మ్యూజియంలో అనంతుని నిధి నిక్షేపాలు
తిరువనంతపురం : అనంత పద్మనాభస్వామి దేవాలయం నేలమాళిగల్లో కనుగొన్న నిధినిక్షేపాలను సుప్రీంకోర్టు అనుమతిస్తే మ్యూజియంలో ప్రదర్శించడానికి కేరళ ప్రభుత్వం సిద్ధమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తెలిపారు. ఈ తరహా నిధులు ప్రపంచంలో మరెక్కడా లేవని, ట్రావెన్కోర్ మాజీ రాజకుటుంబం ఈ నిధులను ఇప్పటివరకూ కాపాడటం వారి నిజాయితీకి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసిన రాజకుటుంబాన్ని విమర్శించటం తగదన్నారు. ఆలయ సందపను అక్రమంగా తరలిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన ప్రతినిధి సమర్పించిన నివేదిక తమకు అందలేదని, ఈ కేసు ఆగస్టు 6న కోర్టు ముందుకు విచారణకు రానుందని సీఎం తెలిపారు.