
తిరువనంతపురం: ప్రముఖ మలయాళ నటి శరణ్య శశి (35) కన్నుమూశారు. కేరళ త్రివేండ్రంలోని ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం(ఆగస్టు9)న తుదిశ్వాస విడిచారు. పదేళ్ల క్రితం ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్థారణ కావడంతో అప్పటి నుంచి శరణ్యకు 11 పెద్ద శస్త్రచికిత్సలు జరిగాయి. ఆ సమయంలోనే తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న శరణ్యకు పరిశ్రమలోని పలువురి నటులు సహాయం అందించారు.
అయితే కొన్ని వారాల క్రితం ఆమెకు కరోనా సోకడంతో మరోసారి ఆమె తీవ్ర అనారోగ్యం బారిన పడింది. న్యుమోనియాతో పాటు రక్తంలో స్టోడియం స్థాయిలు పడిపోవడంతో కొన్ని రోజుల పాటు కేరళలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శరణ్య చికిత్స పొందింది. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడటంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి సోమవారం కన్నుమూసింది. మంత్రకోడి, సీత మరియు హరిచందనం సహా పలు మలయాళ టీవీ సిరియల్స్‌తో బాగా పాపులర్ అయిన శరణ్య పలు సినిమాల్లో సహాయక పాత్రలను కూడా పోషించింది.
Comments
Please login to add a commentAdd a comment