కొచి: కేరళలోని కొట్టాయం జిల్లా కైపుజా గ్రామంలో ఒక కాలనీలో ఇళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ కాలనీలో ఉన్న 100కి పైగా ఇళ్లు అమ్మకానికి పెట్టారు. ఇవన్నీ ఎన్నారైలకు చెందిన ఇళ్లే. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి మెరుగైన జీవితం కోసం ప్రజలు వివిధ దేశాలకు వెళ్లిపోయారు. అక్కడ సంపాదించిన డబ్బులతో తమ ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో ఇళ్లు నిర్మించారు.
రిటైర్‌మెంట్ జీవితం ఆ ఇళ్లల్లోనే గడిపారు. వారి తదనంతరం పిల్లలు విదేశాల్లో స్థిరపడడంతో ఆ ఇళ్లన్నీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. సకల సౌకర్యాలు ఉన్న ఆ కాలనీ ఒకేసారి ఖాళీ అయిపోయింది. అయితే అక్కడ మంచి సదుపాయాలు ఉండడంతో చాలా మంది ఆ ఇళ్లను కొనడానికి మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment