విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : ఆరు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు భారతదేశ పర్యటనకు వచ్చిన శ్రీలంక మహిళా జట్టు వార్మప్ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ నెల 19 నుంచి 28 వరకు మూడు వన్డేలు..మూడు టీ-20 మ్యాచ్‌లు ఆడేం దుకు వచ్చిన శ్రీలంక మహిళా జట్టు వార్మప్ మ్యాచ్‌లో భారత్-ఎ జట్టుపై 12 పరుగుల తేడాతో విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. విజ యనగరం సమీపంలోని నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్-ఎ జట్టుతో తలపడిన శ్రీలంక ప్రధాన జట్టు 12 పరుగుల తేడా తో గెలుపొందింది. నిర్ణీ త 50 ఓవర్లకు నిర్వహిం చిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్-ఎ మహి ళా జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో శ్రీలంక జట్టు బ్యాటింగ్‌కు దిగింది. మ్యాచ్‌లో 49.5 ఓవర్లలో శ్రీలంక మహిళా జట్టు 10 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేయగలిగింది. జట్టు బ్యాటింగ్ విభాగంలో యశోదా మెండిస్ 62 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్‌తో 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా... మిగిలిన క్రీడాకారుల ఆటపట్టు 30, దీపిక 17, శిరివర్ధనే 11 పరుగులతో రాణిం చారు. మ్యాచ్‌లో తొలి వికెట్ భాగస్వామ్యానికి ఆటపట్టు, యశోదా మెండిస్ 87 పరుగులు జోడించారు. బౌలింగ్ విభాగంలో భారత్-ఎ జట్టు క్రీడాకారిణులు ప్రీతి బోస్ మూడు వికెట్లు దక్కించుకుంది.
అనంతరం లక్ష్య సాధన కోసం బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ జట్టు 47.3 ఓవర్లలో కేవలం 174 పరుగులతో మొత్తం వికెట్లు కోల్పోవటంతో 12 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. జట్టులో స్మృతిమందానా 49 పరుగులు, వేదాకృష్ణమూర్తి 19, స్నేహా మోరే 27, షికాపాండే 32 పరుగులతో రాణించారు. భారత్-ఎ జట్టులో క్రీడాకారి ణులు స్నేహామోరే, షికా పాండేలు ఏడో వికెట్ భాగస్వామ్యానికి 38 పరుగులు జోడించి పర్వాలేదని పించారు. బౌలింగ్‌లో శ్రీలంక జట్టు క్రీడాకారిణులు ఒషాది రనషింగ్ రెండు వికెట్లు దక్కించుకుంది. భారత్-ఎ జట్టులో భారత ప్రధాన జట్టులో ఉన్న వేదాకృష్ణమూర్తి వార్మప్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా... స్మృతి మందానా అనే మరో క్రీడాకారిణి ఆడారు.
జిల్లాకు అంతర్జాతీయ ఖ్యాతి...
క్రీడలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన విజయనగరానికి అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి దక్కింది. ఇప్పటికే వివిధక్రీడాంశాల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి పలు పతకాలు దక్కించుకోవటం ద్వారా జిల్లా కీర్తి ప్రతిష్టలు ఎల్లలు దాటిస్తుండగా.. అంతర్జాతీయ క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వటం ద్వారా ఆ ఖ్యాతి మరింత పెరగనుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల 19 నుంచి 28 వరకు శ్రీలంక మహిళా జట్టు భారత పర్యటనలో భాగంగా ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుండగా అందులో ఒక వార్మప్ మ్యాచ్‌తో పాటు మరో రెండు టీ-20 మ్యాచ్‌లు జిల్లాకు సమీపంలో గల నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీలో జరగనున్నట్లు ఏసీఏ మీడియా ఇన్‌చార్జి ప్రకటించారు. తద్వారా జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పెరగటంతో పాటు జిల్లా క్రికెట్ అభివృద్ధికి ఇటువంటి మ్యాచ్‌లు దోహదపడనున్నాయి.
టీ-20 మ్యాచ్‌లకు ఆతిథ్యం...
శ్రీలంక మహిళా జట్టు భారత్ పర్యటనలో భాగంగా ఆడనున్న రెండు టీ-20 మ్యాచ్‌లకు నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మీడియా ఇన్‌ఛార్జి సిఆర్.మోహన్ మ్యాచ్ షెడ్యూల్‌ను ప్రకటించారు. శ్రీలంక మహిళా జట్టుతో భారత మహిళా జట్టు మూడు టీ-20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా అందులో మొదటి, రెండవ మ్యాచ్‌లు విజయనగరం సమీపంలో గల నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీలో జరగనున్నాయి. ఈ నెల 25, 26 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
కేక పెట్టించిన లంక
Published Sat, Jan 18 2014 4:32 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM
Advertisement
Advertisement