక్కడికొచ్చి భారత్ మాతాకీ జై అని నినదించాలని డిమాండ్లుచేస్తున్నారు. వాస్తవానికి భారత్ మాతాకీ జై, జైహింద్ అని నినదించింది ముస్లింలని సంఘ్ పరివార్‌కు తెలీదనుకుంటా. తెలిస్తే ఆ నినాదాలను ఇవ్వడం సంఘ్ పరివార్ మానుకుంటుందా? అజీముల్లా ఖాన్ భారత్ మాతాకీ జై అంటే, అబిద్ హసన్ అనే భారత దూత ‘జై హింద్’ అని నినదించారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తనయుడు దారా షికోహ్ సంస్కృతంలో ఉన్న 50 ఉపనిషత్తులను పర్షియన్లోకి తర్జుమాచేశారు. అలా భారతీయ రచనలు విశ్వవ్యాప్తమయ్యేలా తన వంతు కృషిచేశారు. ఇవేం తెలియని సంఘ్ నేతలు భారత్‌లోని ముస్లింలను పాకిస్తాన్‌కు పంపేయాలని మొండిపట్టు పడుతుంటారు. సీఏఏతో ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని మోదీ సర్కార్ కుట్ర పన్నింది. వీటిని కేరళ పౌరులు సహించరు’’ అన్నారు. సీఏఏ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేయంపై కాంగ్రెస్‌కు పెద్దగా ఆసక్తి లేదని ఆరోపించారు. హిట్లర్ నియంతృత్వ పోకడల నుంచే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు పురుడుపోసుకున్నాయని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులు దేశ అంతర్గత శత్రువులని ఆర్ఆర్ఎస్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన ఎంఎస్ గోల్వాల్కర్ గతంలో ఒక పుస్తకంలో వ్యాఖ్యానించారని విజయన్ గుర్తుచేశారు. -
‘నా అకాడమీని ఆక్రమిస్తున్నారు’
తిరువనంతపురం: అథ్లెటిక్ దిగ్గజం, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష కన్నీళ్ల పర్యంతమైంది. కోజికోడ్‌లోని తన అకాడమీలో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడి భద్రతపై కూడా ఉష తన బాధను వెల్లడించింది. ‘నా అకాడమీ మధ్యలోనే అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. మేం బౌండరీ నిర్మించుకునేందుకు కూడా అడ్డు పడుతున్నారు. అదేమని అడిగితే దురుసుగా మాట్లాడుతూ బెదిరిస్తున్నారు. దీనిపై కేరళ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశా ను. ఆయన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా అకాడమీలోని 25 మంది మహిళా అథ్లెట్లలో 11 మంది ఉత్తరాదికి చెందినవారు. వారి భద్రత మాకు ముఖ్యం’ అని ఉష పేర్కొంది. సుమారు 30 ఎకరాల ఈ అకాడమీ స్థలాన్ని కేరళలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉషకు 30 సంవత్సరాల కాలానికి లీజుకు ఇచ్చింది. గత జూలైలో రాజ్యసభకు నామినేట్ అయిన తర్వాత తనపై ఇలాంటి వేధింపులు పెరిగాయని ఉష చెబుతోంది. దురదృష్టవశాత్తూ ప్రతీ రాజకీయ పార్టీ తనను మరో పార్టీ సానుభూతిపరురాలిగా చూస్తోందని, అయితే తనకు ఎలాంటి రాజకీయాలు తెలియవని ఉష తన బాధను ప్రకటించింది. -
నేడు హైదరాబాద్ కు ఢిల్లీ, కేరళ సీఎంలు
-
సీఎం కేసీఆర్ తో కేరళ సీఎం విజయన్ భేటీ
-
కేరళ కకావికలం : ఓనం ఉత్సవాలు రద్దు
తిరువనంతపురం : అందమైన ఉద్యానవనాలు, పర్యాటక రంగానికి మారుపేరైన కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కకావికలం చేశాయి. వరుణుడి ఉగ్రరూపానికి కేరళ అల్లకల్లోలమవుతోంది. సుమారు ఒక శతాబ్దంలో ఇంతటి ప్రకృతి కోపాన్ని కేరళ రుచిచూడటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కేరళ ప్రతేడాది ఎంతో ఘనంగా నిర్వహించే ఓనం ఉత్సవాలను రద్దు చేసింది. కేరళలో ఓనం ఉత్సవాలను రద్దు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఓనం పండుగ పంటల పండుగగా ఎంతో సుప్రసిద్ధమైంది. ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటుంది. కానీ ఈసారి ఓనం ఉత్సవాలను రద్దు చేసింది. ఓనం కోసం గతంలో కేటాయించిన రూ.30 కోట్లను తాజాగా ముఖ్యమంత్రి సహాయనిధికి మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓనం కోసం పక్కకు తీసి పెట్టిన నగదును సహాయనిధి కోసం వాడనున్నామని విజయన్ మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాకు చెప్పారు. ఈ పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇటీవల రూ.30 కోట్లు కేటాయించింది. ఆగస్టులో ఓ వారమంతా ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఆగస్టు 25న తిరు ఓనం పండుగ. కాగ, ఆగస్టు 8 నుంచి కేరళ వరదల్లో కొట్టుమిట్టాడుతోంది.గత వారం 39 మంది మరణించగా.. నలుగురు గల్లంతయ్యారు. సుమారు లక్ష మంది ఈ వరదలకు ప్రభావితమైనట్టు తెలిసింది. ఈ క్రమంలో ఈసారి ఉత్సవాలను నిర్వహించుకోబోవడం లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఉపశమనం, పునరావాస కార్యక్రమాలను వెంటనే చేపట్టేందుకు కేబినెట్ సబ్-కమిటీని నియమించాలని నిర్ణయించినట్టు విజయన్ చెప్పారు. సెప్టెంబర్ 3 నుంచి 15 వరకు ఎవరైతే విలువైన రికార్డులను కోల్పోయారో, వారికి డూప్లికేట్లు జారీ చేసేందుకు స్పెషల్ కోర్టులు నిర్వహించబోతున్నారు. ఈ రికార్డులను ఉచితంగానే జారీ చేయబోతుంది. పరిహార మొత్తాలను ఎప్పుడు బదిలీ చేస్తుందో కూడా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీని కోరామని, వాటిపై ఎలాంటి ఛార్జీలను విధించకూడదని కోరామని చెప్పారు. -
కోసిపారేసిన యువతికి సీఎం అభినందన
అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి పురుషాంగాన్ని కోసిపారేసిన యువతి సాహసాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభినందించారు. ఆమె చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని, అందులో అనుమానం ఏమీ లేదని చెప్పారు. తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన ఒక దొంగస్వామి మర్మాంగాన్ని కేరళకు చెందిన న్యాయ విద్యార్థిని కోసి పారేసిన విషయం తెలిసిందే. కొల్లాంలోని పన్మన ఆశ్రమంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గణేశానంద తీర్థపద స్వామి (54) అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఎంత వారించినా వినకపోవడంతో ఆమెకు కోపం వచ్చి తన వద్ద ఉన్న చాకుతో అతడి పురుషాంగాన్ని కోసేసింది. తిరువనంతపురం పోలీసులకు ఫోన్ చేసి ఆ విషయాన్ని చెప్పగా, వాళ్లు కూడా ఆమెపై కేసు ఏమీ నమోదు చేయకుండా అతడిపైనే పోస్కో కేసు పెట్టారు. కేరళ మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఆ యువతిని అభినందించారు. మతం పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. రేప్ చేయబోతే.. కోసి పారేసింది! -
ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు ఝలక్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సుప్రీంకోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది. ప్రభుత్వం తొలగించిన డీజీపీ టీపీ సేన్‌కుమార్‌ను మళ్లీ అదే పదవిలో నియమించాలని ఆదేశించింది. తనను తిరిగి నియమించాలంటూ సేన్‌కుమార్ దాఖలుచేసిన పిటిషన్ విచారణ అనంతరం జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. అయితే తనకు వెంటనే డీజీపీగా చేరిపోవాలన్న తొందర ఏమీ లేదని సేన్‌కుమార్ అన్నారు. 11 నెలలుగా తానేమీ తొందరపడలేదని ఆయన చెప్పారు. తన కేసును వాదించేందుకు అంగీకరించిన న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, దుష్యంత్ దవేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చాలా సందర్భాల్లో తనలాంటి అధికారులు సుప్రీంకోర్టు వరకు రాలేరని, ప్రధానంగా అంత ఖర్చు తాము భరించలేమని అన్నారు. జిషా హత్యకేసు, పుట్టింగల్ ఆలయంలో బాణసంచా పేలుడు దుర్ఘటన కేసులను సరిగా విచారించలేదంటూ 2016 మే నెలలో కొత్తగా వచ్చిన పినరయి విజయన్ ప్రభుత్వం సేన్‌కుమార్‌ను ఆ పదవి నుంచి తీసేసి, అంతగా ప్రాధాన్యం లేని పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. కానీ ఆయన ఆ పదవిలో చేరకుండా కోర్టుకెక్కారు. పుట్టింగల్ ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 110 మంది మరణించారని, ఆ కేసులో తప్పుచేసిన పోలీసు అధికారులను సేన్‌కుమార్ కాపాడారని సుప్రీంకోర్టులో కేరళ సర్కారు వాదించింది. కానీ కోర్టు మాత్రం సేన్‌కుమార్‌కు అనుకూలంగానే తీర్పు వెల్లడించింది. -
కన్నూర్ రక్త చరిత్ర!
⇒ ఎరుపు, కాషాయ పక్షాల మధ్య ఎడతెగని రక్తపాతం కొచ్చి: వందలాది ఆరెసెస్ కార్యకర్తల హత్యకు కారణమైన సీపీఎం ముఖ్యమంత్రి పినరయి విజయన్ తల నరికిన వారికి కోటి రూపాయలిస్తానని మధ్యప్రదేశ్ ఆరెసెస్ నేత కుందన్ చంద్రావత్ బహిరంగ ప్రకటనతో ఉత్తర కేరళ జిల్లా కన్నూర్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. గత 45–50 ఏళ్లలో ఇక్కడ ఆరెస్సెస్–మార్క్సిస్టు పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ‘వందలాది’Sమంది మరణించారని అంచనా. ముఖ్యంగా 1990ల నుంచి జరుగుతున్న కన్నూర్ హింసాకాండ పాశవికంగా మారింది. క్లాసురూముల్లో పాఠాలు చెబుతున్న సీపీఎం, ఆరెస్సెస్ నేతలను(ఉపాధ్యాయులు) విద్యార్థుల ముందే కత్తులు, గొడ్డళ్లతో నరకి చంపడం దేశ ప్రజలందరిని పదేళ్ల క్రితమే కలవరపరిచింది. ఎన్ని శాంతి సమావేశాలు పెట్టినా రెండు రాజకీయ పక్షాల మధ్య హింసకు ముగింపు లేకుండాపోయింది. వందలాది ఏళ్ల చరిత్ర ఉన్న కన్నూర్ పూర్వపు మలబార్ (కేరళలో చేరక ముందు మద్రాసు రాష్ట్రం) జిల్లాలో అంతర్భాగంగా ఉండేది. తొలితరం కమ్యూనిస్ట్ యోధుడు ఏకే గోపాలన్, సీపీఎం మాజీ సీఎం ఈకే నయనార్, ఇప్పటి సీఎం పినరయి విజయన్, కాంగ్రెస్ మాజీ సీఎం కె.కరుణాకరన్, కేంద్ర మాజీమంత్రులు ఇ. అహ్మద్, సీఎం ఇబ్రాహీం కన్నూర్‌లో పుట్టినవాళ్లే. హిందూ కుటుంబాల్లో పుట్టిన నేతల్లో ఒక్క నయనార్ తప్ప మిగిలిన ముగురూ బీసీ వర్గమైన ఈళవ(తియ్యా)లే. బీడీ పరిశ్రమతో మొదలైన వివాదం! 50 ఏళ్ల క్రితం ఇక్కడ బీడీ పరిశ్రమ బాగా విస్తరించింది. ఈ రంగంలోని కార్మికులకు వేతనాలు, సౌకర్యాలు పెంచడంలో కమ్యూనిస్టు కార్మిక సంఘాలు విజయం సాధించాక, గణేష్ బీడీ వర్క్స్ వంటి పెద్ద కంపెనీలు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. మిగిలిన కంపెనీలు ఆరెసెస్ అనుకూల కార్మికులను కాంట్రాక్టు పద్ధతిపై చేర్చుకోవడంతో కాషాయ పరివార్, కమ్యూనిస్ట్ అనుబంధ సంస్థల మధ్య విద్వేషాలు పెరిగాయి. మంగళూరుకు చెందిన ఓ మైనారిటీ వ్యాపారి కన్నూరుకు వాణిజ్యకార్యకలాపాలు విస్తరించడంతో స్థానిక హిందూ వ్యాపారుల నుంచి సంఘ్ పరివార్ సంస్థలకు సహకారం లభించింది. ఇది హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. మైనారిటీల తరఫున కమ్యూనిస్టులు ‘నిలబడ్డారు.’ దాదాపు 70 ఏళ్ల క్రితమే రాజకీయ దాడులు ప్రారంభం 1948లో కన్నూరులో ఆరెస్సెస్ మూడో ఛీప్ ‘గురూజీ’ ఎంఎస్ గోల్వాల్కర్ ఊరేగింపులపై జరిగిన దాడులతో రాజకీయ హింస ఆరంభమైందని చెబుతారు. జిల్లాలోని తలసేరీలో 1971లో భారీగా జరిగిన హిందూ–ముస్లిం ఘర్షణలు రెండు పక్షాల మధ్య శాశ్వత ఘర్షణలకు పునాదివేశాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ హయాంలతో పోల్చితే సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్ పాలనలోనే రాజకీయ ఘర్షణలు ఎక్కువ జరిగాయని మీడియా గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 30 లక్షల జనాభా ఉన్న ఈ జిల్లాలో కల్లుగీత వృత్తిదారులైన తియ్యాలు 30 శాతం వరకూ ఉండడంతో సాంస్కృతిక సంస్థగా చెప్పుకునే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహా అన్నిపార్టీల నేతలు, క్రియాశీల కార్యకర్తలు తియ్యాలే. అందుకే సీపీఎం–ఆరెస్సెస్ ఘర్షణల్లో మరణించిన, గాయపడినవారిలో 90 శాతానికి పైగా ఈ కులంవారే ఉన్నారు. 14 శాతానికి పెరిగిన బీజేపీ ఓట్లు! దీంతో పాతికేళ్ల నుంచీ జిల్లాలో బీజేపీ అనూహ్యంగా బలం పెంచుకుంది. ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు గెలిచే బలం ఎక్కడా లేకున్నా 2016 ఎన్నికల్లో సగటున దాదాపు 14 శాతం ఓట్లను ‘కమలం’ అభ్యర్థులు సాధించారు. 1930ల నుంచీ అంటే దాదాపు 95 ఏళ్లుగా ‘ఎర్రకోట’గా పేరొందిన కన్నూరు జిల్లాలో కాషాయ బలగాల విస్తరణను ‘కత్తికి కత్తితో’ కామ్రేడ్లు ప్రతిఘటించడంతో రాజకీయ హత్యలు గత పదేళ్లుగా విపరీతంగా పెరిగాయి. 2000– 2016 మధ్య 66 రాజకీయ హత్యలు జరిగాయి. 2008లో అత్యధికంగా 14 జరిగితే, 2003, 2013లో మాత్రమే ఎలాంటి హత్యలు జరగలేదు. 2016లో రెండు పక్షాల మధ్య దాదాపు 600 రాజకీయ ఘర్షణలు జరగ్గా అందులో ఏడుగురు మరణించారు. సీపీఎం అధికారంలో ఉన్నప్పుడే ఘర్షణలు పెరగడం, ఇది సీఎం విజయన్ సొంత జిల్లా కావడంతో రాజకీయ కొట్లాటలకు స్వస్తి పలకడానికి ఎల్డీఎఫ్ సీఎం కిందటేడాది శాంతి సమావేశాలు నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. తాజాగా ఉజ్జయిన్ ఆరెస్సెస్ సహ ప్రచార్ ప్రముఖ్ చేసిన ప్రకటనతో సంఘ్‌పరివార్‌కు ప్రచారపరమైన నష్టం జరిగిందనే విషయం నేతలు గ్రహించారు. ఈ నేపథ్యంలో కన్నూరు రాజకీయ ఘర్షణలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. మొత్తానికి కన్నూర్ రాజకీయ ఘర్షణలు 1970లు, 80ల్లో ఖమ్మం జిల్లాలో సీపీఎం, సీపీఐ కార్యకర్తల మధ్య, వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో అప్పటి సీపీఎం ఎమ్మెల్యే మద్దికాయల ఓకాంర్ అనుచరులు,æ సీపీఐఎంఎల్–పీపుల్స్‌వార్ మధ్య, ఇంకా నల్లగొండ జిల్లా సూర్యాపేట, మిర్యాలగూడ ప్రాంతంలో కాంగ్రెస్(మాజీ ఎమ్మెల్యే చకిలం శ్రీనివాసరావు నేతృత్వంలో), సీపీఎం కార్యకర్తల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలు పాత తరం రాజకీయ పరిశీలకులకు గుర్తుకు తెప్పిస్తున్నాయి. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కేరళ సీఎం తల నరికితే కోటి
-
కేరళ సీఎం తల నరికితే కోటి
ఆరెస్సెస్ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు ఉజ్జయిని/కొచ్చి: కేరళ ముఖ్యమంత్రి తల నరికి తెచ్చిన ఉజ్జయిని వాసులకు కోటి రూపాయలు విలువ చేసే తన ఇంటిని బహుమతిగా ఇస్తానని మధ్యప్రదేశ్‌లో ఓ ఆరెస్సెస్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యలను ఆరెస్సెస్ సహా సీపీఎం, కాంగ్రెస్ ఖండించాయి. ఇలాంటి బెదిరింపులకు భయపడి తన పర్యటనలకు దూరంగా