సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీ ఐ) ఈ రెండు దిగ్గజ కంపెనీలు డిజిటల్ భాగస్వామ్యాన్నికుదుర్చుకున్నాయి. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ రిలయన్స్‌కు చెందిన జియోతో జత కలిసింది. ఇందుకు జియోతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుంది. ఎస్‌బీఐ డిజిటల్ యాప్ యోనో డిజిటల్ సేవలను, మై జియో యాప్ ద్వారా ఇంటిగ్రేటెడ్ కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఇరు కంపెనీలు మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయు)పై గురువారం సంతకాలు చేశాయి. తద్వారా ఎస్‌బీఐ వినియోగదారులకు జియో ద్వారా ప్రత్యేక ఆఫర్లు లభించనున్నాయి.
తమ వినియోగదారులకు ప్రత్యేకమైన డిజిటల్ బ్యాంకింగ్, చెల్లింపులు,ఇతర వాణిజ్య ప్రయోజనాలను అందించన్నామని రెండు కంపెనీలు ఒక అధికారిక ప్రకటనలో తెలిపాయి. ఈ భాగస్వామ్యంతో తన డిజిటల్ కస్టమర్ బేస్‌ను భారీగా పెంచుకోవాలని ఎస్‌బీఐ యోచిస్తోంది. అలాగే ఎస్‌బీఐ వినియోగదారులకు ఆర్థిక సేవలను జియో పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అందించనుంది. కాగా ఎస్‌బీఐ మొబైల్ యాప్ యోనో ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్, ఇన్సూరెన్స్, షాపింగ్, వంటి సేవలతోపాటు వినియోగదారులు నేరుగా యాప్ నుంచే గృహ రుణాలు, వాహన రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాతాను తెరవొచ్చు, డబ్బు బదిలీ చేసుకోవచ్చు. ఎటువంటి పత్రాలు లేకుండా ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్, ఎఫ్‌డీలపై ఓవర్ డ్రాప్ట్ తీసుకునే సౌలభ్యం ఉంది. తాజా ఒప్పందంతో ఈ సేవలన్నింటినీ మై జియో యాప్ ద్వారా కూడా పొందవచ్చన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment