నరేంద్ర మోదీ, ఊమెన్ చాందీ (ఫైల్ ఫోటో)
సాక్షి, విజయవాడ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఊమెన్ చాందీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్వతంత్రంగా బలపడి అధికారాన్ని చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజారంజక పాలన కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఉద్ఘాటించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యాననీ.. పార్టీ బలోపేతానికి మూడు నెలల్లో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని అన్నారు. దేశాన్ని వెలిగిపోయేలా చేస్తామని గద్దెనెక్కిన నరేంద్ర మోదీ నాలుగేళ్లుగా వెలగబెట్టిందేం లేదని విమర్శించారు.
డీజిల్, పెట్రోల్ ధరలను ఇష్టారీతిన పెంచుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేంద్రం ప్రభుత్వంపై మండిపడ్డారు. పెరిగిన ఇంధన ధరలతో ఇప్పటికే సామాన్యుడి జేబుకు చిల్లులు కాదు.. బొక్కలు పడుతున్నాయనీ, దానికితోడు పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీలు ఎత్తివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు తన నాలుగేళ్ల అసమర్థ పాలన నుంచి జనం దృష్టిని మరల్చేందుకే ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment