
ఏఐ ఆధారిత టూల్స్ కోసం రూ.1,000 కోట్ల ఒప్పందం
న్యూఢిల్లీ: టెక్నాలజీ సొల్యూషన్లను అందించే కాల్కలస్ గ్రూప్.. ఎన్‌జీవో అయినా హెచ్‌ఆర్‌డీఎస్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఏకోసిస్టమ్ ఏర్పాటుకు వీలుగా కావాల్సిన ఏఐ ఆధారిత టూల్స్‌ను కాల్కలస్ గ్రూప్ అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం రూ.1,000 కోట్లతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.
గ్రామీణాభివద్ధికి సంబంధించి హెచ్‌ఆర్‌డీఎస్ చేపట్టే ప్రాజెక్టుల పూర్తికి గాను టెక్నాలజీ పరమైన సహకారాన్ని కాల్కలస్ గ్రూప్ అందించనుంది. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్‌లు, టెలికమ్యూనికేషన్ కంపెనీలకు టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ను తాము అభివృద్ధి చేసి ఇస్తుంటామని కాల్కలస్ గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈవో సూరజ్ వాసుదేవన్ తెలిపారు. హెచ్‌ఆర్‌డీఎస్‌తో చేసుకున్న ఈ రూ.1,000 కోట్ల ఎంవోయూ కింద కావాల్సిన టెక్నాలజీ పరిష్కారాలను తాము అందించనున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment