BCCI (Board of Control for Cricket in India)
-
మళ్ళీ కోహ్లీని కెలుకుతున్న గంభీర్, నవీన్.. BCCIకి లేఖ రాసిన కోహ్లీ
-
IPL 2023: వచ్చే నెల 23న ఐపీఎల్ వేలం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నీకి సంబంధించిన ఆటగాళ్ల వేలం కార్యక్రమానికి కేరళలోని కొచ్చి నగరం వేదిక కానుంది. డిసెంబర్ 23న ఈ కార్యక్రమం నిర్వహిస్తామని బీసీసీఐ తెలిపింది. ఈసారి మెగా వేలం కాకుండా మినీ వేలం ఉంటుందని, ఈనెల 15వ తేదీలోపు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలను సమర్పించాలని ఫ్రాంచైజీలను కోరినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టర్కీలోని ఇస్తాంబుల్ నగరంతోపాటు బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో ఐపీఎల్ వేలం నిర్వహించాలని బీసీసీఐ భావించింది. చివరకు కొచ్చి నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. -
IPL లో మరో రెండు కొత్త జట్లు ఎంట్రీ
-
మ్యాగజైన్ స్టోరీ 18th September 2021
-
టి20లకు సారథ్యం వహించను: కోహ్లి
భారత క్రికెట్లో కీలక పరిణామం. మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు నాయకత్వం వహిస్తున్న విరాట్ కోహ్లి టి20 కెపె్టన్సీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే ప్రపంచకప్ తర్వాత తాను సారథ్యాన్ని వదిలేస్తానని అతను స్వయంగా ప్రకటించాడు. పని భారం తగ్గించుకునేందుకే అంటూ కోహ్లి చెప్పుకున్నా... రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి పెరుగుతున్న డిమాండ్లు సహా ఇతర అంశాలు కూడా అతనిపై ప్రభావం చూపించి ఉండవచ్చు. అన్నింటిని మించి టి20 వరల్డ్‌కప్ తర్వాత తప్పుకునేట్లయితే టోర్నీకి ముందు అలాంటి ప్రకటన చేయడం మాత్రం అనూహ్యం. ముంబై: సోమవారం... టి20 ఫార్మాట్ కెపె్టన్సీ నుంచి కోహ్లి తప్పుకోనున్నట్లు మీడియాలో వార్తలు. దీనిని ఖండించిన బీసీసీఐ ప్రతినిధులు... సారథిగా కోహ్లినే కొనసాగుతాడని, అసలు భారత క్రికెట్లో వేర్వేరు కెప్టెన్ల పద్ధతి పని చేయదని స్పష్టీకరణ! గురువారం... టి20 వరల్డ్‌కప్ తర్వాత కెపె్టన్‌గా ఉండనని కోహ్లి మనసులో మాటను వెల్లడించగా, గత ఆరు నెలలుగా దీనిపై తాము చర్చిస్తున్నామని బోర్డు ప్రకటన! మొత్తంగా సారథి హోదాలో తన తొలి టి20 ప్రపంచకప్ తర్వాత ఆ బాధ్యతల నుంచే దూరమయ్యేందుకు విరాట్ నిర్ణయించుకున్నాడు. ధోని రాజీనామాతో జనవరి 26, 2017న తొలిసారి టి20 మ్యాచ్‌లో భారత్‌కు కోహ్లి కెపె్టన్‌గా వ్యవహరించగా... ఇప్పటి వరకు తన 90 అంతర్జాతీయ మ్యాచ్‌లలో సగం మ్యాచ్‌లు (45) అతను సారథిగా మైదానంలోకి దిగాడు. చదవండి: అంతా గంభీర్ భయ్యా వల్లే.. లేదంటే రోడ్డు మీద పానీపూరీ అమ్ముకునేవాడిని సరైన నిర్ణయమేనా! కోహ్లి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు భారత్ 67 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 22 మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అతను మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ 45 మ్యాచ్‌లే ఆడాడు. కాబట్టి పని భారం అనలేం! కోహ్లి స్థాయి ఆటగాడు ఇకపై ఏడాదికి 10–12 మ్యాచ్‌లలో నాయకత్వ బాధ్యతలకు దూరంగా ఉంటే పెద్ద తేడా ఏముంటుంది. 45 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తే 27 గెలిచి, 14 ఓడిపోగా, మరో 2 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. ఇది మెరుగైన రికార్డే. పైగా ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లలో టి20 సిరీస్‌లు గెలిచిన ఏకైక ఆసియా కెపె్టన్‌గా ఘనత. కాబట్టి కెపె్టన్‌గా విఫలమయ్యాడని చెప్పలేం! 2017 నుంచి ఓవరాల్‌గా చూస్తే టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో (1,502) ఉన్నాడు. ఎంతో మంది రోహిత్ అద్భుతం అని చెబుతున్నా... ఈ కాలంలో రోహిత్‌తో పోలిస్తే 5 ఇన్నింగ్స్‌లు తక్కువ ఆడి కూడా అతనికంటే (1,500) రెండు పరుగులు ఎక్కువే చేశాడు. అంటే సారథ్యంలోనూ బ్యాట్స్‌మన్‌గా సూపర్ సక్సెస్! మరి తప్పుకోవడానికి బలమైన కారణం ఏమిటి? పైగా భారత జట్టు నాయకత్వానికి సంబంధించి ఆరు నెలలుగా తమ మధ్య చర్చలు సాగుతున్నాయని జై షా చెప్పడం మాత్రం కాస్త ఆశ్చర్యం కలిగించింది. అంటే ఇదేమీ కోహ్లి అనూహ్య నిర్ణయం కాదని అనిపిస్తోంది. గణాంకాల లోతుల్లోకి వెళ్లకుండా సగటు అభిమాని కోణంలో చూస్తే టి20లకు రోహిత్ సరైన కెప్టెన్ అనే అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. చదవండి: టి20 ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు కొత్త కోచ్! ముఖ్యం గా ఐపీఎల్ ప్రదర్శన ఇద్దరి మధ్య నాయకత్వ అంతరాన్ని బాగా చూపించింది. రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు విజేతగా నిలిస్తే... 2011 సీజన్ నుంచి కెప్టెన్‌గా ఉన్నా కోహ్లి ఒక్కసారి కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు టైటిల్ అందించలేకపోయాడు. దాంతో భారత జట్టు టి20 మ్యాచ్‌లు ఆడిన ప్రతీ సందర్భంలో పోలిక మొదలైంది. కోహ్లి గైర్హాజరులో రోహిత్ కెప్టెన్సీలో 19 మ్యాచ్‌లు ఆడిన భారత్ 15 గెలిచి, 4 ఓడింది. అతని సారథ్యానికి ప్రశంసలు కూడా దక్కాయి. ఈ నేపథ్యంలో మరింత చర్చలకు అవకాశం ఇవ్వకుండా కెపె్టన్సీ విషయంలో కొంత ఉపశమనం పొందాలని కోహ్లి భావించి ఉంటాడు. అందుకే అన్ని రకాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ప్రకటన సమయం మాత్రం సరైంది కాదు. గెలిచినా, ఓడినా వరల్డ్‌కప్ తర్వాతే దీని గురించి చెప్పి ఉంటే మెరుగ్గా ఉండేది! భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా నాయకత్వం కూడా వహించే అదృష్టం నాకు దక్కింది. సారథిగా ఉన్న నాకు ఈ ప్రయాణంలో సహకరించిన సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలక్షన్ కమిటీ, కోచ్‌లతో పాటు జట్టు గెలవాలని కోరుకున్న ప్రతీ భారతీయుడికి నా కృతజ్ఞతలు. గత 8–9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలో ఆడుతూ 5–6 ఏళ్లుగా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నాపై తీవ్ర పనిభారం ఉంది. దీనిని అర్థం చేసుకోవడం అవసరం. భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్‌గా నా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించేందుకు నాకు కొంత ఉపశమనం అవసరం. సారథిగా జట్టుకు నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన నేను, ఇకపై టి20 బ్యాట్స్‌మన్‌గా కూడా అదే తరహాలో శ్రమిస్తాను. ఈ నిర్ణయం తీసుకునేందుకు నాకు చాలా సమయం పట్టింది. మున్ముందూ భారత జట్టుకు నా సేవలు అందిస్తూనే ఉంటాను. –కోహ్లి -
ICC T20 World Cup 2021: ప్రపంచకప్ తరలిపోయినట్లే
న్యూఢిల్లీ: భారత్‌లో టి20 ప్రపంచకప్ నిర్వహించేందుకు ఉన్న అవకాశాలపై తమకు స్పష్టత ఇవ్వాలంటూ జూన్ 28 వరకు భారత క్రికెట్ నియంత్రణ మండలికి (బీసీసీఐ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవలే గడువు ఇచ్చింది. అయితే చివరి తేదీకి చాలా ముందే భారత క్రికెట్ బోర్డు చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో జరగాల్సిన ఈ టోర్నీని తాము నిర్వహించలేమని ఐసీసీకి బీసీసీఐ ఇప్పటికే చెప్పేసినట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా... అంతర్గతంగా తమ పరిస్థితిని వారికి బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఆతిథ్య హక్కులు తమ వద్దే ఉంచుకుంటూ యూఏఈ, ఒమన్లలో వరల్డ్‌కప్ జరిపితే తమకు అభ్యంతరం లేదని కూడా స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘నిజాయితీగా ఆలోచిస్తే రాబోయే రోజుల్లో భారత్‌లో కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం దేశంలో రోజుకు లక్షా 20 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. గత రెండు నెలలతో పోలిస్తే ఇది తక్కువ కావచ్చు. కానీ మూడో వేవ్ గురించి గానీ... అక్టోబర్–నవంబర్లలో ఏం జరగవచ్చనేది జూన్ 28న అంచనా వేయడం చాలా కష్టం. ఎనిమిది టీమ్‌ల ఐపీఎల్‌నే తరలించినప్పుడు 16 జట్ల ప్రపంచకప్ ఎలా నిర్వహిస్తాం. ఐపీఎల్ తరలింపునకు వర్షాలు కారణం కాదనేది అందరికీ తెలుసు. అది సుమారు రూ.2,500 కోట్ల ఆదాయానికి సంబంధించిన విషయం. అయినా ప్రపంచకప్ ఆడేందుకు ఎంత మంది విదేశీ ఆటగాళ్లు భారత్ రావడానికి ఇష్టపడతారు అనేది కూడా కీలకం కదా’ అని బీసీసీఐలో కీలక అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు ప్రపంచకప్ అంటే ఐపీఎల్ లాంటిది కాదని... ఏదైనా ఒక అసోసియేట్ జట్టులో పొరపాటున కొందరికి కరోనా సోకితే ఇక ఆ జట్టు ఇతర ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం కూడా ఉండదని టోర్నీలో పాల్గొనబోయే ఒక అసోసియేట్ టీమ్‌కు చెందిన ఆటగాడు అభిప్రాయపడ్డాడు. మస్కట్లోనూ మ్యాచ్‌లు... వరల్డ్‌కప్ కోసం యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జాలతో పాటు అదనంగా పక్కనే ఉన్న ఒమన్ రాజధాని మస్కట్లోనూ మ్యాచ్‌లు నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. 31 ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ కారణంగా యూఏఈలో పిచ్‌లు పూర్తిగా జీవం కోల్పోయే ప్రమాదం ఉంది. దాంతో అవి సాధారణ స్థితికి వచ్చేందుకు కనీసం మూడు వారాల సమయం అవసరం. ఆ సమయంలో వరల్డ్‌కప్ ఆరంభ రౌండ్ల మ్యాచ్‌లు మస్కట్‌లో నిర్వహించాలని ఐసీసీ యోచిస్తోంది. బీసీసీఐ నుంచి అధికారిక సమాచారం వచ్చిన తర్వాత వరల్డ్‌కప్ షెడ్యూల్‌పై స్పష్టత రానుంది. -
తప్పనిసరైతేనే యూఏఈలో...
ముంబై: ఐదేళ్ల విరామం తర్వాత జరగనున్న టి20 ప్రపంచకప్ వేదిక మారనుందా? ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో భారత్‌లో జరగాల్సిన ఈ మెగా టోర్నీని మరో చోట నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోందా? తాజా పరిణామాల నేపథ్యంలో ఈ అంశం కొత్త చర్చకు దారి తీసింది. భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా పలు క్రికెట్ జట్లు ఇక్కడికి వచ్చి ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదని సమాచారం. దాంతో వేదిక మార్చడంపై చర్చ మొదలైంది. భారత్‌లో జరగకపోతే ప్రత్యామ్నాయ వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను బీసీసీఐ సిద్ధం చేసుకుంటోంది. అక్కడ జరిగినా నిర్వహణ మాత్రం బీసీసీఐదే. అయితే చివరి నిమిషం వరకు ఇక్కడే జరపాలని తాము ప్రయత్నిస్తామని, తప్పనిసరి అయితే మాత్రమే తరలిస్తామని టోర్నమెంట్ డైరెక్టర్ ధీరజ్ మల్హోత్రా వెల్లడించారు. వరల్డ్ కప్ కోసం తొమ్మిది వేదికల పేర్లను బోర్డు ఇప్పటికే ఐసీసీకి సమర్పించింది. కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్, ధర్మశాల, ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో టోర్నీ జరపాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించింది. ‘ప్రస్తుతానికి మాత్రం టోర్నీ వేదిక విషయంలో ఎలాంటి మార్పు లేదు. మేం భారత్‌లోనే నిర్వహిస్తాం. అయితే రాబోయే రోజుల్లో కరోనా వైరస్ కారణంగా పరిస్థితులు ఇంకా దిగజారితే, తప్పనిసరి అయితే మాత్రం ఇక్కడి నుంచి తరలిస్తాం. మా దృష్టిలో యూఏఈనే సరైన వేదిక. ఈ విషయంలో ఐసీసీతో చర్చిస్తున్నాం. అయితే టోర్నీ కోసం మరో ఆరు నెలల సమయం ఉందనే విషయం మరచిపోవద్దు. ఆ లోపు పరిస్థితులు ఎంతో మెరుగు పడవచ్చు’ అని ధీరజ్ అభిప్రాయ పడ్డారు. సాధ్యం కాదా? కరోనా తీవ్రత పెరిగిన తర్వాత కూడా బీసీసీఐ యూఏఈలో గత ఏడాది ఐపీఎల్ నిర్వహించింది. ఈసారి బయో బబుల్‌ను ఏర్పాటు చేసి మరీ భారత్‌లో మరో ఐపీఎల్ నిర్వహిస్తోంది కూడా. మరి 16 దేశాల జట్లు పోటీ పడే టి20 ప్రపంచ కప్ నిర్వహణ కూడా ఇదే తరహాలో సాధ్యమేనా? బీసీసీఐ వద్ద కూడా దీనిపై స్పష్టమైన సమాధానం లేదు. ఐపీఎల్‌తో పోలిస్తే 16 జట్ల టోర్నీకి నిర్వహణా సమస్యలు చాలా ఎక్కువగా ఉండటం కూడా ఇందుకు కారణం. ఇన్ని టీమ్‌లకు విడిగా బయో బబుల్‌లు ఏర్పాటు చేయడం అంత సులువు కాదు. చిన్న పొరపాటు జరిగినా పరిస్థితులు తీవ్రంగా మారిపోతాయి. పైగా ఐపీఎల్లో ఒక్కో ఫ్రాంచైజీ అన్ని రకాలుగా తమ జట్టు బాధ్యతలు తీసుకుంటాయి. ఇక్కడ అన్నింటా బీసీసీఐదే పూర్తి బాధ్యత ఉంటుంది. పైగా ప్రపంచ కప్ కాబట్టి సహజంగానే అభిమానులతో ముడిపడిన సమస్య. జనం లేకుండా వరల్డ్ కప్‌లు జరపడం అర్థం లేనిదనేది సాధారణ అభిప్రాయం. విమానాల రాకపోకల సమస్యలతో పాటు ఇతర ఆంక్షలు ఎప్పటి వరకు కొనసాగుతాయో ఎవరికీ తెలీదు. ఇదే కారణంగా గతేడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ వాయిదా వేశారు. అయితే తగినంత సమయం ఉండటం, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగి పరిస్థితులు మెరుగుపడాలని బీసీసీఐ కోరుకుంటోంది. ఈ క్రమంలో అవసరమైతే వేదికల సంఖ్యను తొమ్మిది నుంచి నాలుగు లేదా ఐదుకు తగ్గించాలని కూడా బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. 2016 టి20 ప్రపంచకప్ భారత్‌లో జరిగినప్పుడు 7 వేదికలను ఉపయోగించారు. -
ఐపీఎల్‌కు కరోనా సెగ
మామూలుగా అయితే వేసవి వస్తుందంటే పిల్లలకు సెలవులు, అభిమానులకు ఐపీఎల్ మ్యాచ్‌లు ఉంటాయి. ఈ ఆహ్లాదపరిచే ఆనందం ముందు మండే ఎండలైనా చిన్నబోతాయి. కానీ గతేడాది నుంచి ట్రెండ్ మారింది. కొత్త వైరస్ (కరోనా) దాపురించింది. ఐపీఎల్‌ను వణికిస్తోంది. ఆటగాళ్లను, సిబ్బందిని బెంబేలెత్తిస్తోంది. మొత్తానికి ఈ ఏడాదీ కరోనా సెగ లీగ్‌కు తాకింది. ముంబై: ఐపీఎల్ టి20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభానికి వారమైనా లేదు. కరోనా వైరస్‌తో ఈ టోర్నీలో అలజడి రేపింది. లీగ్ ఏర్పాట్లలో కలకలం మొదలైంది. శ్రీకారానికి ముందే వైరస్ సైరన్ మోగింది. భారత ఆల్‌రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్ సహా ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బంది, పలువురు ఈవెంట్ మేనేజర్లు వైరస్ బారిన పడ్డారు. ఇది లీగ్ వర్గాలను ఠారెత్తించినా... గత అనుభవాల దృష్ట్యా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దగా కంగారు పడకుండా చేయాల్సిన పనుల్ని చక్కబెడుతూ, ఏర్పాట్లను మరింత కట్టుదిట్టంగా చేయాలని నిర్ణయించింది. ఐసోలేషన్‌లో అక్షర్... ఢిల్లీ ఆటగాడు అక్షర్ పటేల్‌కు పాజిటివ్ రిపోర్టు వచ్చిందని జట్టు వర్గాలు తెలిపాయి. ముంబైలో తను బసచేసిన హోటల్లో గత నెల 28న అతనికి పరీక్ష చేయగా అప్పుడు నెగెటివ్ వచ్చింది. కానీ మరోసారి కోవిడ్ టెస్టు చేస్తే పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా అక్షర్ ఇంకా బయో బబుల్‌లోకి వెళ్లలేదు. కాబట్టి జట్టు సన్నాహక శిబిరానికి, ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ హిట్టర్ నితీశ్ రాణా వైరస్ బారిన పడ్డట్లు రిపోర్టులో వచ్చింది. ఈ సీజన్లో ఇదే తొలికేసు. అయితే తదుపరి పరీక్షలో తను నెగెటివ్ అని తేలడంతో ఆటగాళ్లకు సంబంధించి తొలి పాజిటివ్ అక్షర్ ఖాతాలోకి వెళ్లింది. ఐపీఎల్ కరోనా ప్రోటోకాల్ ప్రకారం అక్షర్ 10 రోజులు క్వారంటైన్లో గడపాలి. క్వారంటైన్ గడువు ఈనెల 12న ముగియనుంది. ఆ తర్వాత వరుసగా రెండు ఆర్టీ–పీసీఆర్ టెస్టుల్లో కూడా అతనికి నెగెటివ్ రావాలి. అప్పుడే అతను జట్టుతో కలవగలడు. ఫలితంగా ఈనెల 10న చెన్నై సూపర్ కింగ్స్‌తో... 15న రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌ల్లో అక్షర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలో దిగే అవకాశాలు కనిపించడంలేదు. మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) ఆటగాడికి కూడా కోవిడ్ సోకినట్లు తెలిసింది. అయితే అతని పేరు మాత్రం బయటకు పొక్కలేదు. పది మంది సిబ్బందికి... మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బందిలో 10 మందికి కూడా కోవిడ్ సోకింది. దీంతో పాటు మరో ఆరుగురు ఈవెంట్ మేనేజర్లు కూడా కరోనా బారిన పడటంతో బీసీసీఐ ఆందోళన చెందింది. ఈ నేపథ్యంలో ముంబైలో జరగాల్సిన మ్యాచ్‌లను హైదరాబాద్ లేదంటే ఇండోర్‌లో నిర్వహించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. కానీ బీసీసీఐ మాత్రం బయో బబుల్ ఏర్పాట్లు ఉన్నపళంగా మార్చలేమని, ఏదేమైనా కట్టుదిట్టమైన చర్యలతో ముంబైలోనే మ్యాచ్‌లు నిర్వహించేందకు ప్రయత్నిస్తామని చెప్పింది. ‘స్టాండ్‌బై స్టేడియాలలో హైదరాబాద్ ఒకటి. కానీ ఇప్పటికైతే ఆగమేఘాలపై ముంబై మ్యాచ్‌ల్ని అక్కడికి తరలించాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కొద్ది సమయంలోనే మరో బబుల్ ఏర్పాటు అంత సులభం కాదు’ అని ఒక సీనియర్ బీసీసీఐ అధికారి వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం వాంఖెడే మైదానంలో ఈ నెల 10 నుంచి 25 వరకు 10 లీగ్ మ్యాచ్‌లు జరగాల్సివుంది. శుక్రవారం సాయంత్రం దాకా 8 పాజిటివ్ కేసులుంటే శనివారానికి ఆ సంఖ్య పదికి చేరిందని, ఆరేడు మంది ఈవెంట్ మేనేజర్లు కూడా వైరస్ బారిన పడ్డారని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. -
కెప్టెన్లు జర భద్రం...లేదంటే భారీ మూల్యం
ముంబై: ఐపీఎల్... ఆటగాళ్లపై కోట్లు కురిపిస్తుంది. స్టేడియంలో మెరుపులు మెరిపిస్తుంది. అభిమానుల్ని మురిపిస్తుంది. ప్రేక్షకుల్ని యేటికేడు అలరిస్తూనే ఉంది. ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ సీజన్లో కెప్టెన్లకు పెద్ద చిక్కే వచ్చిపడింది. ఇక ముందులా తీరిగ్గా బౌలింగ్ చేస్తే కుదరదు. నిర్ణీత సమయంలోగా 20 ఓవర్లను కచ్చితంగా పూర్తిచేయాలి. లేదంటే భారీ మూల్యమే కాదు... డగౌట్‌కు (నిషేధం) పరిమితమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టత ఇచ్చింది. ఐపీఎల్ నియమావళిని అనుసరించి మందకొడిగా (స్లో ఓవర్ రేట్) బౌలింగ్ చేస్తే మొదటిసారి ఆ జట్టు కెప్టెన్‌పై రూ. 12 లక్షలు జరిమానా వేస్తారు. రెండోమారు పునరావృతమైతే రూ. 24 లక్షలు చెల్లించాల్సిందే. అలాగే తుదిజట్టులోని ప్రతి ఆటగాడిపై కూడా రూ. 6 లక్షలు లేదా 25 శాతం మ్యాచ్ ఫీజు (ఏది తక్కువైతే అది) కోతగా పడుతుంది. ఒకే సీజన్లో మూడో సారి కూడా స్లో ఓవర్‌రేట్ నమోదు చేస్తే రూ. 30 లక్షలు జరిమానాతో పాటు తదుపరి మ్యాచ్ నిషేధం కూడా విధిస్తారు. అలాగే తుది జట్టు ఆటగాళ్లపై రూ. 12 లక్షలు లేదా 50 శాతం మ్యాచ్ ఫీజు (ఏది తక్కువైతే అది) కోతగా విధిస్తారు. -
కోహ్లి, రోహిత్‌లపై ఆర్ఆర్ఆర్ మూవీ ఆసక్తికర ట్వీట్
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3–2తో గెలుచుకున్న విషయం తెలిసిందే. చివరి టీ20ల్లో ఓపెనర్లుగా దిగిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడి 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలక్పొంది. ఈ బ్యాటింగ్ ద్వయం ప్రత్యర్థి జట్లకు ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. ఆది నుంచే ప్రత్యర్థిపై విరుచుకుపడ్డారు. ఇరువురి విధ్వంసకర భాగస్వామ్యాన్ని క్రిక్ ట్రాకర్ తమ ట్వీటర్ అకౌంట్లో విరాట్ కోహ్లిను రామరాజు(అగ్ని)తో , రోహిత్ శర్మను కొమరంభీమ్ (నీరు) పోల్చుతూ ట్వీట్‌ను వేసింది. ఈ ట్వీట్‌ను రీ షేర్ చేస్తూ ఆర్ఆర్ఆర్ మూవీ ఆసక్తికర ట్వీట్‌ను వేసింది. ఫైర్‌బ్రాండ్ విరాట్ కోహ్లి , మిస్లర్ కూల్ రోహిత్ శర్మల కలయిక ఒక సంచలనం. కప్పును గెలవండి అంటూ ఆర్ఆర్ఆర్ మూవీ అధికారిక ఖాతానుంచి ట్వీట్ వేసింది. సిరీస్ నిర్ణాయక మ్యాచ్‌లో భారత జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అందించారు. అంతర్జాతీయ టి20ల్లో తొలిసారి జంటగా ఓపెనింగ్‌కు దిగిన రోహిత్, కోహ్లి ఓవర్‌కు 10.44 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టారు. ముందుగా రోహిత్ బాధ్యత తీసుకొని తనదైన శైలిలో చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన కోహ్లి ఆ తర్వాత పుంజుకున్నాడు. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ కోహ్లి(80 నాటౌట్; 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దుమ్ములేపగా, రోహిత్ శర్మ(64; 34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసకర ఆటతో అదరగొట్టాడు. A fiery and cool partnership is bound to be sensational! #ViratKohli 🔥 #RohitSharma 🌊 Let's win the 🏆! 🇮🇳#INDvENG @BCCI #RRRMovie https://t.co/bCq2hsExR2 — RRR Movie (@RRRMovie) March 20, 2021 (చదవండి: రోహిత్ అత్యాశపరుడు.. ధోని షాకింగ్ వీడియో..!) -
‘సన్నీ 50’కి ఘనమైన సత్కారం
అహ్మదాబాద్: భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అంతర్జాతీయ క్రికెట్లో జేగంట మోగించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆయనను ఘనంగా సన్మానించింది. శనివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఆఖరి టెస్టు మూడో రోజు భోజన విరామంలో గావస్కర్‌ను బీసీసీఐ కార్యదర్శి జై షా సన్మానించారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన బోర్డు... సన్నీ సేవల్ని కొనియాడింది. తన 16 ఏళ్ల కెరీర్లో గావస్కర్ 125 టెస్టులు, 108 వన్డేలు ఆడారు. 1987 మార్చి 7న అహ్మదాబాద్ స్టేడియంలోనే గావస్కర్ టెస్టు క్రికెట్లో 10వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందారు. 71 ఏళ్ల సన్నీ సరిగ్గా అర్ధ శతాబ్దం క్రితం 1971లో జరిగిన వెస్టిండీస్ పర్యటనలో మార్చి 6న అరంగేట్రం చేశారు. తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధ శతకాలు బాదిన తర్వాత 1987దాకా 16 ఏళ్లపాటు భారత క్రికెట్‌కు ఎన లేని సేవలందించి... దిగ్గజంగా ఎదిగారు. -
నేటినుంచి విజయ్‌హజారే ట్రోఫీ
ముంబై: భారత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి రంగం సిద్ధమైంది. దేశంలోని వేర్వేరు వేదికల్లో నేటినుంచి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. మొత్తం జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించి టోర్నీని నిర్వహిస్తున్నారు. 2020–21 సీజన్లో రంజీ ట్రోఫీని రద్దు చేసిన బీసీసీఐ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీని ఇప్పటికే నిర్వహించింది. ఇప్పుడు విజయ్ హజారే టోర్నీలో తమ సత్తా చాటి భారత వన్డే జట్టులో చోటు కోసం సెలక్టర్లను ఆకర్షించాలని యువ ఆటగాళ్లు భావిస్తున్నారు. ఇప్పటికే టీమిండియా వన్డే జట్టులో రెగ్యులర్ సభ్యుడైన శ్రేయస్ అయ్యర్ ముంబై కెప్టెన్‌గా బరిలోకి దిగుతుండగా... గాయాలనుంచి కోలుకొని శిఖర్ ధావన్ (ఢిల్లీ), భువనేశ్వర్ కుమార్ (యూపీ) పునరాగమనం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. పృథ్వీ షా కూడా తన ఫామ్‌ను అందుకునేందుకు ఈ టోర్నీ తగిన అవకాశం కల్పిస్తోంది. దినేశ్ కార్తీక్ తమిళనాడు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా...ఆస్ట్రేలియా పర్యటనలో ఆకట్టుకున్న నటరాజన్‌పై ఇప్పుడు అందరి దృష్టీ నిలిచింది. మార్చి 14న టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
ఐపీఎల్: బీసీసీఐ కీలక నిర్ణయం!
అహ్మదాబాద్: ఐపీఎల్–2022 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 8 జట్లతో పాటు అదనంగా మరో రెండు టీమ్‌లను కొత్తగా చేర్చనుంది. దీంతో మొత్తంగా 10 జట్లు ఈ మెగాటోర్నీలో టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ మేరకు గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కాగా కరోనా కాలంలోనూ బీసీసీఐ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌ను విజయవంతంగా పూర్తిచేసిన సంగతి తెలిసిందే. కాస్త ఆలస్యంగా ప్రారంభమైనా క్యాష్ రిచ్ లీగ్ క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత మజా అందించింది. యూఏఈ వేదికగా జరిగిన ఈ మెగాటోర్నీలో ముంబై ఇండియన్స్ మరోసారి ట్రోఫీ కైవసం చేసుకుంది. (చదవండి: సెలక్షన్ ప్యానెల్; రేసులో అగార్కర్, మోంగియా) ఇక గత నెలలో ఐపీఎల్-2020కి శుభం కార్డు పడిన నాటి నుంచి వచ్చే సీజన్లో 10 జట్లను ఆడిస్తారంటూ ప్రచారం జరిగిన విషయం విదితమే. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్‌కు చాలా తక్కువ సమయం ఉండటంతో టెండరింగ్ ప్రక్రియ, మెగా వేలం నిర్వహించడం కష్టతరమని బీసీసీఐ పెద్దలు భావించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్ చరిత్రలో 2011, 2012, 2013 మినహా ఇంతవరకు ఏ సీజన్లోనూ 9 కంటే ఎక్కువ జట్లు బరిలోకి దిగలేదు. ఇక 2022లో 10 జట్లు, 94 మ్యాచ్‌లతో బిగ్ టోర్నమెంట్ చూడవచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ఒలింపిక్స్(2028)లో క్రికెట్‌ను చేర్చాలన్న అంశంపై ఈ సమావేశంలో విస్త్రృత చర్చ నడుస్తున్నట్లు సమాచారం. -
సెలక్షన్ ప్యానెల్; రేసులో అగార్కర్, మోంగియా
న్యూఢిల్లీ: సెలక్టర్ల ఎంపికకు సంబంధించిన ప్రక్రియను బీసీసీఐ క్రికెట్ అడ్వైజరి కమిటీ (సీఏసీ) వేగవంతం చేసింది. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్ నాయకత్వంలోని సీఏసీ.. సెలక్షన్ ప్యానెల్(పురుషుల క్రికెట్) నియామక ప్రక్రియను గురువారం ప్రారంభించింది. ఈ మేరకు అజిత్ అగార్కర్, చేతన్ శర్మ, మనీందన్ సింగ్, నయన్ మోంగియా, ఎస్ఎస్ దాస్ పేర్లను షార్ట్‌లిస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు అభయ్ కురువిల్లా, అజయ్ రత్రా, నిఖిల్ చోప్రా, దేవాశిష్ మహంతి, రణదేవ్ బోస్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అర్హులైన వారిని వర్చువల్‌గా ఇంటర్వ్యూ చేసి తుది నిర్ణయం తీసుకోనుంది.(చదవండి: 'నీకు చాన్స్ ఇద్దామనే అలా చేశా') కాగా స్క్రూటినీ అనంతరం సీఏసీ ఎంపిక చేసిన పేర్లను బీసీసీఐకి పంపిస్తుంది. ఇక గురువారం బీసీసీఐ జనరల్ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో సెలక్టర్ల నియామకానికి సంబంధించిన ప్రకటన నేడే వెలువడే అవకాశం ఉంది. జతిన్ పరంజపే, దేవాంగ్ గాంధీ, సరణ్దీప్ సింగ్ పదవీకాలం సెప్టెంబరులో పూర్తైన నేపథ్యంలో బీసీసీసీ దరఖాస్తులు ఆహ్వానించింది. కాగా సెలక్టర్‌గా ఎంపిక అయ్యేందుకు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడినవాళ్లు మాత్రమే అర్హులు. అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొని కనీసం ఐదేళ్లు పూర్తై ఉండాలి. వయోపరిమితి 60 ఏళ్లు. -
ఐపీఎల్ 2020: బీసీసీఐ ఆదాయం ఎంతంటే!
న్యూఢిల్లీ: క్యాష్ రిచ్ ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కరోనా కాలంలోనూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి సిరులు కురిపించింది. యూఏఈ వేదికగా నిర్వహించిన ఐపీఎల్-13వ సీజన్‌కు గానూ బోర్డు సుమారు 4 వేల కోట్ల రూపాయాల ఆదాయాన్ని ఆర్జించింది. బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమల్ ఈ విషయాన్ని వెల్లడించారు. అదే విధంగా గతేడాదితో పోలిస్తే ఈసారి టీవీ వ్యూయర్షిప్ కూడా 25 శాతం మేర పెరిగిందని పేర్కొన్నారు. కాగా మహమ్మారి కరోనా దెబ్బకు క్రీడా ఈవెంట్లన్నీ వాయిదా పడ్డ వేళ ఐపీఎల్ నిర్వహణపై కూడా సందేహాలు తలెత్తిన విషయం తెలిసిందే. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో మార్చి 29న మొదలు కావాల్సిన ఐపీఎల్-2020 సీజన్‌ను తొలుత వాయిదా వేశారు.(చదవండి: కోహ్లి త్వరలోనే ఆ ఘనత సాధిస్తాడు: భజ్జీ) ఆ తర్వాత జూన్-జులై నెలల్లో టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేసినా సాధ్యం పడకపోవడంతో.. ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేద్దామని బీసీసీఐ పెద్దలు భావించారు. అయితే టోర్నీ నిర్వహణకు యూఏఈ అనుకూలమని భావించిన బోర్డు.. అక్కడి అధికారులతో సంప్రదించగా సానుకూల స్పందన లభించింది. దీంతో కోవిడ్ నిబంధనల నడుమ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు కొనసాగిన టోర్నీని బీసీసీఐ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత సంపన్న బోర్డుగా పేరొందిన బీసీసీఐ భారీ ఎత్తున ఆదాయం గడించినట్లు అరుణ్ ధుమాల్ తెలిపారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘గతేడాది ఐపీఎల్‌తో పోలిస్తే ఈసారి 35 శాతం మేర నిర్వహణ ఖర్చు తగ్గింది. కరోనా కాలంలో 4 వేల కోట్ల రూపాయాల ఆదాయం ఆర్జించాం. డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. టీవీ వ్యూయర్షిప్ 25 శాతం వరకు పెరిగింది. తొలుత మాపై సందేహాలు వ్యక్తం చేసిన వారే ఐపీఎల్‌ను విజయవంతంగా పూర్తిచేసినందుకు మాకు ధన్యవాదాలు తెలిపారు. ఒకవేళ ఈ సీజన్ నిర్వహించకపోయి ఉంటే క్రికెటర్లు ఓ ఏడాది కాలాన్ని కోల్పేయేవారు’’ అని చెప్పుకొచ్చారు. (చదవండి: యూఏఈకి బీసీసీఐ బంపర్ బొనాంజ!) ఇక కోవిడ్ కాలంలో టోర్నీ నిర్వహణలో తీసుకున్న జాగ్రత్తల గురించి చెబుతూ.. ‘‘ఈ టీ20 లీగ్‌లో 53 రోజులపాటు మొత్తంగా 60 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మెగా ఈవెంట్లో భాగంగా 1800 మందికి సుమారు 30 వేల మేర కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన పక్షంలో వారు కోలుకునేంత వరకు అన్ని రకాల చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. క్వారంటైన్ కోసం సుమారు 200 గదులు బుక్ చేశాం’’ అని అరుణ్ ధుమల్ పేర్కొన్నారు. కాగా ఐపీఎల్-13వ సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్ ట్రోఫీని ఎగురేసుకుపోయిన సంగతి తెలిసిందే. తద్వారా ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టుగా రోహిత్ సేన చరిత్ర సృష్టించింది. -
లంకలో పర్యటించండి
కొలంబో: షెడ్యూల్ ప్రకారం ద్వైపాక్షిక సిరీస్ కోసం తమ దేశంలో పర్యటించాల్సిందిగా బీసీసీఐని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) కోరింది. కరోనా నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన క్రికెట్ సిరీస్‌లు, టోర్నీల నిర్వహణపై అనిశ్చితి నెలకొనడంతో లంకకు వచ్చే అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా బీసీసీఐకి ఈ–మెయిల్ ద్వారా తెలిపింది. జూన్–జూలై మధ్య శ్రీలంక పర్యటనలో భారత్ 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. కఠిన క్వారంటైన్ నిబంధనలు పాటించడంతో పాటు ప్రేక్షకులు లేకుండానే టోర్నీని నిర్వహిస్తామని లంక అధికారులు పేర్కొనట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ పరిస్థితుల్లో దీనిపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని బీసీసీఐ పేర్కొంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాకే, ప్రయాణ ఆంక్షలు సడలించాకే టోర్నీల గురించి ఆలోచిస్తామని తెలిపింది. -
సడలిస్తే... ప్రాక్టీస్‌ను మార్చుతాం: బీసీసీఐ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఒకవేళ లాక్డౌన్ నిబంధనలు సడలిస్తే భారత క్రికెటర్లు మైదానాల్లో నాణ్యమైన శిక్షణను ప్రారంభించే అవకాశముంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోశాధికారి అరుణ్ ధుమాల్ తెలిపారు. మే 18 నుంచి నాలుగోవిడత లాక్డౌన్ నిబంధనలు అమల్లోకి రానుండటంతో ఆటగాళ్లకు ప్రాక్టీస్ చేసే వెసులుబాటు దక్కవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడైతే ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. తమ సొంత ఇండోర్ ప్రాక్టీస్‌తోనే సరిపెట్టుకుంటున్నారు. ‘క్రికెటర్లు నెట్ సెషన్స్‌లో పాల్గొనేందుకు అందుబాటులో ఉండే అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. లాక్డౌన్–4 మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాలకు అనుమతిలేని పక్షంలో ఆటగాళ్ల నివాసాలకు దగ్గర్లోని మైదానాల్లో వారు ప్రాక్టీస్ చేసే అవకాశాలపై దృష్టి సారించాం. ఈ అంశంపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రయాణ ఆంక్షలు సడలించేదాకా ఎలాంటి శిబిరాలు ఏర్పాటు చేయం. ఆటగాళ్ల ఆరోగ్య భద్రతే మాకు అత్యంత ప్రధానం. లాక్డౌన్ ముగిశాక క్రికెటర్ల కార్యాచరణపై మాకు స్పష్టమైన ప్రణాళిక ఉంది’ అని ధుమాల్ పేర్కొన్నారు. -
ఐపీఎల్ జరగకపోతే మాకూ నష్టమే
న్యూఢిల్లీ: ప్రస్తుతానికి నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ ఒకవేళ జరగకపోతే బోర్డుకు ఏకంగా రూ.4000 కోట్ల నష్టం వస్తుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోశాధికారి అరుణ్ ధుమాల్ చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ ప్రకారమే ఉంటుందని... అయితే దీనిపై ఇప్పుడే కచ్చితంగా ఏ విషయమూ చెప్పలేమని అన్నారు. ఇప్పటికైతే ఆ సిరీస్‌పై, టి20 ప్రపంచకప్‌పై ఆస్ట్రేలియాగానీ, ఐసీసీ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదని కాబట్టి ముందనుకున్నట్లే జరుగుతాయని ఆశిస్తున్నట్లు అరుణ్ తెలిపారు. ప్రతీ విదేశీ పర్యటనకు ముందు 14 రోజుల క్వారంటైన్ ప్రతీసారీ కష్టమని చెప్పారు. ఆసీస్‌లో టి20 ప్రపంచకప్ కోసం 16 జట్ల రాక, బస, క్వారంటైన్లతో పోలిస్తే భారత్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌కు కాస్త తక్కువ సమస్యలుంటాయని అరుణ్ వివరించారు. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితి మారితే, లాక్డౌన్ ముగిస్తే తదుపరి కార్యాచరణపై ఆలోచన చేయవచ్చన్నారు. ముందుగా ఆటగాళ్ల ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని, ఇరు ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగానే క్రికెట్ బోర్డులు నడుచుకుంటాయని అన్నారు. వైరస్ అదుపులోకి వచ్చాక విదేశీ ప్రయాణాలపై ఉన్న ఆంక్షలు, సడలింపులను బట్టే ఏదైనా నిర్ణయం వెలువరించవచ్చని చెప్పారు. -
ఎమ్మెస్కే వారసుడిగా సునీల్ జోషి
ముంబై: ఓ తెలుగు జట్టు మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ చీఫ్ సెలక్టర్ పదవీకాలం ముగియగా... ఇప్పుడు అతని స్థానంలో మరో తెలుగు జట్టుతో అనుబంధం ఉన్న ఆటగాడు సునీల్ జోషి సెలక్షన్ కమిటీకి కొత్త చైర్మన్‌గా వచ్చాడు. 49 ఏళ్ల సునీల్ జోషి గతంలో హైదరాబాద్ రంజీ జట్టు హెడ్ కోచ్‌గా పని చేశాడు. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి (సౌత్‌జోన్)ని ఎంపిక చేయగా... ఈ ఎంపికకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆమోదముద్ర వేసింది. సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా జోషి సిఫారసును బోర్డు ధ్రువీకరించిందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. సెంట్రల్ జోన్ నుంచి ఖాళీ అయిన స్థానంలో మాజీ భారత పేస్ బౌలర్, 42 ఏళ్ల హర్వీందర్ సింగ్‌కు అవకాశమిచ్చారు. ఎమ్మెస్కేతో పాటు గగన్ ఖోడా (సెంట్రల్ జోన్) పదవీ కాలం కూడా ముగిసింది. ఐదుగురు సభ్యుల కమిటీలో ఇప్పటికే జతిన్ పరంజపే (వెస్ట్ జోన్), దేవాంగ్ గాంధీ (ఈస్ట్ జోన్), శరణ్‌దీప్ సింగ్ (నార్త్ జోన్)లు ఉండగా... కొత్తవారు త్వరలోనే బాధ్యతలు చేపడతారు. భారత మాజీ క్రికెటర్లు నయన్ మోంగియా, అజిత్ అగార్కర్ సహా మొత్తం 40 మంది సెలక్టర్ల పదవులకు దరఖాస్తు చేసుకోగా... ఇందులో నుంచి సునీల్ జోషి, హర్వీందర్, వెంకటేశ్ ప్రసాద్, రాజేశ్ చౌహాన్, శివరామకృష్ణన్‌లను తుది జాబితాకు ఎంపిక చేశారు. వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించాక చైర్మన్, సెలక్టర్‌ను ఖరారు చేశారు. ‘సెలక్షన్ కమిటీ కోసం అత్యుత్తమ వ్యక్తుల్నే ఎంపిక చేశాం. జోషి, హర్వీందర్‌లు సరైన దృక్పథంతో ఉన్నారు. ఇంటర్వ్యూలో వాళ్లిద్దరు వెలిబుచ్చిన అభిప్రాయాలు కూడా సూటిగా స్పష్టంగా ఉన్నాయి’ అని సీఏసీ చైర్మన్ మదన్ లాల్ తెలిపారు. సీఏసీకి చాలా దరఖాస్తులే వచ్చాయని, అందరి పేర్లను పరిశీలించాకే తుది జాబితాను సిద్ధం చేశామన్నారు. ఈ ప్రక్రియలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చాడని చెప్పారు. చైర్మన్ సునీల్ జోషి, సెలక్టర్ హర్వీందర్‌లు నాలుగేళ్ల పాటు పదవిలో ఉంటారు. జోషి తెలుసుగా... సునీల్ జోషి అంటే గొప్పగా గుర్తొచ్చే ప్రదర్శన సఫారీపైనే! నైరోబీలో 1999లో జరిగిన వన్డే టోర్నీలో జోషి 10–6–6–5 బౌలింగ్ ప్రదర్శనతో భారత్ 8 వికెట్లతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. 1996 నుంచి 2001 వరకు సాగిన స్వల్ప కెరీర్లో జోషి 15 టెస్టులాడి 41 వికెట్లు, 69 వన్డేలు ఆడి 69 వికెట్లను పడగొట్టాడు. హైదరాబాద్ రంజీ కోచ్‌గా వ్యవహరించిన జోషికి బంగ్లాదేశ్ జాతీయ జట్టు సహాయ సిబ్బందిలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. మాజీ పేసర్ హర్వీందర్ది కూడా స్వల్ప కాలిక కెరీరే! 1998 నుంచి 2001 వరకు కేవలం నాలుగేళ్లే టీమిండియా సభ్యుడిగా ఉన్న ఈ మాజీ సీమర్ మూడే టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 4, వన్డేల్లో 24 వికెట్లు తీశాడు. -
ఇది సానుకూల మలుపు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా డోపింగ్ విషయంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరిధిలోకి రావడాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతించారు. క్రీడల్లో పారదర్శకత కోసం ఇది కీలక మలుపు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఎలాంటి అంశాలు, సమస్యలు అపరిష్కృతంగా ఉండాలని నేను కోరుకోవడం లేదు. విభేదాలన్నీ పరస్పర చర్చలతో పరిష్కరించుకోవాలి. నేను క్రీడలు, క్రీడాకారుల మేలు కోరేవాడిని. వాటిలో అన్నీ పారదర్శకంగా జరగాలని భావిస్తా’ అని రిజిజు అన్నారు. మరోవైపు క్రీడా శాఖతో చర్చల కోసం బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రిని పంపడాన్ని బీసీసీఐ సీనియర్ సభ్యులు ఒకరు తప్పు పట్టారు. ఒలింపిక్స్‌లో క్రికెట్ చేర్చాలని ప్రయత్నిస్తున్న ఐసీసీ బృందంలో జోహ్రి కూడా సభ్యుడని... దానికి ఉన్న డోపింగ్ అడ్డంకిని తొలగించేందుకే క్రికెట్‌నూ ‘నాడా’లో చేర్చేందుకు జోహ్రి అంగీకరించారని ఆయన విమర్శించారు. -
బీసీసీఐ ‘ఆటలు’ ఇక చెల్లవు!
మా క్రికెటర్లు మా ఇష్టం... ప్రభుత్వం మాకేమైనా నిధులిస్తోందా? మాది స్వతంత్ర సంఘం... నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు... ఏ పరీక్షలైనా మేం సొంతంగానే చేసుకుంటాం తప్ప మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు... గత 13 ఏళ్లుగా డోపింగ్‌కు సంబంధించిన అంశంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైఖరి ఇది. కానీ ఇకపై అలాంటిది కుదరదని తేలిపోయింది. సుదీర్ఘ కాలంగా బీసీసీఐని భారత ప్రభుత్వ నిబంధనల పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమైన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు తమ అధికారాన్ని చూపించింది. భారత క్రికెట్ బోర్డును ఇతర క్రీడా సమాఖ్యల్లాగే గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా క్రికెటర్లు కూడా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించే పరీక్షలకు హాజరు కావాల్సిందే. తాజా నిర్ణయం ఏమిటి? బీసీసీఐకి కూడా ఇకపై ఇతర క్రీడలలాగే జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)గా గుర్తింపు లభించింది. ఇన్నేళ్ల పాటు మాది స్వతంత్ర సంస్థ, మాకు ఎవరితో సంబం« దం లేదు అంటూ క్రికెట్ బోర్డు చెబుతూ వచ్చింది. ఏం జరుగుతుంది? సమాచార హక్కు చట్టం (ఆర్టీఏ) సహా ప్రభుత్వ నిబంధనలు అన్నీ బీసీసీఐకీ వర్తిస్తాయి. ఆర్థికపరంగా స్వతంత్రంగా ఉన్నా... అన్ని విషయాల్లో జవాబుదారీతనం ఉంటుంది. అయితే శుక్రవారం సమావేశంలో ‘నాడా’పై మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. సమాచార హక్కు విషయంలో చర్చ జరగలేదు. ‘నాడా’ పరిధిలోకి వస్తే ఏమిటి? శుక్రవారం తీసుకున్న అతి కీలక నిర్ణయం ఇదే. ప్రభుత్వం గుర్తించిన సంఘం కాబట్టి డోపింగ్ విషయంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించే పరీక్షలకు భారత క్రికెటర్లు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. సొంతంగా డోపింగ్ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం లేదు. ఇప్పటివరకు భారత క్రికెటర్ల శాంపిల్స్‌ను స్వీడన్‌కు చెందిన ఐడీటీఎం సేకరించి జాతీయ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ (ఎన్‌డీటీఎల్)కు పంపించేది. ఇకపై ఐడీటీఎంకు ఆ అధికారం ఉండదు. నేరుగా ‘నాడా’నే పరీక్షలు నిర్వహిస్తుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా క్రికెటర్లకు ‘నాడా’ పరీక్షలు నిర్వహించవచ్చు. డోపింగ్ విషయంలో బోర్డు సరిగా వ్యవహరించడం లేదా? ఇటీవల యువ క్రికెటర్ పృథ్వీ షా వ్యవహారం దీనికి సరైన ఉదాహరణ. షా డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడని తెలిసినా అతడిని ఐపీఎల్ ఆడించడంతో పాటు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సౌకర్యాలు వాడుకునేందుకూ బీసీసీఐ అవకాశం కల్పించింది. పైగా పాత తేదీలతో అతని సస్పెన్షన్ కాలాన్ని సాధ్యమైనంత తక్కువగా చేసేందుకు ప్రయత్నించింది. బోర్డు సొంతంగా పరీక్షలు నిర్వహిస్తే ఇలాగే ఉంటుందంటూ చెప్పేందుకు ప్రభుత్వానికి చాన్స్ లభించింది. డోపింగ్ పరీక్షల తీరును ప్రశ్నిస్తూ బీసీసీఐకి ఇటీవలే ఘాటుగా లేఖ కూడా రాసింది. ఇదే అదనుగా బోర్డుపై ఒత్తిడి పెంచి తమ దారికి తెచ్చుకుంది. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందా? భారత్‌లో త్వరలో దక్షిణాఫ్రికా ‘ఎ’, మహిళా జట్ల పర్యటనలు ఉన్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం మార్చిలోనే అనుమతి ఇవ్వాల్సి ఉంది. కానీ దానిని నిలిపివేసి తమతో చర్చలకు వచ్చేలా ఒత్తిడి తెచ్చింది. ‘నాడా’కు, దీనికి సంబంధం లేదని జోహ్రి చెప్పినా ఇది కూడా ఒక కారణం. ప్రభుత్వం చెప్పినట్లు వినకపోతే మున్ముందు కీలక సిరీస్‌లకు సందర్భంగా ఇది సమస్యగా మారవచ్చని ఒక రకమైన హెచ్చరిక ఇందులో కనిపించింది. ఇప్పటి వరకు బీసీసీఐ విధానం ఏమిటి? 2002 నుంచి డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2006లో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)తో ఒప్పందం చేసుకుంది. ఐసీసీ సభ్య దేశాలన్నీ దీనికి అంగీకరించగా... ఒక్క భారత్ మాత్రం ఇందులో చేరేందుకు నిరాకరించింది. మన దేశంలో ఇతర క్రీడలకు సంబంధించి ‘వాడా’ పరిధిలోనే ‘నాడా’ కూడా పని చేస్తుంది. అయితే ‘వాడా’ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం అత్యుత్తమ సౌకర్యాలతో తాము సొంతంగా పరీక్షలు నిర్వహించుకునే సామర్థ్యం తమకు ఉంది కాబట్టి కొత్తగా ‘నాడా’లో చేరాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. ‘నాడా’లో తరచుగా శాంపిల్స్ విషయంలో వివాదాలు రేగాయి కాబట్టి దానిని తాము నమ్మమని తేల్చేసింది. ఈ విషయంలో స్వతంత్రంగా ఉండటానికే మొగ్గు చూపింది. తాజా పరిణామంపై బోర్డు స్పందన ఏమిటి? బీసీసీఐకి అక్టోబరులో ఎన్నికలున్నాయి. ఈలోగా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్డు కార్యవర్గం లేకుండా ప్రభుత్వ నిబంధనలను అంగీకరించే హక్కు పరిపాలకుల కమిటీ (సీఓఏ), సీఈఓలకు ఎలా ఉంటు ందని ప్రశ్నిస్తున్నారు. అయితే పదవిలో ఎవరు ఉన్నా చట్టాలు గౌరవించాల్సిందేనని, అది ఎవరి చేతుల్లోనూ ఉండదంటూ జోహ్రి ఈ వాదనను కొట్టిపారేశారు. సమావేశంలో ఏం జరిగింది? శుక్రవారం జాతీయ క్రీడా కార్యదర్శి రాధేశ్యామ్ ఝులనియా, ‘నాడా’ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్‌లతో బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ సబా కరీమ్ సమావేశమయ్యారు. డోపింగ్‌లో ‘నాడా’ పరిధిలోకి వచ్చేందుకు తమకు ఉన్న సందేహాలను బోర్డు ప్రతినిధులు ముందుంచారు. డోపింగ్ టెస్టింగ్ కిట్ల నాణ్యత, పరీక్షలు జరిపేవారి సామర్థ్యం, శాంపిల్ తీసుకునే అధికారుల అర్హతవంటి అం శాలపై తమకు అభ్యంతరం ఉందంటూ జోహ్రి అన్నా రు. అయితే అన్ని అంశాలపై ప్రభుత్వాధికారులు స్పష్ట తనిచ్చిన తర్వాత బీసీసీఐ తరఫున జోహ్రి సంతకం చేశారు. నాణ్యత విషయంలో ఏదైనా అదనపు ఖర్చు చేయాల్సి వస్తే బీసీసీఐ దానిని భరిస్తుంది. ‘ఎవరైనా చట్టాలను గౌరవించాల్సిందే. బీసీసీఐ కూడా అందుకు సిద్ధం. ప్రభుత్వ నిబంధనలను అంగీకరిస్తున్నట్లు మేం సంతకం చేశాం’ అని జోహ్రి వెల్లడించారు. భారత క్రికెటర్ల అభ్యంతరం ఏమిటి? ‘వాడా’లో ఉన్న ఒక ప్రధాన నిబంధన ఇప్పటి వరకు బీసీసీఐ ‘నాడా’ పరిధిలోకి రాకుండా కారణమైంది. ఆటగాళ్లు ఏడాదిలో నాలుగు సార్లు రాబోయే మూడు నెలల్లో మ్యాచ్‌లు లేని సమయంలో తాము ఎక్కడ ఉండబోతున్నామో, ఏ సమయంలో డోపింగ్ పరీక్షకు సిద్ధమవుతారో ముందే వెల్లడించాల్సి ఉంటుంది. దీనిని తమ వ్యక్తిగత గోప్యతకు భంగకరంగా మన క్రికెటర్లు భావించారు. డోపింగ్ అధికారులకు సమయం ఇచ్చి మూడు సార్లు అందుబాటులో లేకపోతే తీవ్ర చర్యలు ఉంటాయి. విండీస్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ ఇదే చేసి నిషేధానికి గురయ్యాడు. అయితే భారత్‌లాంటి దేశంలో క్రికెటర్ల కదలికలు అందరికీ తెలియడం మంచి కాదని... సచిన్, ధోనిలాంటి క్రికెటర్లు తమకు ఉగ్రవాదుల బెదిరింపులు కూడా వచ్చాయి కాబట్టి ఇది సాధ్యం కాదని చెప్పేశారు. దాంతో తమ స్టార్ క్రికెటర్ల మాటపై బీసీసీఐ ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ఐసీసీ... ఖాళీ సమయంలో కాకుండా మ్యాచ్‌లు జరిగేటప్పుడే డోపింగ్ పరీక్షలు చేస్తామని, ఎవరో ఒకరు కాకుండా ప్రత్యేకంగా నియమించిన అధికారికే ఆటగాళ్ల సమాచారం ఇస్తామని ఒప్పించే ప్రయత్నం చేసింది. అయితే మన ఆటగాళ్ల నిర్ణయం మాత్రం మారలేదు. రాహుల్ జోహ్రి, రాధేశ్యామ్ ఝులనియా -
ఇమ్మని దేవుణ్ణి అడగొచ్చా?
దైవికం ప్రార్థించడం అంటే ‘అడగడం’ కాదంటారు మహాత్మాగాంధీ. దైవ సన్నిధి కోసం ఆత్మ తపించాలట. మన బలహీనతల్ని ఎప్పటికప్పుడు అంగీకరించాలట. హృదయానికి తప్ప మాటలకు తావు ఉండకూడదట. అదే అసలైనపార్థన అంటారు బాపూజీ. ప్రపంచంలో నిత్యం కోట్ల మంది దేనికో ఒకదాని కోసం భగవంతుడిని వేడుకుంటూ ఉంటారు. ‘విన్నపాలు వినవలె వింత వింతలూ’ అని అన్నమయ్య పాడారు కదా, అలా ఆ వేడుకోళ్లలో కొన్ని ప్రార్థనలు ఉంటాయి. కొన్ని బెదిరింపులు ఉంటాయి. కొన్ని బ్లాక్‌మెయిల్స్ ఉంటాయి. కొన్ని అలకలు ఉంటాయి! ఇలా ఒక మనిషి ఇంకో మనిషితో ఎన్ని రకాలైన భావోద్వేగాలతో ఉండగలరో అన్ని రకాల భావోద్వేగాలనూ దేవుడి ముందు ప్రదర్శిస్తుంటారు మానవులు. కొందరు కేవలం ధన్యవాదాలు అర్పిస్తుంటారు. కొందరు కృతజ్ఞతలు చెల్లించి ఊరుకుంటారు... దేవుణ్ని అసలేమీ అడక్కుండా. అలాంటి వాళ్లు తక్కువ. శివలాల్ యాదవ్ అనే ఆయన ఈమధ్య దేవుణ్ణి ప్రార్థించాడు. ఎక్కడా? తన పూజగదిలో కాదు. బి.సి.సి.ఐ. (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తనని సన్మానిస్తుంటే... ఆ సభలో ప్రార్థించాడు. ఏమని? తన నుంచి ఈ పదవి మళ్లీ పూర్వపు అధ్యక్షుడైన ఎన్.శ్రీనివాసన్‌కి వెళ్లిపోవాలని! క్రికెటర్లకు శ్రీనివాసన్ చేసినన్ని మేళ్లు మరే ఇతర అధ్యక్షుడూ చేయలేదు కాబట్టి తిరిగి ఆయనకే ఈ పదవి వచ్చేయాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు శివలాల్ యాదవ్ ప్రకటించారు! ఇంకొకాయన ప్రహ్లాద్ శర్మ. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉంటాడు. సామూహిక ప్రార్థనలు జరిపి, యజ్ఞాలు నిర్వహించి, రెండు జర్మన్ షెప్పర్డ్ శునకాలకు పెళ్లి చేసినప్పటికీ, చుక్క వర్షమైనా పడకపోవడంతో ఆయనకు వరుణ దేవుడి మీద కోపం వచ్చింది. దేవుడికి అంత్యసందేశం (అల్టిమేటమ్) ఇచ్చేశాడు. వారంలోపు వర్షం కురిసిందా సరి, లేదంటే నిరాహార దీక్ష చేస్తానని పోస్టర్లు వేయించి మరీ గోడలకు అంటించాడు! ‘‘భూమ్మీది జీవుల్ని కాపాడడం దేవుడి బాధ్యత. ప్రాణాధారమైన నీటిని లేకుండా చేస్తే ఎలా? రైతులు అల్లాడిపోతున్నారు. ఆ మాత్రం తెలియదా? దేవుడే తలచుకుంటే ఈ క్షణంలో కుంభవృష్టి కురియదా?’’ అని శర్మగారి వాదన. ప్రార్థన స్థాయిని కూడా దాటిపోయి, దేవుడి తరఫున దైవదూతగా మాట్లాడే మామూలు మానవులు కూడా కొందరు ఉన్నారు! బెన్నీ పున్నతర నే తీసుకోండి. కేరళలోని కోళికోడ్ నుంచి వెలువడే ‘సండే షాలొమ్’ పత్రికకు ఆయన సంపాదకులు. ‘మోడీ ప్రధానిగా గెలవడం అన్నది దైవనిర్ణయం’ అని బెన్నీ తన తాజా సంపాదకీయంలో రాశారు! రాసి, అక్కడితో ఊరుకోలేదు. ‘‘ఈ ప్రపంచంలో జరిగేవేవీ దేవుడికి తెలియకుండా జరగవు. దేవుడే మోడీని తన సేవకునిగా ఎన్నుకున్నాడు కాబట్టి భక్తిపరులైన ప్రతి ఒక్కరూ మోడీని సమర్థించాలి. అలా చేయకపోతే దైవ సంకల్పాన్ని ధిక్కరించినట్లవుతుంది. ఎన్నికలకు ముందు బహుశా భారతీయులంతా మోడీని ప్రధానిని చేయమని దేవుణ్ని ప్రార్థించినట్లున్నారు. ఆ ప్రార్థన ఫలించి, దేవుడు ప్రజలను కనికరించి, కాంగ్రెస్‌ను ఓడించి, మోడీని అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టాడు’’ అని విశ్లేషించారు. నువ్వే దేవుడివైతే ఎన్.శ్రీనివాసన్ని మళ్లీ బి.సి.సి.ఐ. అధ్యక్షుడిని చెయ్యమని దేవుణ్ని అడగడం, నువ్వు దేవుడివి కాకపోబట్టే కదా ఇండోర్‌లోని పొలాలన్నీ ఎండిపోతున్నాయని దేవుణ్ని అనడం, నువ్వు దేవుడివి కాబట్టే మోడీని గెలిపించావని అనుకోవడం... ఇవన్నీ దేవుణ్ని ప్రార్థించడం కాదు. దేవుణ్ని క్రికెట్లోకి, రుతుపవనాల్లోకి, రాజకీయాల్లోకి లాగడం. అంటే దేవుణ్ని మానవమాత్రులలోకి లాగేయడం! ప్రార్థించడం అంటే ‘అడగడం’ కాదంటారు మహాత్మాగాంధీ. దైవ సన్నిధి కోసం ఆత్మ తపించాలట. మన బలహీనతల్ని ఎప్పటికప్పుడు అంగీకరించాలట. హృదయానికి తప్ప మాటలకు తావు ఉండకూడదట. అదే అసలైన ప్రార్థన అంటారు బాపూజీ. మరి దేవుణ్ని అడక్కుంటే కష్టాలు తీరేదెలా? అడుగుదాం. కానీ కష్టాలు తీర్చమని కాదు. కష్టాలను ఓర్చుకునే శక్తిని ఇమ్మని అడుగుదాం. - మాధవ్ శింగరాజు