న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ను పూర్తిగా నిర్మూలించాకే క్రికెట్ గురించి ఆలోచించాలని భారత మాజీ స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆట కన్నా ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రతే ముఖ్యమని పేర్కొన్నాడు. మైదానంలో ఉన్నప్పుడు కేవలం ఆట గురించి మాత్రమే ఆలోచించే పరిస్థితులు ఉండాలని, అలా అయితేనే ప్లేయర్ పూర్తి ఏకాగ్రతతో ఆడగలడని వివరించాడు. ‘ముందుగా కరోనా నుంచి ప్రపంచానికి విముక్తి కలిగించాలి. ఈ వైరస్ ఉన్నంతకాలం ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడేందుకు భయపడతారు.
దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో ఆటగాడిపై సహజంగానే కొండంత ఒత్తిడి ఉంటుంది. దీనికి తోడు కరోనా వల్ల వారికి అదనపు ఒత్తిడి కలగకూడదు. ఆడే సమయంలో బంతిపై ఏకాగ్రత తప్ప వేరే ఆలోచనలు ఆటగాడి మదిలోకి రాకూడదనేది నా అభిప్రాయం’ అని యువీ పేర్కొన్నాడు. మరో దిగ్గజ భారత ఆటగాడు కపిల్‌దేవ్ కూడా క్రికెట్‌కు మరికొంత కాలం వేచి ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని మట్టుబెట్టేంత వరకు పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్‌కు తన మద్దతు లభించదని కపిల్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment