కొలంబో: షెడ్యూల్ ప్రకారం ద్వైపాక్షిక సిరీస్ కోసం తమ దేశంలో పర్యటించాల్సిందిగా బీసీసీఐని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) కోరింది. కరోనా నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన క్రికెట్ సిరీస్‌లు, టోర్నీల నిర్వహణపై అనిశ్చితి నెలకొనడంతో లంకకు వచ్చే అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా బీసీసీఐకి ఈ–మెయిల్ ద్వారా తెలిపింది. జూన్–జూలై మధ్య శ్రీలంక పర్యటనలో భారత్ 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. కఠిన క్వారంటైన్ నిబంధనలు పాటించడంతో పాటు ప్రేక్షకులు లేకుండానే టోర్నీని నిర్వహిస్తామని లంక అధికారులు పేర్కొనట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ పరిస్థితుల్లో దీనిపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని బీసీసీఐ పేర్కొంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాకే, ప్రయాణ ఆంక్షలు సడలించాకే టోర్నీల గురించి ఆలోచిస్తామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment