
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నీకి సంబంధించిన ఆటగాళ్ల వేలం కార్యక్రమానికి కేరళలోని కొచ్చి నగరం వేదిక కానుంది. డిసెంబర్ 23న ఈ కార్యక్రమం నిర్వహిస్తామని బీసీసీఐ తెలిపింది.
ఈసారి మెగా వేలం కాకుండా మినీ వేలం ఉంటుందని, ఈనెల 15వ తేదీలోపు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలను సమర్పించాలని ఫ్రాంచైజీలను కోరినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టర్కీలోని ఇస్తాంబుల్ నగరంతోపాటు బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో ఐపీఎల్ వేలం నిర్వహించాలని బీసీసీఐ భావించింది. చివరకు కొచ్చి నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.