స్టార్‌ ఇండియాతో జియో భాగస్వామ్యం | Reliance Jio signs 5-year partnership deal with Star for cricket content on Jio TV says Agencies | Sakshi
Sakshi News home page

స్టార్‌ ఇండియాతో జియో భాగస్వామ్యం

Published Fri, Sep 21 2018 5:30 PM | Last Updated on Fri, Sep 21 2018 5:33 PM

Reliance Jio signs 5-year partnership deal with Star for cricket content on Jio TV  says Agencies - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం రంగంలో సంచలనానికి మారు పేరుగా నిలిచిన రిలయన్స్‌ జియో​  మరో కీలక అడుగుముందుకు వేసింది. తాజాగా దేశంలో స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌ మెంట్‌లో సునామీ సృష్టించేందుకు సిద్ధమవుతోంది.  ప్రముఖ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో  కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది.  అన్ని క్రికెట్‌  మ్యాచ్‌లను జియో టీవీ  వినియోగదారులకు అందించేందుకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అయిదు సంవత్సరాల ఒప్పందంపై స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ ఈ మేరకు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం  జియో వినియోగదారులు జియో టీవీలో హాట్‌ స్టార్‌ సహాయంతో ప్రత్యక్ష మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించవచ్చు. జియోటీవీ ద్వారా టీ20 మ్యాచ్‌లు, వన్‌ డే ఇంటర్నేషనల్స్‌,  అంతర్జాతీయ టెస్ట్‌ మ్యాచ్‌లతోపాటు బీసీసీఐ నిర్వహించే ప్రీమియం దేశీయ  క్రికెట్‌ పోటీలను కూడా ప్రసారం చేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement