Kerala cm
-
రోడ్డు పక్కన కూర్చుని కేరళ గవర్నర్ నిరసన
తిరువనంతపురం/కొల్లం: కేరళ గవర్నర్, వామపక్ష ప్రభుత్వం మధ్య విభేదాలు ముదిరిన నేపథ్యంలో శనివారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈసారి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ రోడ్డు పక్కన రెండు గంటలపాటు కూర్చుని దాదాపు ధర్నాకు దిగినంత పనిచేశారు. శనివారం ఉదయం కొట్టరక్కరలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనే ందుకు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ వెళ్తుండగా అధికార సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిలామెల్ వద్ద నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ‘సంఘీ చాన్సెలర్ గో బ్యాక్’అంటూ ఆయన్నుద్దేశించి నినాదాలు చేశారు. ఆగ్రహించిన గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ తన కారును ఆపించి, కిందికి దిగారు. తన వద్దకు రావాలంటూ పెద్దగా అరుస్తూ వారి సమీపానికి వెళ్లారు. దీంతో, పోలీసులు నినాదాలు చేస్తున్న ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు, గవర్నర్‌కు మధ్య అడ్డుగా నిలబడ్డారు. అనంతరం, గవర్నర్ సమీపంలోని దుకాణం నుంచి కుర్చీ తెప్పించుకుని రెండు గంటలపాటు రోడ్డు పక్కనే కూర్చున్నారు. నిరసనకారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను గట్టిగా డిమాండ్ చేశారు. నిరసనల్లో పాల్గొన్న 17 మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని చేతికి అందించాకే ఆయన నిరసన విరమించారు. ముఖ్యమంత్రి విజయన్ రాష్ట్రంలో అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్ర అధినేతగా వాటిని సహించబోనన్నారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే వామపక్ష ప్రభుత్వం తనపై దాడులకు ఉసిగొల్పుతోందని ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను గూండాలు, రోజువారీ కూలీలుగా ఆయన అభివరి్ణంచారు. దేశంలోని ఏరాష్ట్ర గవర్నర్ కూడా ఇలా వ్యవహరించ లేదని కేరళ విద్యామంత్రి వి.శివన్కుట్టి వ్యాఖ్యానించారు. నిలామెల్ ఘటన జరిగిన గంటలోపే ఆయనకు సీఆర్పీఎఫ్ బలగాలతో కూడిన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలి్పంచినట్లు కేంద్ర హోం శాఖ సమాచారం అందించిందని రాజ్‌భవన్ ప్రకటించింది. గవర్నర్ తిరిగి తిరువనంతపురంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనగా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అక్కడ కూడా నిరసనలు కొనసాగించడం గమనార్హం. -
శాసన వ్యవస్థపై ‘గవర్నర్ల’ దాడి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘దేశవ్యాప్తంగా సమాఖ్య వ్యవస్థ మీద దాడి జరుగుతోంది. కేరళపై ఇది ఇంకా తీవ్రంగా ఉంది. గవర్నర్ల రూపంలో శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోవడం నానాటికీ పెరుగుతోంది. బీజేపీ, ఆర్ఎస్ ఎస్ ఎజెండాను గవర్నర్ల ద్వారా అమ లు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గవర్నర్లను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుని, చట్టసభల కన్నా ఉన్నతంగా చూపేందుకు కేంద్రం కుట్రపన్నుతోంది. యూనివర్సిటీ చాన్స్లర్ల పేరుతో ఉన్నత విద్యపై ఆధిపత్యాన్ని సంపాదించుకోవాలని చూస్తోంది. ఇది రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం’అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. గురువారం ఖమ్మంలో తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం మూడవ రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయన్ మాట్లాడారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశంలో చారిత్రక ఉద్యమాలకు సీపీఎం నాంది పలికిందని, తెలంగాణ, కునప్రవేల, తెబాగలో జరిగిన పోరాటాలు ఇందుకు మచ్చుతునకలని అన్నారు. ఖమ్మంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన ప్రజలు గురుతర బాధ్యత ఖమ్మం ప్రజలదే.. ఈ దేశంలో తామే ప్రతిపక్షమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఎప్పుడూ నిజమైన ప్రతిపక్షంగా లేదని, బీజేపీకి రిక్రూట్మెంట్ ఏజెన్సీగా పనిచేస్తోందని విజయన్ ఆరోపించారు. బీజేపీలోకి కాంగ్రెస్ తన కేడర్‌ను పంపిస్తోందన్నారు. వామపక్షాల్లో సీపీఎం మాత్రమే నిజమైన ప్రతిపక్షంగా దేశంలో కనిపిస్తోందని.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తోందని చెప్పారు. వచ్చే పార్లమెంట్, శాసనసభ ఎన్నికల్లో సీపీఎంను దేశవ్యాప్తంగా, తెలంగాణలోనూ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఖమ్మం ప్రజలపై ఈ గురుతర బాధ్యత ఉందని చెప్పారు. కార్మికులు, శ్రామికులు, రైతులు హక్కుల కోసం పోరాడాలని, అలాంటి పోరాటాలకు ఖమ్మం సభ నాంది కావాలని పిలుపునిచ్చారు. కాగా, సుస్థిర అభివృద్ధిలో దేశంలో కేరళ ది బెస్ట్ అని ఐక్యరాజ్య సమితి ప్రశంసించిందని, అలాగే ఎన్డీఏ ఆధీనంలోని నీతి ఆయోగ్ కూడా కేరళ నంబర్‌వన్ రాష్ట్రంగా అభివర్ణించిందని చెప్పారు. కేరళలోని ప్రభుత్వరంగ సంస్థలను మోదీ ప్రభుత్వం విక్రయించాలని చూస్తే తమ ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసిందన్నారు. సభకు వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య అధ్యక్షత వహించారు. కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చే వారిదే గెలుపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి చవిచూపిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతుతోనే గెలిచామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు. పొత్తులు ఎన్నికల సమయంలోనే ఉంటాయని, వీటిపై ఇప్పటివరకు ఎక్కడా చర్చించలేదని చెప్పారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కమ్యూనిస్టులు ఎవరికి మద్దతు ఇస్తే వారిదే గెలుపు అని జోస్యం చెప్పారు. మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కార్మికసంఘం, సీపీఎం శ్రేణులు భారీగా తరలివచ్చాయి పెవిలియన్ గ్రౌండ్ నుంచి సభా ప్రాంగణం వరకు రెడ్‌షర్ట్ వలంటీర్లు కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్, పార్టీ నేతలు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
సీఎంను చంపేందుకు కేరళ వెళ్తా..
దుబాయ్ : కేరళ సీఎం పినరయి విజయన్ను హతమారుస్తానంటూ దుబాయ్‌కు చెందిన భారతీయుడు హెచ్చరించడం కలకలం రేపింది. సీఎంను అంతమొందించేందుకు త్వరలో కేరళ వెళతానని ఆర్ఎస్ఎస్ మద్దతుదారుడైన కృష్ణకుమార్ ఎస్ఎన్ నాయర్ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడని ఖలీజ్ టైమ్స్ పత్రిక తెలిపింది. తాను మాజీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తనని, మళ్లీ చురుకుగా సంఘ్ కార్యకలాపాల్లో పాల్గొంటానని..ఉద్యోగానికి రాజీనామా చేసి కేరళ వెళతానని ఈ వీడియోలో నాయర్ పేర్కొన్నారు. కేరళ సీఎంను చంపేందుకు తాను రెండు మూడు రోజులు అక్కడే ఉంటానని, తన జీవితం ఏమై పోయినా తనకు బాధలేదని అన్నారు. ఓ వ్యక్తిని అంతమొందించాలని మనం అనుకుంటే మనం ఆ పని పూర్తిచేయాల్సిందేనని ఆ నాలుగు నిమిషాల వీడియోలో చెప్పుకొచ్చారు. అబుదాబికి చెందిన టార్గెట్ ఇంజనీరింగ్ కన్స్ర్టక్షన్ కంపెనీలో సీనియర్ రిగ్గింగ్ సూపర్వైజర్గా పనిచేసే నాయర్ విజయన్ను దుర్భాషలాడుతూ ఆయన కులంపైనా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఫేస్బుక్లో చేసిన పోస్ట్‌కు గాను నాయర్‌ను బుధవారం విధుల నుంచి తొలగించారు. అన్ని లాంఛనాలు పూర్తయిన వెంటనే ఆయనను కేరళకు పంపనున్నారు. తన ఉద్యోగం పోయిందని, తనపై ఎలాంటి చర్యలూ చేపట్టినా తాను సిద్ధంగా ఉన్నానని..ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ మద్దతుదారుగానే కొనసాగుతానని నాయర్ చెప్పారు. తీవ్ర వ్యాఖ్యలు చేసిన తనను మన్నించాలని పినరయి విజయన్ను ఆయన వేడుకున్నారు. -
రెండేళ్ల పోరాటం.. దిగొచ్చిన ప్రభుత్వం!
అది ఉద్యోగమైనా.. ఉన్నత పదవులైనా.. చివరకు న్యాయం కోసం చేసే పోరాటమైనా.. ఎదుటివారు దిగిరావాల్సిందే. మనది ప్రజాస్వామ్యమే అయినప్పటికీ న్యాయం కోసం అడుగడుగునా పోరాటాలు దేశంలో సాధారణమే. అందుకే ఇలాంటి పోరాటాలను ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు. ఓ యువకుడి విషయంలో కూడా ప్రభుత్వం తన పాతవైఖరినే ప్రదర్శించింది. అయితే ఆ యువకుడు మాత్రం పట్టుదలగా పోరాడాడు. రోజులు.. వారాలు.. నెలలు కాదు, ఏకంగా రెండేళ్లపాటు పోరాటాన్ని కొనసాగించాడు. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వమే దిగొచ్చింది. వివరాల్లోకెళ్తే... సాక్షి, స్కూల్ ఎడిషన్ అన్యాయంపై చేసే పోరాటానికి అలుపు ఉండకూడదనేది మొదటి లక్షణంగా చెబుతారు. అందుకే కేరళకు చెందిన శ్రీజిత్.. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా రాష్ట్ర సచివాలయం ముందు పోరాటాన్ని ప్రారంభించాడు. ఓ దోపిడీ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీజిత్ సోదరుడు శ్రీజీవ్‌ను 2014, మేలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే అతను పోలీస్ కస్టడీలో మరణించాడు. శ్రీజీవ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వాదించారు. కానీ శ్రీజిత్ మాత్రం అంగీకరించలేదు. తన సోదరుడిని పోలీసులే చంపారని, దీనికి బాధ్యులైన ఇద్దరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఇదే డిమాండ్‌తో తిరువనంతపురంలోని సెక్రటేరియట్ దగ్గరికి వెళ్లడం, రోజంతా అక్కడ కూర్చోవడం.. న్యాయం చేయాలని డిమాండ్ చేయడం.. అలా 765 రోజులపాటు పోరాడి, చివరకు అనుకున్నది సాధించాడు. ఈ నెల 14న సీఎం పినరయి విజయన్ శ్రీజిత్‌ను కలిసి మరోసారి సీబీఐకి లేఖరాస్తానని హామీ ఇచ్చారు. దీంతో అతను తన నిరసనను విరమించుకున్నాడు. -
కమ్యూనిస్టుల హత్యా రాజకీయాలకు 120 మంది బలి
-
కాషాయానికి దూరం అంటున్న కమల్
తిరువనంతపురం: రాజకీయ అరంగేట్రంపై స్పష్టమైన సంకేతాలు పంపిన కమల్ హాసన్ తాజాగా వామపక్ష నేతలను హీరోలుగా అభివర్ణించారు. కామ్రేడ్లపై పొగడ్తల వర్షం కురిపిస్తూ కాషాయానికి తాను దూరమని తేల్చిచెప్పారు. శుక్రవారం కేరళ సీఎం పినరయి విజయన్ను కలిసిన అనంతరం కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నలభైఏళ్లుగా సినిమాలో నా వేషభాషలు, హావభావాలు చూశారు...ఇవన్నీ నేను కాషాయానికి దూరమన్నది తేటతెల్లం చేస్తా’ యన్నారు. వామపక్షాలతో కలిసి పనిచేస్తారా అన్న ప్రశ్నకు వేచిచూడండని బదులిచ్చారు. విజయన్‌తో కమల్ రాజకీయ అంశాలపై మంతనాలు జరిపినా చర్చల సారాంశాన్ని వెల్లడించేందుకు ఇరువురు నిరాకరించారు. కమల్ తమను స్నేహపూర్వకంగా కలిశారని, రాజకీయాలు కూడా చర్చకు వచ్చాయని భేటీ అనంతరం విజయన్ తెలిపారు. -
కార్మికుడి కుటుంబానికి సీఎం క్షమాపణ
టీ.నగర్: కొల్లం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తమిళనాడు కార్మికుడి కుటుంబానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం బహిరంగ క్షమాపణ చెప్పారు. తిరునెల్వేలి జిల్లా దురై నివాస గృహాలకు చెందిన మురుగన్ (30), అతడి స్నేహితుడు ముత్తు.. కేరళలోని కొల్లం జిల్లా సాత్తనూరు సమీపంలో ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రి సహా ఆరు ఆస్పత్రులకు తీసుకెళ్లినప్పటికీ న్యూరోసర్జన్, వెంటిలేటర్ సౌకర్యం లేదని తెలుపుతూ చికిత్సలు అందించేందుకు నిరాకరించారు. దీంతో మురుగన్ మృతి చెందాడు. ఈ ఘటనపై పినరయి విజయన్ గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. సకాలంలో చికిత్స చేయకపోవడం వల్లే మురుగన్ మృతి చెందాడని తెలిపారు. 'రాష్ట్రం, ప్రజల తరపున మురుగన్ కుటుంబానికి క్షమాపణ చెబుతున్నాను. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకుంటాం. ఇందుకోసం చట్టం తెస్తాం లేదా ప్రస్తుతం ఉన్న నిబంధనలు మారుస్తామ'ని ఆయన ప్రకటించారు. ఈ దారుణోదంతం తమ రాష్ట్రానికి మచ్చగా భావిస్తున్నామని, దీనిపైసమగ్ర విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చిన వెంటనే అతని కుటుంబానికి నష్టపరిహారం అందిస్తామని విజయన్ తెలిపారు. మరోవైపు చికిత్స నిరాకరించిన ఐదు ఆస్పత్రులపై ఐపీసీ సెక్షన్ 304 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
సీపీఎం సభకు అనుమతి రద్దు
హైదరాబాద్: సీపీఎం చేపట్టిన మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 19న నిజాం కాలేజ్ గ్రౌండులో తలపెట్టిన సభకు ఇచ్చిన అనుమతిని పోలీసులు రద్దు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విచ్చేస్తున్నారు. అయితే ఆయన రాకను ఆర్ఎస్ఎస్, ఇతర అనుబంధ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాగా, పోలీసులు అనుమతి ఇవ్వకున్నా అదే రోజు మరోచోట సభ నిర్వహిస్తామని సీపీఎం వర్గాలు స్పష్టం చేశాయి. -
కేరళ సీఎంపై RSS నేత వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఔనా! నిజమా! కేరళ సీఎం పన్నీర్ సెల్వం!
'కేరళ ముఖ్యమంత్రి శ్రీ పన్నీర్ సెల్వం, ఆయన అధికార బృందంతో భేటీ అయ్యాను' అంటూ ఏకంగా కేంద్రమంత్రి ట్వీట్ చేయడంతో నెటిజన్లు బిత్తరపోయారు. తమిళనాడు ముఖ్యమంత్రి, జయలలిత వీరవిధేయుడైన పన్నీర్ సెల్వం కేరళకు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారంటూ తికమకపడ్డారు. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారు వ్యవహారాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఇలా పొరపాటున ట్వీట్ చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్ ఆయనను కలువగా.. పాశ్వాన్ మాత్రం తనను కలిసింది కేరళ సీఎం పన్నీర్‌సెల్వం అంటూ పోస్టు చేశారు. కేంద్రమంత్రి అయి ఉండి ఆయన ఇలా పొరపాటు చేయడంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. పాశ్వాన్ రాహుల్ గాంధీతో పోటీపడుతున్నారా? అంటూ సెటైర్లు వేశారు. తాను స్వయంగా ఎవర్ని కలిసింది కూడా ఆయనకు తెలియకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ క్రమంలో పొరపాటును గుర్తించిన పాశ్వాన్ పాత ట్వీట్‌ను డిలీట్ చేసి.. కేరళ సీఎం పినరయి విజయన్ అంటూ కరెక్ట్ పోస్టుపెట్టారు. -
గెస్ట్ హౌస్‌లో సీఎం డోర్ లాక్ చేయబోతే..!
త్రివేండ్రం: కేరళ ముఖ్యమంత్రి పనరయి విజయన్ బస చేసిన గెస్ట్ హౌస్‌లో డోర్ లాక్ రిపేరి చేయించనందుకు అసిస్టెంట్ ఇంజినీర్‌ను సస్పెండ్ చేశారు. ఎర్నాకుళం జిల్లాలోని అలువా ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో డిసెంబర్ 30 నుంచి జనవరి 1వ తేదీ వరకు విజయ్ బస చేశారు. గెస్ట్ హౌస్‌లో విజయన్ బస చేసిన 107 గదికి డోర్ లాక్ చెడిపోయింది. మొదటి రోజు కేరళ సీఎం గది లోపల డోర్ లాక్ వేసేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. అధికారులు ప్రయత్నించి చూసినా వీలుకాలేదు. ఆ మరుసటి రోజు సీఎం భద్రత సిబ్బంది ఈ విషయాన్ని గెస్ట్ హౌస్ మేనేజర్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు వెంటనే కార్పెంటర్లను పిలిపించి డోర్ లాక్‌ను సరిచేయించారు. ఆ తర్వాత విజయన్ డోర్ లాక్ చేసేందుకు ప్రయత్నించగా మళ్లీ పడలేదు. దీంతో ఆగ్రహం చెందిన సీఎం తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, సామన్యుల పరిస్థితి ఏంటని అధికారులపై మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ చేసిన అధికారులు, ఇందుకు బాధ్యుడిగా ప్రజాపనుల శాఖ ఏఈని సస్పెండ్ చేశారు. ఈ దెబ్బకు అలువా గెస్ట్ హౌస్‌లో అన్ని డోర్లను రిపేర్ చేయడమో లేక మార్చడేమో చేశారు. ఇదిలావుండగా, ఇదే గెస్ట్ హౌస్‌లో రూమ్ నెంబర్ 107వ గదిలో గతంలో మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ బస చేసేవారు. ఇక్కడి నుంచే ఆయన చాలా నిర్ణయాలు తీసుకున్నారు. కాగా ఆయనెప్పుడూ గదిలోపల డోర్ లాక్ చేసుకోలేదట. అత్యంత భద్రత ఉండే ముఖ్యమంత్రికి డోర్ లాక్ చేసుకోవాల్సిన అవసరముందా అని అచ్యుతానందన్ వర్గీయలు ప్రశ్నించారు. -
25న విజయన్ ప్రమాణం
తిరువనంతపురం: కేరళ సీఎంగా పినరయి విజయన్ ఈ నెల 25న ప్రమాణస్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఎల్డీఎఫ్ కేబినెట్ ప్రమాణ స్వీకారం చేస్తుందని ఆయన శనివారం తెలిపారు. ఆదివారం కూటమి పార్టీలు సమావేశమై మంత్రివర్గ కూర్పుపై చ ర్చిస్తాయన్నారు. అనంతరం పార్టీ సీనియర్ నేత వి.అచ్యుతానందన్‌ను ఆయన ఇంట్లో కలసి ప్రమాణస్వీకారంపై చర్చించారు. ప్రమాణానికి హాజరుకావాలని కోరారు. నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అచ్యుతా నందన్ సూచించారు. కాగా, ఈ నెల 27న పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణానికి ప్రధాని మోదీతో పాటు పలువురు విదేశీ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. -
సీపీఎం సంచలన నిర్ణయం
కేరళలో ఎల్డీఎఫ్కు విజయాన్ని అందించిన కురువృద్ధుడు వీఎస్ అచ్యుతానందన్‌కు చుక్కెదురైంది. పినరయి విజయన్ను ముఖ్యమంత్రిగా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిలో ఎవరుండాలనే విషయాన్ని నిర్ణయించేందుకు సీపీఎం రాష్ట్ర కమిటీ శుక్రవారం ఉదయం తిరువనంతపురంలో సమావేశమైంది. ఈ సమావేశానికి అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాష్ కరత్ తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలోనే.. విజయన్ను ముఖ్యమంత్రిగా చేస్తామని అగ్రనేతలు చెప్పడంతో అచ్యుతానందన్ నొచ్చుకుని సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది. అయితే సమావేశం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికారికంగా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం గురించి ఇంకా ఎక్కడా ప్రకటించలేదు. 92 ఏళ్ల వయసులో కూడా లెఫ్ట్ ఫ్రంట్ విజయం కోసం కష్టపడిన తనను కనీసం కొన్నాళ్లయినా ముఖ్యమంత్రి పదవిలో ఉండనిచ్చి, ఆ తర్వాత పినరయి విజయన్(72)కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అచ్యుతానందన్ నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన సమావేశం జరుగుతుండగా మధ్యలోనే లేచి అక్కడి నుంచి తన నివాసానికి వెళ్లిపోయారని అంటున్నారు. -
కేరళ సీఎంకు తప్పిన ముప్పు
కొట్టాయం: కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి ముప్పు తప్పింది. రోడ్డు ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై జారిపోయింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కనే ఉన్న గోతిలోకి దూసుకెళ్లింది.కొట్టాయంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఎటువంటి గాయాలు కాకుండా ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ బయటపడ్డారు. ఆయన క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. సీఎం గన్ మేన్ కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు వెంటనే వెల్లడికాలేదు. తాను సీటు బెల్టు పెట్టుకోవడంతో తనకు ఎటువంటి గాయాలు కాలేదని ఊమెన్ చాందీ తెలిపారు. ఎత్తుమనూర్ ప్రాంతం సమీపంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. -
కేరళ సీఎంతో ఎంపీ కవిత భేటీ
తిరువనంతపురం: పసుపునకు కనీస మద్దతు ధర కల్పించడం, పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని నిజామాబాద్ ఎంపీ కవిత కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కోరారు. పసుపు రైతుల సంక్షేమం కోసం పసుపు బోర్డును జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని, పసుపు మద్దతు ధరను కేంద్రం నిర్ణయించేలా ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తేవాలని విన్నవించారు. తిరువనంతపురంలోని సీఎం కార్యాలయంలో ఊమెన్ చాందీని కవితతో పాటు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, విద్యాసాగర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి కలసి ఓ లేఖ అందజేశారు. 'పసుపు రైతులకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడం వలన కష్టాలు పడుతున్నారు. మద్దతు ధర లేకపోవడం వల్ల దళారీలు లాభపడుతున్నారు. పసుపు రైతుల సమస్యల పరిష్కారం కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. పసుపును ప్రధానంగా ఆహారంలో, మందుల్లో, సౌందర్య సాధనాల్లో, హెయిర్ డై, వస్త్ర పరిశ్రమల్లో వాడుతున్నారు. విదేశాలకు అధికంగా ఎగుమతి అవుతున్న ఈ పంటకు మన దేశంలో కనీస మద్దతు ధర లేదు. పసుపు ప్రస్తుతం స్పైస్ బోర్డులో భాగంగా ఉంది. ఇది పసుపుతో పాటు దాదాపు ఇతర 54 పంటలను పర్యవేక్షిస్తోంది. అలా కాకుండా ఇప్పటికే ఉన్న పొగాకు, కాఫీ బోర్డుల వలే ఒక ప్రత్యేక బోర్డు పసుపు పంటకు ఉండడం అవసరం' అని లేఖలో పేర్కొన్నారు. 2014-15 సంవత్సరంలో కేరళ ప్రభుత్వం పసుపు రైతులకు హెక్టారుకు 12,500 రూపాయలను ఆర్థిక సహాయంగా అందించడంతో ఎర్నాకులం, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కొల్లాం జిల్లాల పసుపు రైతులకు మేలు జరిగిందని కవిత ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. బోర్డు ఏర్పాటు వల్ల కేరళకు చెందిన అల్లెప్పీ రకం పసుపు ఎగుమతులు పెరుగుతాయని కవిత చెప్పారు. కేరళ సీఎం ఊమెన్ చాందీ స్పందిస్తూ.. పసుపు పంటకు మద్దతు ధరను సాధించడం కోసం కేంద్రం పై సమష్టిగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోరుతూ తమ రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. కవిత గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లను కలసి పసుపు బోర్డు ఏర్పాటు చేసి, కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో కూడా సమావేశమయ్యారు. -
ముఖ్యమంత్రికి భారీ ఊరట
కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి భారీ ఊరట లభించింది. ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా విజిలెన్సు కోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ హైకోర్టు రెండు నెలల స్టే విధించింది. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రి అరయదాన్ మహ్మద్‌పై సోలార్ స్కాంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ విజిలెన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది. విజిలెన్స్ కోర్టు తన అధికారాల విస్తృతి, కేసు తీరు గురించి తెలుసుకోకుండా మెకానికల్‌గా ప్రవర్తించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రైవేటు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతించేందుకు సీఎం ఊమెన్ చాందీకి తాము భారీ మొత్తంలో లంచాలు ఇచ్చినట్లు సరితా నాయర్ తదితరులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే సీఎంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని కేరళ విజిలెన్స్ కోర్టు ఆదేశించింది. -
ఓ మహిళతో సీఎం.. ఆ వీడియో ఉంది!
► కేరళ సోలార్ స్కాం ప్రధాన నిందితుడి ఆరోపణ ► విచారణ కమిషన్ ముందు రాధాకృష్ణన్ వెల్లడి ► సీఎం ఊమెన్ చాందీ సహా ఆరుగురు నేతలపై ఆరోపణలు కొచ్చి కేరళ సోలార్ ప్యానల్ స్కాం సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఏకంగా ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ సహా ఆరుగురు ప్రముఖ నేతలంతా ఓ మహిళతో కలిసి ఉండగా కెమెరాకు పట్టుబడ్డారని ఈ స్కాంలో ప్రధాన నిందితుడు బిజు రాధాకృష్ణన్ ఆరోపించారు. సరితా నాయర్ అనే ఆ మహిళతో వాళ్లు విడివిడిగా ఉన్నప్పటి వీడియోలన్నీ తన దగ్గర ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే, సరితా నాయర్ మాత్రం రాధాకృష్ణన్ ఆరోపణలను ఖండించారు. దమ్ముంటే వీడియోలు చూపించాలని డిమాండ్ చేశారు. సరితా నాయర్ ఆ నాయకులెవ్వరికీ తెలియకుండా ఈ వీడియోలు తీసిందని, అవి బ్లాక్ మెయిల్ కోసమో, లేదా ఆత్మరక్షణ కోసం తీసిందో తనకు తెలియదని సోలార్ స్కాంను విచారిస్తున్న జస్టిస్ శివరాజన్ కమిషన్ వద్ద రాధాకృష్ణన్ చెప్పారు. ఆమె అరెస్టు కావడానికి రెండు వారాల ముందు ఆ వీడియోలు తనకు ఇచ్చిందని, వాటిలో ఐదింటిని తాను సీఎం ఊమెన్ చాందీకి చూపించానని, ఆరోది మాత్రం స్వయంగా ఆయనే ఉండబట్టి చూపించలేదని అన్నారు. కమిషన్ అవసరం అనుకుంటే వాటిని అందిస్తానని చెప్పారు. అయితే సీఎం, ఇతర నాయకులెవ్వరూ ఇంతవరకు దీన్ని ఖండించలేదు కూడా. చాందీ లంచం తీసుకున్నారని రాధాకృష్ణన్ గతంలో ఆరపించారు. తాను స్వయంగా రూ. 5.5 కోట్లు ఇచ్చానని, రాష్ట్రంలో రెండు పెద్ద సోలార్ ప్రాజెక్టులు పెట్టడానికి ఈ మొత్తం ఇచ్చానని అన్నారు. నిందితుడికి సహకరించారన్న ఆరోపణలతో చాందీ కార్యాలయంలో వ్యక్తిగత సహాయకులను అరెస్టు చేయడంతో సోలార్ స్కాం కాస్తా బాగా పెద్దదైంది. రాధాకృష్ణన్ తాజా ఆరోపణల నేపథ్యంలో సీఎం చాందీ రాజీనామా చేయాలని విపక్ష నేత వీఎస్ అచ్యుతానందన్ డిమాండ్ చేశారు.