ఉండనని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఉజ్జయినికి చెందిన కుందన్ చంద్రావత్ అనే ఆరెస్సెస్ నాయకుడు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కేరళ ముఖ్యమంత్రి మన ఆరెస్సెస్ కార్యకర్తలను చంపుతున్నాడు. ఇప్పటికి 300 మంది కార్యకర్తలు చనిపోయారు. ఆ సీఎం తల నరికి తెచ్చిన ఉజ్జయిని వాసులకు నా ఇంటిని రాసిస్తా’ అని కుందన్ చెబుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుందన్ వ్యాఖ్యలతో ఆరెస్సెస్ వెంటనే విభేదించింది. ‘మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సంఘ్ హింసా మార్గంలో నడవదు. అయితే కేరళలో మా కార్యకర్తలు లక్ష్యంగా జరుగుతున్న దాడులపై శాంతియుత మార్గంలోనే మేం నిరసన తెలుపుతాం’ అని ఆరెస్సెస్ జాతీయ నాయకుడు జె.నందకుమార్ ఢిల్లీలో చెప్పారు. అసలు కుందన్ ఎవరో తనకు తెలియదని నంద అన్నారు -
ఇప్పటికే ఎంతోమంది తలల్ని తీశారు: సీఎం
త్రివేండ్రం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ఎవరైనా చంపితే, వాళ్లకు కోటి రూపాయలు ఇస్తామని మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు డాక్టర్ చంద్రావత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. చంద్రావత్ వ్యాఖ్యలను సీపీఎం నాయకులు ఖండించారు. కేరళ సీఎం విజయన్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆర్ఎస్ఎస్ ఇప్పటికే ఎంతో మంది తలలను తీసుకుందని అన్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. చంద్రావత్ వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఉజ్జయినిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ చింతామణి మాలవీయ, ఎమ్మెల్యే మోహన్ యాదవ్‌ల సమక్షంలో చంద్రావత్ మాట్లాడుతూ.. విజయన్ తల కోసం అవసరమైతే తన ఆస్తి మొత్తం అమ్మేస్తానని చెప్పారు. ఆ సీఎంను చంపితే.. కోటి ఇస్తా: ఆర్ఎస్ఎస్ నేత -
చరిత్ర సృష్టించిన సీఎం
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాంది చరిత్ర సృష్టించారు. కేరళలో అత్యధిక రోజులు సీఎంగా కొనసాగిన ఘనత సాధించారు. సీఎంగా ఆయన బుధవారం నాటికి 1,827 రోజులు పూర్తి చేసుకున్నారు. ఐదేళ్ల కాలంలో ఎక్కువ రోజులు సీఎంగా కొనసాగిన రికార్డు సొంతం చేసుకున్నారు. రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తన కంటే ముందు సీఎంగా పనిచేసిన వీఎస్ అచ్యుతానందన్ రికార్డును అధిగమించారు. అచ్యుతానందన్ 1,822 రోజులు సీఎంగా పనిచేశారు. తాజాగా కేరళ అసెంబ్లీకి సోమవారం ఎన్నికలు జరిగాయి. అయితే మరో పర్యాయం చాందికి అవకాశం దక్కకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ముందస్తు సర్వేలు అంచనాలు తప్పుతాయని, మళ్లీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని చాంది విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారం నిలబెట్టుకుంటామని దీమా వ్యక్తం చేశారు. -
'నా కంపెనీ ఎదుగుదల, పతనానికి సీఎం కారణం'
కోచి: కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీపై సోలార్ స్కాం నిందితురాలు సరితా నాయర్ ఆరోపణల పర్వాన్ని కొనసాగిస్తోంది. కోచిలో జ్యుడిషియల్ కమిషన్ ఎదుట మరోసారి హాజరైన సరిత.. ఉమెన్ చాందీపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన కంపెనీ ఎదుగుదలకు, పతనానికి ముఖ్యమంత్రే కారణమని చెప్పింది. సరిత వ్యాపార భాగస్వామి, సహ నిందితుడు బిజూ రాధాకృష్ణన్ కూడా ఇవే ఆరోపణలు చేశాడు. సరిత ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. ఉమెన్ చాందీకి తాను లంచం ఇచ్చానని మరోసారి చెప్పింది. 'ముఖ్యమంత్రి చాందీకి 1.9 కోట్ల రూపాయల చెక్‌లను ఇచ్చాను. నేను ఇచ్చింది సీఎం సహాయక నిధికి కాదు. ఇది లంచంగా ఇచ్చింది' అని వెల్లడించింది. సోలార్ స్కాం కేసును విచారిస్తున్న రిటైర్డ్ జడ్జి ఎదుట తాను ఇదే విషయం చెప్పినట్టు ఇటీవల పేర్కొంది. రిటైర్డ్ జడ్జి ఎదుట సీఎం ఊమెన్ చాందీ కూడా హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు 11 గంటల పాటు చాందీ తన వాదన వినిపించారు. సోలార్ స్కాంలో 2013లో అరెస్టయిన సరిత.. బెయిల్ మీద విడుదలైనప్పటి నుంచి సీఎం మీద ఆరోపణలు గుప్పిస్తోంది. ఉమెన్ చాందీకి రూ. 2 కోట్ల లంచం ఇచ్చానని సరిత ఆరోపించడం కేరళ రాజకీయాలను కుదిపేసింది. -
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న మహిళా సునామీ!
సాక్షాత్తు ముఖ్యమంత్రికి రూ. 2 కోట్ల లంచం ఇచ్చానని చెప్పడానికి ఎన్నో గట్స్ కావాలి. అలాంటిది ఓ మహిళ ఎంతో సాహసం చేసి.. కేరళ ముఖ్యమంత్రి మీద ఆరోపణల సునామీ గుప్పించింది. చివరకు దాదాపు ముఖ్యమంత్రి మీద కేసు నమోదయ్యేంత పరిస్థితి ఏర్పడింది. అయితే చివరి నిమిషంలో కేరళ హైకోర్టు జోక్యం చేసుకుని ఎఫ్ఐఆర్ దాఖలు మీద రెండు నెలల స్టే విధించడంతో ఊమెన్ చాందీ ఊపిరి పీల్చుకున్నారు. ఆ మహిళ పేరు సరితా నాయర్. సోలార్ స్కాం నిందితులలో ఒకరు. 2013లోనే ఆమె ఈ కేసులో అరెస్టయినా.. మళ్లీ బెయిల్ మీద విడుదలై, అప్పటి నుంచి సీఎం మీద ఆరోపణలు గుప్పిస్తోంది. అసలే త్వరలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఇదంతా సీఎం తలకు భారంగా చుట్టుకుంటోంది. రాబోయే పదేళ్లలో కేరళను సంపూర్ణ మద్యరహిత రాష్ట్రంగా చేయాలనుకున్న తమ ప్రభుత్వ నిర్ణయం కారణంగా బార్ యజమానులు ఆగ్రహించి, సరితా నాయర్‌ను తమమీద ప్రయోగించారని సీఎం చాందీ ఆరోపిస్తున్నారు. కాగా, పారిశ్రామిక వేత్తలకు చవగ్గా సోలార్ ప్యానళ్లు సరఫరా చేస్తామని సరితా నాయర్ చెప్పింది గానీ, ఆమె అసలు సరఫరా చేయలేదని మంత్రులు ఆరోపిస్తున్నారు. కానీ ఆమె మాత్రం సోలార్ స్కాం కేసును విచారిస్తున్న రిటైర్డ్ జడ్జి ఎదుట కూడా తాను సీఎంకు రూ. 1.90 కోట్ల లంచం ఇచ్చినట్లు చెప్పేశారు. కాగా, గత సోమవారం నాడు రిటైర్డ్ జడ్జి ఎదుట సీఎం ఊమెన్ చాందీ దాదాపు 11 గంటల పాటు తన వాదన వినిపించారు. అవతలి వాళ్లు ఆయనను క్రాస్ ఎగ్జామిన్ కూడా చేశారు. అయితే ఇప్పటివరకు కేరళలో ఒక ముఖ్యమంత్రిని జ్యుడీషియల్ కమిషన్ విచారించడం మాత్రం ఇదే మొదటిసారి. దీనికి తోడు కేరళ కాంగ్రెస్ నాయకుడు ఒకరు సరితా నాయర్‌తో మాట్లాడుతున్నట్లుగా చెబుతున్న ఆడియో టేప్ లీకవ్వడం కూడా సర్కారు కష్టాలకు మరింత ఆజ్యం పోసింది. -
'సీఎంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి'
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సోలార్ కుంభకోణంలో ఏకంగా ఊమెన్ చాందీపైనే ఆరోపణలు రావడంతో ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వెంటనే దిగిపోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఆరోపణలు ఇలా కొనసాగుతుండగానే.. సోలార్ స్కాంలో స్థానిక విజిలెన్స్ కోర్టు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని గురువారం ఆదేశించింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తిరువనంతపురంలో వామపక్షాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వామపక్ష కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఝళిపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉమెన్ చాందీకి సోలార్ స్కాంలో ప్రధాన నిందితులైన సరితా నాయర్, బిజు రాధాకృష్ణణ్తో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. చౌక ధరలకు సౌరవిద్యుత్ అందిస్తామంటూ వారు పారిశ్రామికవేత్తలను మోసగించారు. తమ రాజకీయ ప్రాబల్యం ఉపయోగించుకొని బడాబడా కాంట్రాక్టులను సొంతం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో సీఎం వ్యక్తిగత సిబ్బందికి తాము రూ. 2 కోట్లు లంచం ఇచ్చినట్టు సరితా నాయర్ ప్రకటించడం కేరళలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. -
లంచగొండి మంత్రిని వెనకేసుకొచ్చిన సీఎం
లంచాలు తీసుకున్నారంటూ ఆరోపణలు వచ్చిన కేరళ ఆర్థికమంత్రి కేఎం మణిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వెనకేసుకొచ్చారు. హోటళ్లలో బార్లు కలిగి ఉన్న ఓ వ్యాపారవేత్త.. తనవద్దనుంచి ఆర్థికమంత్రి మణి లంచం తీసుకున్నారంటూ ఆరోపించారు. అయితే, అవి నిరాధార ఆరోపణలని, ఆయన తన వద్దకు కూడా ఈ ఆరోపణలతో వచ్చారని చాందీ అన్నారు. అసలు ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం లేదని, అసలు ఎప్పుడు, ఎక్కడ ఆయన్ను ఎలా కలిశారో చెప్పాల్సిందిగా కోరానని సీఎం చెప్పారు. కేరళలో తనకు చెందిన 418 బార్లు నడవాలంటే 5 కోట్ల రూపాయల లంచం ఇవ్వాల్సిందిగా ఆర్థికమంత్రి మణి డిమాండ్ చేసినట్లు బార్ యజమాని బిజు రమేష్ ఓ టీవీ ఛానల్ వద్ద ఆరోపించారు. తమ అసోసియేషన్ సభ్యులంతా కలిసి కోటి రూపాయలు రెండు వాయిదాల్లో ఇచ్చారని.. దాన్ని కొట్టాయంలోని మణి ఇంటివద్దే ఇచ్చామని ఆయన అన్నారు. తన ఆరోపణలు తప్పని రుజువైతే తన ఆస్తులన్నింటినీ కేరళ ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఆత్మాహుతి చేసుకోడానికీ సిద్ధమేనని అన్నారు.