cricket matches
-
‘జీ’ పై చర్యలకు డిస్నీ స్టార్ కసరత్తు
న్యూఢిల్లీ: మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌ని మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. క్రికెట్ మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులకు సంబంధించిన ఒప్పందం నుంచి తప్పుకున్నందుకు గాను కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిస్నీ స్టార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జపాన్ దిగ్గజం సోనీ గ్రూప్ భారత విభాగం విలీన డీల్ రద్దుతో సతమతమవుతున్న జీకి ఈ పరిణామం మరింత సమస్యాత్మకంగా మారవచ్చని వివరించాయి. నాలుగేళ్ల పాటు ఐసీసీ మెన్స్, అండర్–19 క్రికెట్ టీవీ ప్రసార హక్కుల కోసం డిస్నీ స్టార్‌తో 2022లో జీ 1.4 బిలియన్ డాలర్ల సబ్–లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద తొలి విడతగా 200 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. సోనీతో డీల్ కుదిరితే వచ్చే నిధుల నుంచి ఈ మొత్తాన్ని చెల్లించవచ్చని జీ భావించింది. కానీ అది రద్దవడంతో చెల్లింపులు జరపలేకపోయింది. తదుపరి ఈ విషయంలో ముందుకెళ్లదల్చుకోవడం లేదంటూ డిస్నీ స్టార్‌కి తెలిపింది. దీంతో డిస్నీ స్టార్ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్నట్లుగా సమాచారం. -
యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన క్రికెట్ మ్యాచ్‌లు ఇవే..!
-
డిస్నీ–స్టార్ సంచలన నిర్ణయం.. ఐసీసీ టోర్నీల టీవీ హక్కులను..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించే టోర్నమెంట్లకు సంబంధించి భారత్‌లో టీవీ, డిజిటల్ ప్రసార హక్కులను మూడు రోజుల క్రితం సుమారు రూ. 24 వేల కోట్లకు డిస్నీ–స్టార్ సొంతం చేసుకుంది. అయితే మంగళవారం ఆ సంస్థ మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. క్రికెట్ మ్యాచ్ ప్రసారాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. తాము గెలుచుకున్న హక్కుల నుంచి టీవీ హక్కులు ‘జీ’ సంస్థకు (సబ్ లీజ్) బదలాయించింది. దీని ప్రకారం 2024–27 మధ్య కాలంలో ఐసీసీ పురుషుల క్రికెట్ టోర్నీలు, అండర్–19 టోర్నీలు ‘జీ’ చానల్స్‌లో ప్రసారం అవుతాయి. ఇదే కాలానికి డిజిటల్ హక్కులను మాత్రం స్టార్ తమ వద్దే అట్టి పెట్టుకుంది. మరోవైపు మహిళల వరల్డ్ కప్ హక్కులను (టీవీ, డిజిటల్) కూడా పూర్తిగా స్టార్ ఉంచుకుంది. వేలంలో తమతో పోటీ పడి ఓడిన ‘జీ’తో స్టార్ ఒప్పందం చేసుకోవడం విశేషం. భారత్‌లో టీవీ ప్రసారాల ద్వారా క్రికెట్ అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ఇది తమకు లభించిన గొప్ప అవకాశమని ‘జీ’ సంస్థ సీఈఓ పునీత్ వ్యాఖ్యానించారు. ఒకే మార్కెట్‌ను ఇద్దరు పోటీదారులు పంచుకోవడం ఇదే మొదటిసారి. భారత్‌లో మ్యాచ్‌లకు సంబంధించి ఐసీసీ వేలం నిబంధనల్లో విజేత తమ హక్కులను మరొకరికి ఇచ్చుకోవచ్చనే క్లాజ్ కూడా ఉంది. దీనిని బట్టి చూస్తే వేలం ఖాయం కావడానికి ముందే స్టార్–జీ మధ్య ఒప్పందం జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. -
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుగా చేప..
కశ్మీర్: మనకు క్రికెట్లో చాలా రకాలు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు తెలుసు. మరి చేపను ఎక్కడైనా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఇవ్వడం చూశారా. ఒక క్రికెట్ మ్యాచ్‌లో చేపను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా పెట్టుకోవడం ఆసక్తిని కల్గిస్తోంది. ఇది కశ్మీర్‌లోని తెకిపూరా కుప్వారా క్రికెట్ లీగ్‌లో చోటు చేసుకుంది. మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన క్రికెటర్‌కు 2.5 కేజీల చేపను అందించడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీన్ని జర్నలిస్టు ఫిర్దోస్ హసన్ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీనికి ఫిదా అవుతున్న అభిమానులు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ లీగ్‌ను ఫేమస్ చేయడం కోసమే ఇలా చేస్తున్నారని ఫిర్దోస్ పేర్కొన్నాడు. అంతేకాకుండా పిచ్ పేలవంగా ఉన్న పరిస్థితిని ఎత్తిచూపడానికి ఇలా చేసి ఉండవచ్చని కూడా ఫిర్దోస్ తెలిపాడు. అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి, ఆటగాళ్లు తమ జేబులోనుంచే డబ్బులు తీయాల్సిన పరిస్థితితో ఇలా చేపన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. మనకు తెలిసినంత వరకు ఒక క్రికెట్ లీగ్‌లో చేపను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఇవ్వడం తొలిసారే కావొచ్చు.(చదవండి:రైనా విలవిల.. నాకే ఎందుకిలా?) Recently, in a cricket match at Tekipora Kupwara, a 2.5 Kg fish was given as Man of the Match award. #CricketDhamaka#ESPN #IPL2020 #kashmircricket pic.twitter.com/fQ7VAJ7Gvb — Firdous Hassan (@FirdousHassan) September 21, 2020 -
డేట్స్ ఖరారు?
-
లంకలో పర్యటించండి
కొలంబో: షెడ్యూల్ ప్రకారం ద్వైపాక్షిక సిరీస్ కోసం తమ దేశంలో పర్యటించాల్సిందిగా బీసీసీఐని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) కోరింది. కరోనా నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన క్రికెట్ సిరీస్‌లు, టోర్నీల నిర్వహణపై అనిశ్చితి నెలకొనడంతో లంకకు వచ్చే అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా బీసీసీఐకి ఈ–మెయిల్ ద్వారా తెలిపింది. జూన్–జూలై మధ్య శ్రీలంక పర్యటనలో భారత్ 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. కఠిన క్వారంటైన్ నిబంధనలు పాటించడంతో పాటు ప్రేక్షకులు లేకుండానే టోర్నీని నిర్వహిస్తామని లంక అధికారులు పేర్కొనట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ పరిస్థితుల్లో దీనిపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని బీసీసీఐ పేర్కొంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాకే, ప్రయాణ ఆంక్షలు సడలించాకే టోర్నీల గురించి ఆలోచిస్తామని తెలిపింది. -
కరోనా తగ్గాకే క్రికెట్: యువరాజ్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ను పూర్తిగా నిర్మూలించాకే క్రికెట్ గురించి ఆలోచించాలని భారత మాజీ స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆట కన్నా ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రతే ముఖ్యమని పేర్కొన్నాడు. మైదానంలో ఉన్నప్పుడు కేవలం ఆట గురించి మాత్రమే ఆలోచించే పరిస్థితులు ఉండాలని, అలా అయితేనే ప్లేయర్ పూర్తి ఏకాగ్రతతో ఆడగలడని వివరించాడు. ‘ముందుగా కరోనా నుంచి ప్రపంచానికి విముక్తి కలిగించాలి. ఈ వైరస్ ఉన్నంతకాలం ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడేందుకు భయపడతారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో ఆటగాడిపై సహజంగానే కొండంత ఒత్తిడి ఉంటుంది. దీనికి తోడు కరోనా వల్ల వారికి అదనపు ఒత్తిడి కలగకూడదు. ఆడే సమయంలో బంతిపై ఏకాగ్రత తప్ప వేరే ఆలోచనలు ఆటగాడి మదిలోకి రాకూడదనేది నా అభిప్రాయం’ అని యువీ పేర్కొన్నాడు. మరో దిగ్గజ భారత ఆటగాడు కపిల్‌దేవ్ కూడా క్రికెట్‌కు మరికొంత కాలం వేచి ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని మట్టుబెట్టేంత వరకు పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్‌కు తన మద్దతు లభించదని కపిల్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. -
ఫేస్‌బుక్‌కు ఐసీసీ డిజిటల్ హక్కులు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)తో ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్బుక్ జత కట్టింది. భారత ఉపఖండంలో జరిగే క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ హక్కులను ఫేస్బుక్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఐసీసీ గురువారం ధ్రువీకరించింది. డిజిటల్ హక్కులతో పాటు మ్యాచ్ పున:ప్రసారాలు, క్రికెట్‌కు సంబంధించిన కథనాలను ఇకనుంచి ఫేస్బుక్ ప్రేక్షకులకు అందించనుంది. 2023 వరకు ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. ‘క్రికెట్ ప్రపంచంలోకి ఫేస్‌బుక్‌ను ఆహా్వనిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తోన్న ఫేస్బుక్ ద్వారా క్రికెట్‌కు మరింత లబ్ధి చేకూరుతుంది’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్ని అన్నారు. ఐసీసీతో భాగస్వామ్యంపై ఫేస్బుక్ హర్షం వ్యక్తం చేసింది. -
‘దీపావళికి క్రికెట్ మ్యాచ్‌లు వద్దు’
ముంబై: దీపావళినాడు భారత క్రికెట్ జట్టు గతంలో అనేక చిరస్మరణీయ విజయాలు సాధించిన విషయం అభిమానులకు గుర్తుండే ఉంటుంది. అయితే ఇకపై అలాంటి గెలుపు పటాస్‌లు వినిపించవు. దీపావళి పండగ సమయంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించవద్దంటూ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ చేసిన విజ్ఞప్తి మేరకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘మా పరిశోధన ప్రకారం దీపావళి సమయంలో ప్రేక్షకులు క్రికెట్ చూడటానికి ఇష్టపడటం లేదని, దానికంటే ఇంట్లో గడపడమే మంచిదని భావిస్తున్నారు. ఆ సమయంలో టీవీ రేటింగ్‌లు కూడా రావడం లేదు. పైగా ఆటగాళ్లకు కూడా తగిన విరామం ఇచ్చేందుకు అదే సరైన సమయం. దీని ప్రకారమే ఇకపై మ్యాచ్‌లు షెడ్యూల్ చేసుకుంటే బాగుంటుంది’ అని స్టార్ తమ నివేదికలో పేర్కొంది. -
బెట్టింగ్ వేస్తే బ్యాటింగే!
సాక్షి, హైదరాబాద్: ఏ దేశంలో క్రికెట్ మ్యాచ్ జరిగినా హైదరాబాద్‌లో బుకీలు సిద్ధమైపోతారు.. ఏ జట్లు ఆడుతున్నా సరే పంటర్లు ఎగబడి మరీ పందేలు కాస్తుంటారు. పార్లమెంట్ నుంచి పంచాయితీ ఎన్నికల వరకు ఏం జరిగినా పందెం రాయుళ్లు పడగ విప్పుతారు.. గెలుపోటములపై బెట్టింగ్స్ నిర్వహిస్తుంటారు. తాజాగా రాష్ట్రంలోని పార్లమెంట్ స్థానాలతో పాటు గతంలో ఎన్నడూ లేని ఉత్కంఠ మధ్య పూర్తయిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై భారీ బెట్టింగ్ జరుగుతోంది. ఇరుగు పొరుగు రాష్ట్రాల బుకీలు, పంటర్లు రంగంలోకి దిగారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న బెట్టింగ్‌లపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు బుకీలపై (పందేలు అంగీకరించే వారు) మాత్రమే కాదు.. పంటర్లనూ (పందేలు కాసే వ్యక్తులు) నిందితులుగా కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు. ఇక్కడ పట్టు బిగిస్తే.. బుకీలు, పంటర్లకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. కొత్తగా బుకీలుగా మారే వారు గతంలో ప్రధాన బుకీల వద్ద పని చేసిన వారై ఉంటారు. తమ యజమానికి చెందిన కొందరు కస్టమర్లను తమ వైపునకు లాక్కొంటున్నారు. వీరిద్వారా పరిచయమైన వారినే కొత్త పంటర్లను కస్టమర్లుగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఉక్కుపాదం మోపితే బయటి ప్రాంతాలకు వెళ్లిపోతున్న బుకీలు తమ రెగ్యులర్ పంటర్ల సాయంతో యథేచ్ఛగా ‘ఆన్లైన్ దందా’ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంటర్లకు చెక్ చెబితే తప్ప బెట్టింగ్ దందాను పూర్తి స్థాయిలో కట్టడి చేయడం సాధ్యం కాదని పోలీసులు నిర్ణయించారు. పందెం కాసేవాళ్లే లేకపోతే అంగీకరించే వారు కూడా ఉండరని భావిస్తున్నారు. దీనికోసం కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. నోటీసుల జారీకి అవకాశం.. ఈ పందాలు కాసే వారిలో యువత ఎక్కువగా ఉంటున్నారు. వీరి బెట్టింగ్స్‌కు బానిసలుగా మారారనే విషయం చాలామంది తల్లిదండ్రులకు తెలీదు. వీరిని కట్టడి చేస్తేనే బుకీలకు అడ్డుకట్ట వేయొచ్చు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు పంటర్లనూ నిందితుల జాబితాలో చేర్చాలని భావిస్తున్నారు. వీరిని అరెస్టు చేసే ఆస్కారం లేకపోయినా నోటీసులు పంపాలని యోచిస్తున్నారు. ఫోన్ నంబర్ల ఆధారంగా చిరునామాలు గుర్తించే అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఆపై నేర నిరూపణకు అవసరమైన ఆధారాలు లభిస్తే వారిపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే వారి కుటుంబీకులకూ విషయం తెలియడంతో పాటు వీరి ఆగడాలకు అడ్డుపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘పందాలు కాసే వారు ఉన్నంత కాలం బుకీలు పుట్టుకు వస్తూనే ఉంటారు. ఇక్కడ దాడులు చేస్తే గోవా, ముంబై వంటి ప్రాంతాలకు వెళ్లి వ్యవహారం నడుపుతున్నారు. పంటర్లను కట్టడి చేస్తే ఆటోమేటిక్‌గా బుకీల వ్యవహారాలకు అడ్డుకట్ట పడుతుంది. అందుకే కొన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు. పక్కాగా దొరుకుతున్న ఆధారాలు బెట్టింగ్ గ్యాంగ్స్‌ను టాస్క్‌ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ వంటి ప్రత్యేక బృందాలతో పాటు స్థానిక పోలీసులూ పట్టుకుంటున్నారు. ఇలాంటి గ్యాంగ్స్/వ్యక్తుల నుంచి పోలీసులు నగదుతో పాటు టీవీ, సెల్ఫోన్లు, ల్యాప్టాప్స్, బెట్టింగ్ స్లిప్స్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారులు పంటర్ల రికార్డులూ గుర్తిస్తుంటారు. పంటర్ల వద్ద దొరికిన ల్యాప్టాప్స్ విశ్లేషిస్తే మరికొందరు పంటర్ల పేర్లూ బయటికొస్తాయి. ఓ బుకీలను అరెస్టు చేస్తే పంటర్లు మరో బుకీ వద్ద పందాలు కాసే అవకాశం ఉందని భావించిన పోలీసులు పంటర్ల పైనా కఠిన చర్యలకు నిర్ణయించారు. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను మించిన వెన్నుపోటు’
-
స్టార్ ఇండియాతో జియో భాగస్వామ్యం
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం రంగంలో సంచలనానికి మారు పేరుగా నిలిచిన రిలయన్స్ జియో మరో కీలక అడుగుముందుకు వేసింది. తాజాగా దేశంలో స్పోర్ట్స్ ఎంటర్టైన్ మెంట్లో సునామీ సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. అన్ని క్రికెట్ మ్యాచ్‌లను జియో టీవీ వినియోగదారులకు అందించేందుకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అయిదు సంవత్సరాల ఒప్పందంపై స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ మేరకు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం జియో వినియోగదారులు జియో టీవీలో హాట్ స్టార్ సహాయంతో ప్రత్యక్ష మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించవచ్చు. జియోటీవీ ద్వారా టీ20 మ్యాచ్‌లు, వన్ డే ఇంటర్నేషనల్స్, అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లతోపాటు బీసీసీఐ నిర్వహించే ప్రీమియం దేశీయ క్రికెట్ పోటీలను కూడా ప్రసారం చేస్తుంది. -
ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీ భద్రత
ఉప్పల్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే అన్ని మ్యాచ్‌ల కోసం భారీ భద్రతను మోహరించామని చెప్పారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేశ్ భగవత్ పలు భద్రతా అంశాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ కార్యదర్శి శేష్ నారాయణ్, రాచకొండ జాయింట్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర్ రావు పాల్గొన్నారు. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ తలపడే 7 మ్యాచ్‌ల కోసం వివిధ విభాగాలకు చెందిన 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 250 మంది సెక్యూరిటీ వింగ్ పోలీసులు, 329 ట్రాఫిక్ సిబ్బంది, 1038 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, 6 ప్లాటూన్ల ఆర్మ్డ్ ఫోర్స్, ఆక్టోపస్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, సీసీఎస్ స్టాఫ్ పోలీసులు ఉన్నారు. పోలీస్ పహారాలో క్రికెట్ స్టేడియం శనివారం నుంచే స్టేడియంను తమ ఆధీనంలోకి తీసుకోనున్నట్లు మహేశ్ భగవత్ తెలిపారు. పోలీస్ భద్రతతో పాటు 100 సీసీ కెమెరాలు, చెక్ పాయింట్లు, బాంబు స్క్వాడ్ బృందాలతో నిరంతరం పహారా కాస్తున్నట్లు తెలిపారు. అవాంఛనీ య ఘటనలు ఏర్పడితే అప్పటికప్పుడు స్పం దించేలా అత్యవసర టీంలను ఏర్పాటు చేశామన్నారు. సంఘ విద్రోహ శక్తులపై గట్టి నిఘా వేసి ఉంచామని, అనుమానితులను ఎప్పటికప్పుడు విచారించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్టేడియంలో మహిళా రక్షణ కోసం షీ టీమ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. తినుబండారాలను అ ధిక ధరలకు విక్రయించే వ్యాపారస్తులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక వెండర్ సూపర్వైజింగ్ టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. మ్యాచ్‌కు 3గంటల ముందు నుంచే అభిమానులను స్టేడియంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. నిషేధిత వస్తువులు... ఎలక్ట్రానిక్ పరికరాలు, కెమెరాలు, అగ్గిపెట్టెలు, బైనాక్యులర్స్, బ్యాగ్‌లు, బ్యానర్లు, సిగరేట్స్, లైట ర్స్, కాయిన్స్, హెల్మెట్స్, బయటి తినుబండారా లు, వాటర్ బాటిల్స్, పెన్నులు, పర్ఫ్యూమ్స్, సెల్‌ఫోన్ బ్యాటరీలను మైదానంలోకి అనుమతించరు. మొబైల్ ఫోన్‌కు అనుమతి ఉందని సీపీ తెలిపారు. ట్రాఫిక్ దారి మళ్లింపు... సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలను మ్యాచ్ జరుగుతున్న సమయాల్లో అనుమతించరు. సికింద్రాబాద్ నుంచి ఘట్కేసర్ వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ ఎన్ఎఫ్సీ బ్రిడ్జి మీదుగా చంగిచర్ల నుంచి వరంగల్ హైవేకు వెళ్లాలని సూచించారు. ఎల్బీనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లాలంటే బోడుప్పల్, చంగిచర్ల మీదుగా హబ్సిగూడ చేరుకోవాల్సి ఉంటుంది. పార్కింగ్... 1800 ఫోర్ వీలర్స్, 4400 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ అవకాశం కల్పించారు. వీఐపీలకు ప్రత్యేక పార్కింగ్ ఉంటుంది. కారు పాస్ ఉన్నవారు రామంతపూర్ దారి గుండా గేట్‌నంబర్ 1, 2లకు వెళ్లాల్సి ఉంటుంది. పాస్ లేని వారు రామంతపూర్ రోడ్డుకు ఇరువైపులా వాహనాలను పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగులకు గేట్–3 గుండా లోపలికి వెళ్లే అవకాశాన్ని కల్పించారు. మెట్రోరైల్, ఆర్టీసీ ప్రత్యేక ట్రిప్పులు... ఐపీఎల్ మ్యాచ్ జరిగే రోజుల్లో ఆర్టీసీ, మెట్రో రైల్ ప్రయాణికుల కోసం అర్ధరాత్రి ఒంటిగంట వరకు తమ సేవల్ని అందించనున్నాయని మహేశ్ భగవత్ తెలిపారు. ప్రైవేట్ వాహనాలు ప్రయాణీకులను నిలువునా దోచుకుంటున్నందున ఈ ఏర్పాట్లు చేశామని చెప్పారు. -
సాక్షి ఎరీనా వన్ క్రికెట్ పోటీలు
-
సాక్షి ఎరినావన్ నేత్రుత్వంలో క్రికెట్ పోటీలు
-
భారత్ నుంచి పాక్ ఎలాగైనా సాధిస్తుంది!
పాకిస్తాన్ తో భారత్ టెస్టులు ఆడకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని పాక్ క్రికెట్ చీఫ్ సెలక్టర్, మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ అన్నాడు. టెస్టుల్లో అద్భుత ప్రదర్శనతో పాకిస్తాన్ న్ వెనక్కినెడుతూ భారత్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. దీనిపై ఇంజీ స్పందిస్తూ.. భారత్ తో మ్యాచ్ లు లేకపోతేనేం.. మాకేం నష్టం లేదు. ఇతర జట్లపై పాక్ విజయాలు సాధించి భారత్ నుంచి అగ్రస్థానాన్ని తిరిగి లాగేసుకుంటామని ధీమా వ్యక్తంచేశాడు. భారత్ తో వన్డే, టెస్టు సిరీస్ లు ఆడిన పాక్ జట్టుకు తాను కెప్టెన్ గా వ్యవహరించానని, ఈ మ్యాచ్ లు ఎంతముఖ్యమో తనకు తెలుసునన్నాడు. భారత్ స్వదేశంలో త్వరలో మరో 13 టెస్టులు ఆడనుండగా, తమ జట్టు మాత్రం 2009 నుంచి స్వదేశంలో మ్యాచ్ ఆడటంలేదని ఇంజమామ్ వాపోయాడు. భారత్ విదేశాల్లో సిరీస్ లు నెగ్గలేదని, పాక్ మాత్రం ఎక్కడైనా రాణిస్తుందని చెప్పాడు. ఇంగ్లండ్ లో భారత్ ఓటమిపాలైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశాడు. పాక్ కేవలం ఆస్ట్రేలియా గడ్డపైనే ఇబ్బందులు ఎదుర్కొంటుందని వివరించాడు. -
విజయం దిశగా విశాఖ
కడప స్పోర్ట్స్: కడప నగరం కేఓఆర్ఎం క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న అండర్–19 ఎలైట్ గ్రూపు కడప–వైజాగ్ జట్ల మధ్య నిర్వహిస్తున్న మ్యాచ్‌లో విశాఖ జట్టు విజయం దిశగా దూసుకెళ్తోంది. వర్షం కారణంగా మధ్యాహ్నం ప్రారంభమైన మ్యాచ్‌లో విశాఖ జట్టు 32 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగింది. 58.3 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులోని జోగేష్ 49, ఆశిష్ 35, అజయ్‌కుమార్ 24, ధీరజ్ 27 పరుగులు చేశారు. కడప బౌలర్లు ఆరీఫ్ 5 వికెట్లు, హరి 2 రెండు వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 20 పరుగులు చేసింది. జట్టులోని సాయిసుధీర్ 5, నూర్‌బాషా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా విశాఖ జట్టు తొలి ఇఇన్నింగ్స్లో 112 పరుగులు చేయగా, కడప తొలి ఇన్నింగ్స్‌లో 69 పరుగులు చేసిన విషయం విదితమే. దీంతో రెండో రోజు ఆట ముగిసింది. రసవత్తరంగా అనంతపురం, గుంటూరు మ్యాచ్.. కేఎస్ఆర్ఎం క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న అనంతపురం, గుంటూరు జట్ల మధ్య సాగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. వర్షం కారణంగా మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో 381 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన అనంతపురం జట్టు 100.4 ఓవర్లలో 425 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. జట్టులోని ముదాసిర్ 73 పరుగులు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గుంటూరు జట్టు ధాటిగా ఆడుతూ 17 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 92 పరుగులు చేసింది. జట్టులోని మహీప్‌కుమార్ 38, నోవా 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో రెండో రోజు ఆట ముగిసింది. -
అందరి చూపు... ఆ మ్యాచ్ వైపు
► నేడు భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య పోరు ► సత్తెనపల్లి ప్రాంతంలో బెట్టింగ్‌లకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు ► వడ్డీలకు డబ్బు తెచ్చి పందెం కాస్తున్న యువత క్రికెట్ మాట వింటేనే యువతకు ఎక్కడలేని ఉత్సాహం ఆటను ఆస్వాదించాల్సిన యువత బెట్టింగ్లకుపాల్పడుతూ తమ జీవితాలను బుగ్గి చేసుకుంటుంది. ఇప్పటి వరకు జరిగిన క్రికెట్ పోటీలు ఓ ఎత్తు. శనివారం జరగనున్న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ ఒక్కటే ఒక ఎత్తు. ఈ మ్యాచ్ వైపు అందరి చూపు నెలకొంది. సత్తెనపల్లి: ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి రోజంతా శ్రమించి చదివిస్తున్న తల్లిదండ్రుల ఆశయాలను తుంగలో తొక్కి యువత క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతోంది. ఈ మహమ్మారిని అరికట్టకపోతే తీవ్ర విష పరిణామాలు సమాజంలో చోటు చేసుకోక తప్పదని సామాజిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. బెట్టింగ్ వంటి వ్యసనానికి పాల్పడుతూ సత్తెనపల్లిలో కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డ ఉదంతాలు ఉన్నాయి. మరికొందరైతే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఏవో మాటలు చెప్పి ఇంట్లో నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొచ్చి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఇంట్లో డబ్బు ఇవ్వకపోతే తమ వద్ద ఉన్న ల్యాప్‌ట్యాప్‌లు, ద్విచక్ర వాహనాలు, స్మార్ట్ఫోనులు తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు డబ్బు తెచ్చి బెట్టింగ్‌లకు పాల్పడడం ఇక్కడ పరిపాటిగా మారింది. వస్తువులు లేకపోతే ఖాళీ ప్రామిసరి నోట్లు, ఖాళీ చెక్కులపై సంతకాలు చేసి రూ.10 వడ్డీకి తీసుకొని మరీ బెట్టింగ్‌ల్లో పాల్గొంటున్నారు. వడ్డీ వ్యాపారులు కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందాన అధిక వడ్డీలకు ఇస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ బెట్టింగ్‌లలో నగదు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాల్లో కూడా మోసాలు చోటు చేసుకుంటున్నాయి. మోసపోయిన వారు ఘర్షణలకు దిగడంతో ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి చేరుతోంది. అప్పుడు బెట్టింగ్‌లకు పాల్పడినవారిపై, నిర్వహించిన వారి పై చర్యలు తీసుకోవడంతో అసలుకే నష్టం వస్తుంది. నేటి మ్యాచ్‌కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు... ఏ మాత్రం పోలీసులకు అనుమానం రాకుండా భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు నిర్వహించేందుకు సత్తెనపల్లి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఏమి మాట్లాడుకోకుండా కళ్లతోనే సైగలు చేసుకుంటూ రహస్య ప్రాంతాలకు వెళుతున్నారు. మరి కొందరైతే దిక్కులు చూసుకుంటూ స్మార్ట్‌ఫోన్లల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. బెట్టింగ్‌ల్లో టాస్ ఎవరు గెలుస్తారు, ఏ ఓవర్లో ఎవరు ఎన్ని పరుగులు తీస్తారు. మొత్తం మీదు ఎన్ని పరుగులు చేస్తారు, మ్యాచ్‌లో విజయం ఎవరు సాధిస్తారు, ఈ బాల్లో సిక్స్ కొడతారా లేదా ఇలా బంతి బంతికి బెట్టింగ్‌లు కాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా ఆన్లైన్ కావడంతో సెల్ఫోన్ల ద్వారా మాట్లాడుకుంటూ చాప కింద నీరులా వ్యవహారం నడిపిస్తున్నారు.బుకీలు పెద్ద ఎత్తున ఫోన్ల ద్వారా రేటింగ్స్ చెబుతుండటంతో బెట్టింగ్ రాయుళ్ళు అందుకనుగుణంగా బెట్టింగ్‌లు కట్టడం జరుగుతుంది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో పోలీసులు దృష్టి సారించి బెట్టింగ్‌లు జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
బెట్టింగ్ భూతం
బొబ్బిలి: క్రికెట్ మ్యాచ్‌లు యు వతకు ఆహ్లాదాన్ని పంచుతున్నా యో..? వారిని అప్పుల పాలు చేస్తున్నాయో? తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్నాయో? అర్థం కాని పరిస్థితి తయారైంది. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలో నలుగురు యువకులు కలిస్తే చాలు. ఈ రోజు అవుతున్న క్రికెట్ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో పందెం ఉందా? ఎంతైనా పర్వాలేదు... ఉందంటే ఒక్కఫోన్ చెయ్. అవతల గట్టి పార్టీ ఎదురుచూస్తోంది. ఇలా ఒక్క ఫోన్ కాల్స్‌లోనే లక్షలాది రూపాయలు బెట్టింగ్ అవుతున్నాయి. పట్టణంలోని కొన్ని రహస్య ప్రదేశాల్లో యువత గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్‌లు నడుపుతున్నారు. ఇదే బెట్టింగ్ వ్యవహారం కారణంగా పట్టణంలో వ్యాపారం నిర్వహిస్తున్న ఓ యువకుడు అదృశ్యమవడం కలకలం రేపుతోంది. పట్టణంలోని మార్కెట్లో నివాసముంటున్న నారంశెట్టి రమేష్ ఇంటర్ వరకూ చదువుకున్నాడు. తండ్రి అన్నాజీరావు నడుపుతున్న కిరాణా దుకాణం వద్ద ఉంటూ సాయం చేస్తుంటాడు.. ఆ మార్కెట్లోనే క్రికెట్ బెట్టింగుల జోరు అధికంగా జరుగుతుంది.. ఆఫీవరు రమేష్‌కూ పట్టేసింది. బెట్టింగ్‌లపై ఆసక్తి పెరిగి ఆ మోజులో పడిపోయి అప్పులు చేయడం మొదలు పెట్టాడు.. ఎప్పుడూ లేనంతగా కొడుక్కి స్నేహితులు పెరగడం, ఫోన్లు రావడంతో పాటు వచ్చిన స్నేహితులంతా చెడు మార్గంలో ఉన్నట్టు తండ్రి గుర్తించారు. దాంతో ఓ రోజు ఆరా తీసి కొడుకును మందలించాడు ఈ క్రికెట్ బెట్టింగ్‌ల వల్ల వేలాది రూపాయల అప్పులు ఉన్నాయని గుర్తించారు. ఇక ముందు ఇలాంటి పందాలు కాయనని దేవుడు మీద ప్రమాణం చేయించుకున్నారు. చివరికి కొడుకు చేసిన అప్పులు తీర్చడానికి తండ్రి అంగీకరించారు. అనంతరం ఇటీవల గోదావరి పుష్కరాలకు రమేష్ స్నేహితులతో కలిసి వెళ్లి వచ్చాడు. ఇంతలో ఏమయ్యిందో ఏమో గానీ రమేష్ షాపులో ఉండగానే శనివారం సాయంత్రం నుంచి అదృశ్యమయ్యాడు. అతని దగ్గర ఉన్న ఖరీదైన సెల్‌ఫోన్‌తో పాటు చేతికున్న ఉంగరాలను అక్కడే వదిలేసి అదృశ్యమయ్యాడు. రాత్రవుతున్నా ఇంటికి కొడుకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీసినా ఫలితం లేకపోయింది. దీంతో వారు ఆవేదన చెంది పోలీస్ స్టేషనులో పిర్యాదు చేశారు. ఒక్కగానొక్క కొడుకు రమేష్ ఏమయ్యాడో తెలియక తల్లి, చెల్లి బంధువులు రోదిస్తున్నారు. ఇప్పటివరకూ ఎక్కడ నుంచి ఎటువంటి సమాచారం తెలియకపోవడంతో ఎవరైనా ఏమైనా చేశారా, ఎక్కడైనా దాచారా, ఎక్కడికైనా తీసుకెళ్లారా వంటి అనుమానాలను బంధువులు వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణలో భాగంగా రమేష్ స్నేహితులు, నిత్యం బెట్టింగ్ వ్యవహారాలు నడుపుతున్న వారిపై దృ ష్టి పెట్టారు. క్రికె ట్ బె ట్టింగ్ కొంపలను కూలుస్తున్న సంగతి పోలీసుల దృష్టిలో ఉన్నా ఎందుకనో దీనిని సీరియస్‌గా తీ సుకోకపోవడం వల్ల ఆస్తులు అమ్ముకునే వారు, రమేష్‌లా అదృశ్యమవుతున్న వారు అధికమవుతున్నారు. ఇకనైనా ఈ బెట్టింగ్ వ్యవహారంపై పోలీ సులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. -
విద్యార్థి ఆత్మహత్యాయత్నం
యలమంచిలి : నిత్యం టీవీలో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ కాలం వృథా చేస్తున్న కొడుకును చదువుకోమని తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురై తొందరపాటుతో తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సకాలంలో గుర్తించడంతో విద్యార్థిని యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తీసుకురావడంతో వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ఎస్.రాయవరం మండలం సైతారుపేటకు చెందిన కొనగళ్ల సాయి అదే గ్రామంలో హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు నాటి నుంచి సాయి చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, రాత్రిళ్లు కూడా టీవీలో క్రికెట్ మ్యాచ్‌లు చూడటం అలవాటు చేసుకున్నాడు. దీంతో తండ్రి నందీశ్వరరావు శనివారం రాత్రి కొడుకును మందలించారు. మనస్థాపానికి గురైన సాయి రోజూమాదిరి ఆదివారం పాల సేకరణ కేంద్రం నుంచి పాలు కొనుగోలు చేసేందుకు స్టీల్ క్యాన్ పట్టుకుని బయటకు వెళ్లాడు. అదే క్యాన్‌లో ఇంట్లో అందుబాటులో ఉన్న పశువులకు ఇచ్చే ఒక ఔషధాన్ని తీసుకెళ్లాడు. అది తాగి ఇంటికి వచ్చిన అనంతరం తాను చచ్చిపోతున్నాను.. అంటూ తల్లి కాసులమ్మకు విషయం చెప్పాడు. ఆమె బాలుడ్ని యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చింది. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందని వైద్య సిబ్బంది తెలిపారు. -
కేక పెట్టించిన లంక
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : ఆరు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు భారతదేశ పర్యటనకు వచ్చిన శ్రీలంక మహిళా జట్టు వార్మప్ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ నెల 19 నుంచి 28 వరకు మూడు వన్డేలు..మూడు టీ-20 మ్యాచ్‌లు ఆడేం దుకు వచ్చిన శ్రీలంక మహిళా జట్టు వార్మప్ మ్యాచ్‌లో భారత్-ఎ జట్టుపై 12 పరుగుల తేడాతో విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. విజ యనగరం సమీపంలోని నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్-ఎ జట్టుతో తలపడిన శ్రీలంక ప్రధాన జట్టు 12 పరుగుల తేడా తో గెలుపొందింది. నిర్ణీ త 50 ఓవర్లకు నిర్వహిం చిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్-ఎ మహి ళా జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో శ్రీలంక జట్టు బ్యాటింగ్‌కు దిగింది. మ్యాచ్‌లో 49.5 ఓవర్లలో శ్రీలంక మహిళా జట్టు 10 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేయగలిగింది. జట్టు బ్యాటింగ్ విభాగంలో యశోదా మెండిస్ 62 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్‌తో 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా... మిగిలిన క్రీడాకారుల ఆటపట్టు 30, దీపిక 17, శిరివర్ధనే 11 పరుగులతో రాణిం చారు. మ్యాచ్‌లో తొలి వికెట్ భాగస్వామ్యానికి ఆటపట్టు, యశోదా మెండిస్ 87 పరుగులు జోడించారు. బౌలింగ్ విభాగంలో భారత్-ఎ జట్టు క్రీడాకారిణులు ప్రీతి బోస్ మూడు వికెట్లు దక్కించుకుంది. అనంతరం లక్ష్య సాధన కోసం బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ జట్టు 47.3 ఓవర్లలో కేవలం 174 పరుగులతో మొత్తం వికెట్లు కోల్పోవటంతో 12 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. జట్టులో స్మృతిమందానా 49 పరుగులు, వేదాకృష్ణమూర్తి 19, స్నేహా మోరే 27, షికాపాండే 32 పరుగులతో రాణించారు. భారత్-ఎ జట్టులో క్రీడాకారి ణులు స్నేహామోరే, షికా పాండేలు ఏడో వికెట్ భాగస్వామ్యానికి 38 పరుగులు జోడించి పర్వాలేదని పించారు. బౌలింగ్‌లో శ్రీలంక జట్టు క్రీడాకారిణులు ఒషాది రనషింగ్ రెండు వికెట్లు దక్కించుకుంది. భారత్-ఎ జట్టులో భారత ప్రధాన జట్టులో ఉన్న వేదాకృష్ణమూర్తి వార్మప్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా... స్మృతి మందానా అనే మరో క్రీడాకారిణి ఆడారు. జిల్లాకు అంతర్జాతీయ ఖ్యాతి... క్రీడలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన విజయనగరానికి అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి దక్కింది. ఇప్పటికే వివిధక్రీడాంశాల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి పలు పతకాలు దక్కించుకోవటం ద్వారా జిల్లా కీర్తి ప్రతిష్టలు ఎల్లలు దాటిస్తుండగా.. అంతర్జాతీయ క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వటం ద్వారా ఆ ఖ్యాతి మరింత పెరగనుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల 19 నుంచి 28 వరకు శ్రీలంక మహిళా జట్టు భారత పర్యటనలో భాగంగా ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుండగా అందులో ఒక వార్మప్ మ్యాచ్‌తో పాటు మరో రెండు టీ-20 మ్యాచ్‌లు జిల్లాకు సమీపంలో గల నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీలో జరగనున్నట్లు ఏసీఏ మీడియా ఇన్చార్జి ప్రకటించారు. తద్వారా జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పెరగటంతో పాటు జిల్లా క్రికెట్ అభివృద్ధికి ఇటువంటి మ్యాచ్‌లు దోహదపడనున్నాయి. టీ-20 మ్యాచ్‌లకు ఆతిథ్యం... శ్రీలంక మహిళా జట్టు భారత్ పర్యటనలో భాగంగా ఆడనున్న రెండు టీ-20 మ్యాచ్‌లకు నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మీడియా ఇన్‌ఛార్జి సిఆర్.మోహన్ మ్యాచ్ షెడ్యూల్‌ను ప్రకటించారు. శ్రీలంక మహిళా జట్టుతో భారత మహిళా జట్టు మూడు టీ-20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా అందులో మొదటి, రెండవ మ్యాచ్‌లు విజయనగరం సమీపంలో గల నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీలో జరగనున్నాయి. ఈ నెల 25, 26 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.