విజయం దిశగా విశాఖ
కడప స్పోర్ట్స్:
కడప నగరం కేఓఆర్‌ఎం క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న అండర్–19 ఎలైట్ గ్రూపు కడప–వైజాగ్ జట్ల మధ్య నిర్వహిస్తున్న మ్యాచ్‌లో విశాఖ జట్టు విజయం దిశగా దూసుకెళ్తోంది. వర్షం కారణంగా మధ్యాహ్నం ప్రారంభమైన మ్యాచ్‌లో విశాఖ జట్టు 32 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగింది. 58.3 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులోని జోగేష్ 49, ఆశిష్ 35, అజయ్‌కుమార్ 24, ధీరజ్ 27 పరుగులు చేశారు. కడప బౌలర్లు ఆరీఫ్ 5 వికెట్లు, హరి 2 రెండు వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 20 పరుగులు చేసింది. జట్టులోని సాయిసుధీర్ 5, నూర్‌బాషా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా విశాఖ జట్టు తొలి ఇఇన్నింగ్స్‌లో 112 పరుగులు చేయగా, కడప తొలి ఇన్నింగ్స్‌లో 69 పరుగులు చేసిన విషయం విదితమే. దీంతో రెండో రోజు ఆట ముగిసింది.
రసవత్తరంగా అనంతపురం, గుంటూరు మ్యాచ్..
కేఎస్‌ఆర్‌ఎం క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న అనంతపురం, గుంటూరు జట్ల మధ్య సాగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. వర్షం కారణంగా మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో 381 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన అనంతపురం జట్టు 100.4 ఓవర్లలో 425 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. జట్టులోని ముదాసిర్ 73 పరుగులు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గుంటూరు జట్టు ధాటిగా ఆడుతూ 17 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 92 పరుగులు చేసింది. జట్టులోని మహీప్‌కుమార్ 38, నోవా 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో రెండో రోజు ఆట ముగిసింది.