ముఖ్యమంత్రికి భారీ ఊరట
కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి భారీ ఊరట లభించింది. ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా విజిలెన్సు కోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ హైకోర్టు రెండు నెలల స్టే విధించింది. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రి అరయదాన్ మహ్మద్‌పై సోలార్ స్కాంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ విజిలెన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది.
విజిలెన్స్ కోర్టు తన అధికారాల విస్తృతి, కేసు తీరు గురించి తెలుసుకోకుండా మెకానికల్‌గా ప్రవర్తించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రైవేటు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతించేందుకు సీఎం ఊమెన్ చాందీకి తాము భారీ మొత్తంలో లంచాలు ఇచ్చినట్లు సరితా నాయర్ తదితరులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే సీఎంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని కేరళ విజిలెన్స్ కోర్టు ఆదేశించింది.