కేరళ సీఎంకు తప్పిన ముప్పు
కొట్టాయం: కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి ముప్పు తప్పింది. రోడ్డు ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై జారిపోయింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కనే ఉన్న గోతిలోకి దూసుకెళ్లింది.కొట్టాయంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుసుకుంది.
అయితే ఈ ప్రమాదం నుంచి ఎటువంటి గాయాలు కాకుండా ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ బయటపడ్డారు. ఆయన క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. సీఎం గన్ మేన్ కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు వెంటనే వెల్లడికాలేదు. తాను సీటు బెల్టు పెట్టుకోవడంతో తనకు ఎటువంటి గాయాలు కాలేదని ఊమెన్ చాందీ తెలిపారు. ఎత్తుమనూర్ ప్రాంతం సమీపంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు.