
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. మలయాళ నటుడు కొచ్చు ప్రేమన్ 68ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన అసలు పేరు కెఎస్ ప్రేమ్ కుమార్. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళలోని తిరువనంతపురంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండు దశాబ్దాల పాటు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆయన ఎక్కువగా కామెడీ రోల్స్‌తో గుర్తింపు పొందారు.
నాటకాల ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆయన పలు విజయవంతమైన సినిమాలు, సీరియల్స్‌లో ఆయన నటించారు. కొచ్చు ప్రేమన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.