Kolagatla Veerabhadra Swamy Jalasana For One Hour, Watch Video - Sakshi
Sakshi News home page

గంటపాటు డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి జలాసనాలు

Published Wed, Jul 12 2023 11:33 AM | Last Updated on Wed, Jul 12 2023 1:04 PM

Kolagatla Veerabhadra Swamy Jalasana For One Hour - Sakshi

నీటిలో యోగాసనం వేస్తున్న కోలగట్ల 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: గంట పాటు నీటిపై తేలియాడుతూ..పలు యోగాస­నాలు వేసి రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి­(64) అందరినీ ఆకట్టుకు­న్నారు. జాతీయ స్విమ్మింగ్‌ పూల్‌ డేను పురస్కరించుకుని క్రీడారంగ విశిష్టత, స్విమ్మింగ్‌ సాధన, యోగాసనాల వల్ల కలిగే ప్రయో­జనాలపై అవ­గా­హ­న కల్పిం­చడానికి విజయ­నగరం­లోని కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఉన్న ఆక్వా స్విమ్మింగ్‌ పూల్‌లో మంగళవారం ఆయన కార్యక్రమం చేపట్టారు.

ఈ ప్రదర్శ­నను అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూ­టీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రి బొత్స సత్యనారాయణ, విజయన­గరం జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరా­వు తదితరులు ప్రారంభించా­రు. నిర్వి­ఘ్నంగా గంట పాటు ఈ కార్య­క్రమాన్ని నిర్వహించి అనంతరం దేశ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ ముగించారు.  ఎంపీ బెల్లాన చంద్ర­శేఖర్‌ కోలగట్లను సత్కరించారు.
చదవండి: బాబు, సోనియా ఏపీకి అన్యాయం చేశారా? ఇదిగో ఇలా బయటపడింది..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement