
కొచ్చి : ప్రముఖ పాదరక్షల సంస్థ పారగాన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుదవారం ఉదయం అకస్మాత్తుగా సంస్థ గౌడోన్‌లో మంటలంటు కున్నాయి. ఐదు అంతస్తుల భవనమంతా వ్యాపించిన అగ్ని కలలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన అలుముకుంది. దీంతో తీవ్ర ఆందోళన నెలకొన్న నేపథ్యంలో సమీప భవనాలను ఖాళీ చేయించారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రాంతానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
ఎర్నాకుళం దక్షిణ రైల్వే స్టేషన్ సమీపంలోని పారగాన్ చెప్పుల బ్రాండ్ గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు అగ్నిమాపక శకటాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.తాజా సమాచారం ప్రకారం ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది.
Massive fire broke out at Paragon footwear godown in Kochi. Apparently no persons injured. Fire and rescue officials struggling to put out fire.#Kochi #Fire pic.twitter.com/kHminnPbsG
— Neethu Joseph (@neethujoseph_15) February 20, 2019