
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)తో ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్ జత కట్టింది. భారత ఉపఖండంలో జరిగే క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ హక్కులను ఫేస్‌బుక్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఐసీసీ గురువారం ధ్రువీకరించింది. డిజిటల్ హక్కులతో పాటు మ్యాచ్ పున:ప్రసారాలు, క్రికెట్‌కు సంబంధించిన కథనాలను ఇకనుంచి ఫేస్‌బుక్ ప్రేక్షకులకు అందించనుంది. 2023 వరకు ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. ‘క్రికెట్ ప్రపంచంలోకి ఫేస్‌బుక్‌ను ఆహా్వనిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తోన్న ఫేస్‌బుక్ ద్వారా క్రికెట్‌కు మరింత లబ్ధి చేకూరుతుంది’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్ని అన్నారు. ఐసీసీతో భాగస్వామ్యంపై ఫేస్‌బుక్ హర్షం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment