ecosystem
-
ఫార్మాకు కొత్త పీఎల్ఐ పథకం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగానికి కొత్త ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టడంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) తయారీకి అవసరమైన కీలక రసాయనాల ఉత్పత్తిని దేశీయంగా పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తద్వారా కీలక రసాయనాల ఉత్పత్తుల కోసం భారతీయ కంపెనీలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్ధేశం. ఫార్మాతో ముడిపడి ఉన్న అన్ని విభాగాలు ప్రస్తుత పీఎల్ఐ కింద కవర్ కాలేదు. దీని కారణంగా ఈ రసాయనాలు ఇప్పటికీ చైనా నుండి పెద్దమొత్తంలో భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. అయితే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే నూతన పీఎల్ఐ కార్యరూపంలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే తదుపరి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదిత పథకం భాగం కావచ్చు. ప్రస్తుత పథకానికి సవరణ.. భారత్‌కు దిగుమతి అవుతున్న ఫార్మా ముడిపదార్థాల్లో 55–56 శాతం వాటా చైనాదే. 2013–14లో దిగుమతైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్‌లో చైనా వాటా విలువ పరంగా 64 శాతం, పరిమాణం పరంగా 62 శాతం వృద్ధి నమోదైంది. 2022–23 వచ్చేసరికి ఇది వరుసగా 71 శాతం, 75 శాతానికి ఎగబాకింది. చైనా నుంచి ముడిపదార్థాల (బల్క్ డ్రగ్) దిగుమతులు 2013–14లో 2.1 బిలియన్ డాలర్లు, 2018–19లో 2.6 బిలియన్ డాలర్లు, 2022–23 వచ్చేసరికి 3.4 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. చైనాలో ఈ రసాయనాల తయారీ వ్యయాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీని కారణంగా ఏపీఐల ఉత్పత్తికై భారతీయ తయారీ సంస్థలు చైనా నుంచే వీటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ రసాయనాలు కాలుష్యకారకాలు. ఈ రసాయనాలను పీఎల్ఐ పరిధిలోకి చేర్చేందుకు ప్రస్తుత పథకాన్ని సవరించడాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించవచ్చని తెలుస్తోంది. జాప్యాలకు దారితీయవచ్చు.. ప్రస్తుతం ఉన్న ఫార్మా పీఎల్ఐ పథకం కింద పరిశ్రమకు కీలక స్టారి్టంగ్ మెటీరియల్స్, డ్రగ్ ఇంటర్మీడియట్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్‌ను స్థానికంగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఫార్మా సరఫరా వ్యవస్థ మొత్తాన్ని ప్రస్తుత పీఎల్ఐ పథకం కవర్ చేయడం లేదు. అయితే ఏపీఐల తయారీలో వాడే రసాయనాల ధరలను చైనా తగ్గించింది. పీఎల్ఐ పథకంలో భాగం కాని కంపెనీలు చైనా నుంచి ఈ రసాయనాలను తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్నాయి. కీలక ఔషధ ముడి పదార్ధాల కోసం ఒకే దేశంపై ఎక్కువగా ఆధారపడటం భారత ఫార్మా పరిశ్రమకు ప్రమాదం కలిగించే అవకాశమూ లేకపోలేదు. దీనికి కారణం ఏమంటే సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడినట్టయితే మందుల కొరత, తయారీ జాప్యాలకు దారితీయవచ్చు. -
ఏడాదిలోగా తొలి సెమీకాన్ ప్లాంటు
న్యూఢిల్లీ: దేశీయంగా ఎల్రక్టానిక్ చిప్ తయారీ తొలి ప్లాంటు ఏడాదిలోగా ఏర్పాటయ్యే వీలున్నట్లు కేంద్ర టెలికం, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశంలో వేఫర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటుసహా.. సెమీకండక్టర్ తయారీ ఎకోసిస్టమ్(వ్యవస్థ)ను నెలకొల్పే బాటలో తొలిగా ప్రభుత్వం 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలకు తెరతీసినట్లు తెలియజేశారు. అన్ని రకాల హైటెక్ ఎల్రక్టానిక్ ప్రొడక్టులలో వినియోగించే ఫిజికల్ చిప్స్ తయారీకి వేఫర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లను తొలి దశ బ్లాకులుగా వ్యవహరిస్తారు. అంతర్జాతీయంగా నాయకత్వ స్థాయిలో ఎదిగేందుకు కొన్ని ప్రత్యేక విభాగాలపై దృష్టి పెట్టినట్లు అశ్వినీ వెల్లడించారు. ప్రధానంగా సెమీకండక్టర్లకు టెలికం, ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) అతిపెద్ద విభాగాలుగా ఆవిర్భవించినట్లు వివరించారు. వెరసి ఈ విభాగాలలో వినియోగించే చిప్స్ అభివృద్ధి, తయారీలపై దృష్టి పెట్టడం ద్వారా టెలికం, ఈవీలకు గ్లోబల్ లీడర్లుగా ఎదిగే వీలున్నట్లు తెలియజేశారు. ఈ రెండు విభాగాలపై ప్రత్యేక దృష్టితో పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. రానున్న కొన్ని నెలల్లో చెప్పుకోదగ్గ విజయాలను అందుకోనున్నట్లు అంచనా వేశారు. వేఫర్ ఫ్యాబ్రికేషన్, డిజైన్, తయారీ ద్వారా పూర్తి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. దేశీయంగా చిప్ తయారీ యూఎస్ దిగ్గజం మైక్రాన్ పెట్టుబడుల విజయంతో ప్రపంచమంతటా దేశీ సామర్థ్యాలపై విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. మైక్రాన్ గత నెలలో గుజరాత్‌లోని సణంద్‌లో సెమీకండక్టర్ అసెంబ్లీ ప్లాంటు నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ ప్లాంటుతోపాటు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు జూన్‌లో మొత్తం 2.75 బిలియన్ డాలర్ల(రూ. 22,540 కోట్లు) పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. వీటిలో మైక్రాన్ 82.5 కోట్లు ఇన్వెస్ట్ చేయనుండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలిన పెట్టుబడులను సమకూర్చనున్నాయి. -
అడవులను సరిగ్గానే పెంచుతున్నామా?
దాదాపు 200 సంవత్సరాలకు పైగా భారతదేశం చెట్ల పెంపకంపై ప్రయోగాలు చేసింది. అడవులను పునరుద్ధరించే వివిధ విధానాలు... అవి స్థానిక సమాజాలపై, విస్తృత పర్యావరణంపై చూపే పరిణామాల గురించి మన దేశం ముఖ్యమైన పాఠాలను అందిస్తోంది. అందుకే గత తప్పిదాలు పునరావృతం కాకుండా అటవీశాఖాధికారులు చూసుకోవాలి. చెట్లను నాటడం అనగానే కచ్చితంగా అడవిని పునరుద్ధరించినట్టు అర్థం కాదు. చెట్ల కొరత ఉన్న పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం కూడా ముఖ్యం. పై నుండి అటవీ పందిరిని చూసి మురవడం కంటే కూడా దానివల్ల పర్యావరణం, స్థానిక ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలను నిర్ణయించడం విజయానికి మరింత సహాయ ప్రమాణంగా ఉంటుంది. అడవులను తమకు తాముగా పునరుత్పత్తి చేసుకునేలా చేయడం అనేది, వాతావరణంలో భూమిని వేడెక్కించే కార్బన్ ను తగ్గించడం కోసం చేసే ఒక వ్యూహంగా ఉంటోంది. అదే సమయంలో జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థలు అందించే ప్రయోజనాలతోపాటు జీవనోపాధికి చెందిన ఫలవంతమైనదాన్ని కూడా అవి పెంచుతూ వచ్చాయి. కానీ వాతావరణ మార్పును పరిమితం చేసే ఉద్దేశంతో చెట్ల విస్తృతిని పెంచే ప్రయత్నాలు చివరకు వేగంగా పెరిగే ఉద్యానవనాలను నిర్మించడం వైపు మొగ్గు చూపాయి. పొలాలు, బంజరు భూముల్లో తోటలను పెంచితే అవి కలపను, వంటచెరుకును అందించగలవు. ఇవి సహజ అడవులపై ఒత్తిడిని తగ్గించి, వాటి పునరుత్పత్తికి సహాయపడతాయి. కానీ సరైన రీతిలో జరగని చెట్ల పెంపకం తొలగించలేని జాతులను పెంచుతుంది. అవి ప్రజలను తమ భూమికి దూరమయ్యేట్టు చేస్తాయి. దాదాపు 200 సంవత్సరాలకు పైగా భారతదేశం చెట్ల పెంపకంపై ప్రయోగాలు చేసింది. అడవులను పునరుద్ధరించడంలో వివిధ విధా నాలు... అవి స్థానిక సమాజాలపై, విస్తృత పర్యావరణంపై చూపే పరిణామాల గురించి మన దేశం ముఖ్యమైన పాఠాలను అందిస్తోంది. గత తప్పిదాలు పునరావృతం కాకుండా నిరోధించడానికి, ఈ అరుదైన దీర్ఘకాలిక దృక్పథాన్ని నేడు అటవీశాఖాధికారులు గమనించాలి. దురాక్రమణ చెట్లు 18వ శతాబ్దం మధ్యకాలం నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మన దేశానికి చెందిన అనేక వ్యవహారాలను బ్రిటన్ నియంత్రించింది. 1857 నుండి 1947 మధ్య బ్రిటిష్ రాణి నేరుగా దేశాన్ని పాలించింది. భారతదేశం నుండి కొల్లగొట్టిన పత్తి, రబ్బరు, తేయాకును రవాణా చేయడం కోసం, బ్రిటన్ కు రైల్వే స్లీపర్లను వేయడానికి, ఓడ లను నిర్మించడానికి పెద్ద మొత్తంలో కలప అవసరమైంది. 1865 భారత అటవీ చట్టం ద్వారా, టేకు, సాల్, దేవదారు వంటి అధిక దిగుబడినిచ్చే కలప చెట్లతో కూడిన అడవులను ప్రభుత్వం ఆస్తిగా మార్చుకొంది. ఈ అడవుల్లో ఈ కలప దిగుబడిని అధికం చేసేందుకు బ్రిటిష్ వలసపాలనాధికారులు గడ్డి, వెదురు కంటే మించిన రకాలను వేయకుండా స్థానిక ప్రజల హక్కులపై పరిమితులను విధించారు. ఆఖరికి పశువుల మేతపై కూడా ఆంక్షలు విధించారు. దీంతో భార తీయ సమాజాలు కొన్నిసార్లు అడవులను తగలబెట్టడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాయి. ఈలోగా వేడి, తేమతో కూడిన భారతదేశ వాతావరణానికి బాగా అలవాటుపడిన, మన్నికైన, ఆకర్షణీయమైన కలపకు మూలమైన టేకు తోటలు (టెక్టోనా గ్రాండిస్) దూకుడుగా వ్యాపించాయి. దాంతో సహజమైన గడ్డి భూములు, పొదలతో కూడిన అడవులు ఏకరూప టేకు పంటలకు దారితీశాయి. భారతదేశంలో లేని యూకలిప్టస్, ఇతర అన్యదేశ చెట్లను సుమారు 1790 నుండి బ్రిటిష్‌వాళ్లు పరిచయం చేశారు. ఐరోపా, ఉత్తర అమెరికా నుండి తెచ్చిన దేవదారు చెట్లను హిమాలయ ప్రాంతంలో జిగురు కోసం; ఆస్ట్రేలియా నుండి తెచ్చిన అకేసియా చెట్లను కలప, మేత కోసం నాటారు. ఈ జాతులలో ఒకటైన, ‘వాటిల్’ (అకే సియా మియర్న్సి– ఒక తుమ్మ రకం)ని 1861లో కొన్ని లక్షల మొక్కలతో పశ్చిమ కనుమలలోని నీలగిరి జిల్లాలో ప్రవేశపెట్టారు. వాటిల్ అప్పటి నుండి ఆక్రమించే మొక్కగా మారి, ఈ ప్రాంతంలోని గడ్డి భూములను స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా, దేవదారు హిమాలయాలలో చాలావరకు వ్యాపించి, స్థానిక ఓక్(సిందూర) చెట్లను స్థానభ్రంశం చేసింది. మధ్య భారతదేశంలోని స్థానిక గట్టి చెక్క అయిన సాల్ స్థానంలోకి టేకు వచ్చింది. ఓక్, సాల్ రెండూ ఇంధనం, మేత, ఎరువులు, ఔషధం, నూనె కోసం విలువైనవి. వీటినీ, మేత భూమినీ కోల్పోవడం చాలా మందిని పేదలుగా మార్చింది. ఏవి పనికొస్తాయి? ‘బాన్ ఛాలెంజ్’ కింద 2030 నాటికి సుమారు 2.1 కోట్ల హెక్టార్ల అడవులను పునరుద్ధరిస్తామని భారతదేశం ప్రతిజ్ఞ చేసింది. భారత ప్రభుత్వం, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) 2018లో విడుదల చేసిన ప్రోగ్రెస్ రిపోర్టులో దాదాపు ఒక కోటి హెక్టార్ల మేరకు అడవులు పునరుద్ధరణలో ఉన్నాయని పేర్కొన్నారు. చెట్లతో కప్పబడిన భూమి విస్తీర్ణాన్ని పెంచడంపై పెడుతున్న ఈ దృష్టి, భారత జాతీయ అటవీ విధానంలో ప్రతిఫలిస్తోంది. ఇది దేశంలోని 33 శాతం విస్తీర్ణంలో చెట్లను పెంచడాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ విధానంలోని పథకాలలో యూకలిప్టస్ లేదా వెదురు వంటి ఒకే జాతితో కూడిన తోటలు ఉంటాయి. ఇవి వేగంగా పెరుగుతాయి, చెట్లు కప్పే స్థలాన్ని త్వరగా పెంచుతాయి. కొన్నిసార్లు ఈ చెట్లను గడ్డి భూములు, చెట్ల వ్యాప్తి సహజంగా తక్కువగా ఉన్న ప్రాంతాలలో నాటారు. ఫలితంగా మేతకోసం, ఇతర ఉత్పత్తుల కోసం ఈ పర్యావ రణ వ్యవస్థలపై ఆధారపడిన గ్రామీణ, స్థానిక ప్రజలకు హాని కలుగు తోంది. అన్యదేశ చెట్లను నిరంతరం నాటడం వల్ల 200 ఏళ్ల క్రితం వాటిల్ మాదిరిగానే కొత్త ఆక్రమణ జాతులు వచ్చే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి సానుకూల కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి. 2006 అటవీ హక్కుల చట్టం ఒకప్పుడు సాంప్రదాయ వినియోగంలో ఉన్న అటవీ ప్రాంతాలను నిర్వహించేందుకు గ్రామసభలకు అధికారం ఇచ్చింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో అనేక గ్రామసభలు క్షీణించిన అడవులను పునరుద్ధరించాయి. పైగా వాటిని బీడీలు చుట్టడానికి ఉపయోగించే తునికి ఆకులకు స్థిరమైన వనరుగా మార్చాయి. అలాగే గుజరాత్ కbŒ∙గడ్డి భూముల్లో, 19వ శతాబ్దం చివరలో బ్రిటిష్ అటవీ అధికారులు ప్రవేశపెట్టిన ‘పిచ్చి చెట్లను’ తొలగించడం ద్వారా అక్కడి సమాజాలు గడ్డి భూములను పునరుద్ధరించగలిగాయి. ప్రయోజనాలూ ముఖ్యమే! అటవీ పునరుద్ధరణ ప్రయత్నాల విజయాన్ని చెట్ల విస్తృతితో మాత్రమే కొలవలేము. ‘అడవి’ గురించిన భారత ప్రభుత్వ నిర్వచనం ఇప్పటికీ ఏకరూప చెట్టు జాతులు, çపళ్ల తోటలు, ఆఖరికి వెదురు (నిజానికి ఇది గడ్డి కుటుంబానికి చెందినది) లాంటిదానికి మాత్రమే పరిమితమై ఉంది. దీనర్థం ద్వైవార్షిక అటవీ సర్వేలు ఎంత సహజ అడవులను పునరుద్ధరించారో లెక్కించలేవు; స్థానిక చెట్లను పోటీ జాతులతో స్థానభ్రంశం చేయడం వల్ల కలిగిన పరిణామాలను తెలియజేయలేవు; అన్యదేశ చెట్లు మన సహజమైన గడ్డి భూములను ఎంత ఆక్రమించాయో గుర్తించలేవు. పైగా అవి పునరుద్ధరించిన అడ వులుగా తప్పుగా నమోదు అవుతాయి. సహజ అటవీ పునరుత్పత్తిని, అలాగే కలప, ఇంధనం కోసం చెట్ల పెంపకాన్ని రెండింటినీ ప్రోత్సహించాలి. అయితే ఇతర పర్యావరణ వ్యవస్థలు, ప్రజల మీద వీటి ప్రభావాన్ని తప్పక పరిశీలించాలి. నాటు తున్న రకాలు దురాక్రమించేవిగా మారకుండా జాగ్రత్తగా ఎంచు కోవడం దీంట్లో భాగం. అటవీ హక్కులు, స్థానిక జీవనోపాధి, జీవ వైవిధ్యం, కర్బన నిల్వలపై దాని ప్రభావాల పరంగా చెట్ల కవరేజిని పెంచడానికి సంబంధించిన లక్ష్యాన్ని అంచనా వేయాలి. చెట్లను నాటడం అనగానే కచ్చితంగా అడవిని పునరుద్ధరించి నట్టు అర్థం కాదు. చెట్ల కొరత ఉన్న పర్యావరణ వ్యవస్థలను పున రుద్ధరించడం కూడా ముఖ్యం. పై నుండి అటవీ పందిరిని చూసి మురవడం కంటే దానివల్ల పర్యావరణం, స్థానిక ప్రజలకు జరుగు తున్న ప్రయోజనాలను నిర్ణయించడం విజయానికి మరింత సహాయ ప్రమాణంగా ఉంటుంది. ధనపాల్ గోవిందరాజులు వ్యాసకర్త పరిశోధకుడు, మాంచెస్టర్ యూనివర్సిటీ (‘ది కాన్వర్జేషన్’ సౌజన్యంతో) -
ఆవిష్కరణలకు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: యువతరం ఆలోచనలను ప్రోత్సహిస్తూ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం నూతన పారిశ్రామిక విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. పారిశ్రామికవేత్తలుగా రాణించే నైపుణ్యం కలిగిన యువతను గుర్తించి చేయూతనిచ్చేలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్, సెలెక్ట్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ లాంటి వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు. ముఖ్యంగా ఐటీ, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా విశాఖ కేంద్రంగా ఐ–స్పేస్ పేరుతో మల్టీ డొమైన్ ఇన్నొవేషన్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు. ఒక ఆలోచనను పూర్తిస్థాయి వ్యాపార ఆవిష్కరణగా మార్చడానికి అవసరమైన ఆర్ అండ్ డీ, కటింగ్ ఎడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రోడక్ట్ వాలిడేషన్, ఉత్పత్తి పరిశీలన లాంటి వ్యవస్థలన్నీ ఒకచోట ఉండేలా దీన్ని అభివృద్ధి చేయనున్నారు. తొలిదశలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐ స్పేస్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఇంక్యుబేటర్స్, కో వర్కింగ్ స్పేస్, ఏంజెల్/వెంచర్ క్యాపిటలిస్ట్‌లను అందుబాటులో ఉంచడంతోపాటు చేయూతనిచ్చే విధంగా మెంటార్స్, టెక్నోప్రెన్యూర్స్ ఉంటారు. వీటితోపాటు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్, పేటెంట్ రిజిస్ట్రేషన్స్, లీగల్ సర్వీసెస్, ఫండ్ సోర్సింగ్, ప్యాకేజింగ్ లాంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. కార్పస్ ఫండ్ స్టార్టప్‌లకు అవసరమైన సీడ్ క్యాపిటల్ సాయం అందించేందుకు ప్రభుత్వం కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయనుంది. నూతన ఆవిష్కరణల కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ (ఆర్ అండ్ డీ) ఏర్పాటును ప్రోత్సహించనుంది. ఆర్అండ్డీ సెంటర్ల కోసం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు. ఆర్ అండ్ డీ ల్యాబ్, టెస్టింగ్ ల్యాబ్స్ వ్యయంలో 50 శాతం వరకు, గరిష్టంగా రూ.3 కోట్ల వరకు రీయింబర్స్ చేస్తారు. -
వేడి అలలు... జీవజాలానికి ఉరితాళ్లు! పరిస్థితి ఇలాగే కొనసాగితే..
నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం (గ్లోబల్ వార్మింగ్) వల్ల భూఉపరితం క్రమంగా వేడెక్కుతోంది. భూమిపై విలువైన జీవావరణ వ్యవస్థ దెబ్బతింటోంది. పర్యావరణ విధ్వంసం చోటుచేసుకుంటోంది. ఈ పరిణామం కేవలం భూమి ఉపరితలంపైనే కాదు, సముద్రాల అంతర్భాగాల్లోనూ సంభవిస్తున్నట్లు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న నేషనల్ ఓషియానిక్, అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల సముద్రాల అడుగు భాగం సైతం వేడెక్కుతోందని, అక్కడున్న జీవజాలం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటోందని తేలింది. ఫలితంగా సముద్ర జీవావరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతున్నట్లు పరిశోధకులు చెప్పారు. భూతాపంతో సముద్రాల్లో వేడి అలల తీవ్రత పెరుగుతోంది. ఇవన్నీ ప్రమాద ఘంటికలే’’ అని హెచ్చరించారు. ఏమిటీ భూతాపం? శిలాజ ఇంధనాల వినియోగం, కర్బన ఉద్గారాల వల్ల వాతావరణ మార్పులు, తద్వారా భూ ఉపరితలంపై ఉష్ణోగ్రతలు పెరగడమే భూతాపం. భూగోళంపై జనాభా వేగంగా పెరుగుతుండడంతో అదే స్థాయిలో శిలాజ ఇంధనాల వినియోగం సైతం పెరుగుతోంది. బొగ్గు, చమురు, గ్యాస్ వంటివి మండించడం వల్ల భూమి వేడెక్కుతుంది. దీంతోపాటు అడవుల నరికివేత, పారిశ్రామిక విప్లవం, అగ్నిపర్వతాల పేలుళ్లు, నీరు వేగంగా ఆవిరి కావడం, అడవుల్లో కార్చిచ్చు వంటివి కూడా భూతాపానికి కారణాలే. వాస్తవానికి సూర్య కాంతి వల్ల సంభవించే వేడి వాతావరణంలోకి తిరిగి వెనక్కి వెళ్తుంది. శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఉత్నన్నమయ్యే విష వాయువులు వేడి వెనక్కి వెళ్లకుండా అడ్డుకుంటాయి. దీంతో భూమిపై ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఈ ప్రభావం సముద్రాలపైనా పడుతుంది. అధ్యయనంలో ఏం తేలిందంటే... ► మెరైన్ హీట్‌వేవ్స్‌గా పిలిచే సముద్రాల అంతర్భాగాల్లోని వేడి అలల తీవ్రత, వ్యవధి అధికంగా ఉంది. సముద్రాల లోపలి ఉష్ణోగ్రతలు వేర్వేరు ప్రాంతాల్లో 0.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ దాకా పెరిగాయి. ► సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదలకు భూతాపం కారణమని సైంటిస్టులు నిర్ధారించారు. ► హీట్‌వేవ్స్ ప్రభావం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ► సముద్రాల ఉపరితలంలో హీట్వేవ్స్పై గత పదేళ్లుగా పరిశోధనలు కొనసాగిస్తున్నామని, అంతర్భాగంలోని వేడి అలలు, అక్కడి పరిణామాలు, జీవజాలం ప్రభావితం అవుతున్న తీరు గురించి తెలుసుకోవడం ఇదే మొదటిసారి అని ఎన్ఓఏఏ రీసెర్చ్ సైంటిస్టు దిల్లాన్ అమామా చెప్పారు. ► సముద్రాల్లో ఉండే ప్లాంక్టన్ అనే సూక్ష్మజీవుల నుంచి భారీ పరిమాణంలోని వేల్స్ దాకా అన్ని రకాల జీవులు హీట్‌వేవ్స్ వల్ల ప్రభావితమవుతున్నాయి. ► ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సముద్ర జీవుల వలసలు ఆగిపోతున్నాయి. వాటిలో పునరుత్పాదక శక్తి దెబ్బతింటోంది. వివిధ జీవుల మధ్య అనుసంధానం తెగిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం సముద్ర జీవావరణ వ్యవస్థ ప్రమాదంలో పడుతున్నట్లే లెక్క. ► భూతాపం వల్ల నీరు ఇలాగే వేడెక్కడం కొనసాగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి సముద్రాల్లోని పగడపు దీవులన్నీ అంతరించిపోతాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం వెల్లడించింది. ► సముద్రాల ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు పెరిగితే 70–90 శాతం, 2 డిగ్రీలు పెరిగితే పూర్తిగా పగడపు దీవులు మాయమవుతాయని యునెస్కో పేర్కొంది. సముద్రాలే రక్షణ ఛత్రం భూతాపం వల్ల ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రత లో 90% మిగులు వేడిని సముద్రాలే శోషించుకుంటాయి. భూమిని చల్లబరుస్తాయి. సముద్రాలే లేకుంటే భూమి అగ్నిగుండం అయ్యేది. సాగరాల ఉష్ణోగ్రత గత శతాబ్ద కాలంలో సగటున 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. మెరైన్ హీట్‌వేవ్స్ గత పదేళ్లలో 50% పెరిగాయి. భూతాపం పెరుగుదలను అడ్డుకోకపోతే సముద్రాలు సలసల కాగిపోవడం ఖాయం. ఫలితంగా భూమి అగ్నిగోళంగా మారుతుంది మానవులతో సహా జీవుల మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టెలికం తయారీకి డాట్ దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం రంగంలో తయారీ వ్యవస్థకు దన్నునిచ్చేందుకు టెలికం శాఖ(డాట్) సన్నాహాలు ప్రారంభించింది. ఈ అంశంలో ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై అవసరమైన సిఫారసులను సిద్ధం చేసేందుకు నాలుగు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. తద్వారా టెలికం తయారీ వ్యవస్థ(ఎకోసిస్టమ్)కున్న అవరోధాలను తొలగించి బలపడేందుకు ప్రోత్సాహాన్నివ్వనుంది. ఈ విషయాలను అధికారిక మెమొరాండం పేర్కొంది. ఈ నెల మొదట్లో టెలికం గేర్ల తయారీ కంపెనీలకు చెందిన 42 మంది చీఫ్‌లతో కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఇందుకు బీజం వేసింది. ఈ సమావేశంలో కంపెనీ చీఫ్‌లు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు అవసరమున్నట్లు మంత్రి భావించారు. గేర్ తయారీకి బూస్ట్ టాస్క్‌ఫోర్సుల్లో ఒకదాని ద్వారా టెలికం గేర్ తయారీకి దశలవారీ ప్రోత్సాహక కార్యక్రమాన్ని డాట్ సిఫారసు చేస్తోంది. తద్వారా దేశీ సరఫరా చైన్ ఎకోసిస్టమ్‌కు బూస్ట్‌నివ్వాలని యోచిస్తోంది. దీంతో ప్రపంచ సంస్థలను ఆకట్టుకునే ప్రణాళికల్లో ఉంది. తాజా మెమొరాండం ప్రకారం ఈ టాస్క్‌ఫోర్స్‌కు ప్రభుత్వ రంగ రీసెర్చ్ సంస్థ సీడాట్ సీఈవో ఆర్కే ఉపాధ్యాయ్‌ను సహచైర్మన్‌గా ఏర్పాటు చేయనుంది. 2016లో దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు దశలవారీ కార్యక్రమాన్ని నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. తేజాస్ నెట్వర్క్స్ సీఈవో సంజయ్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటుకానున్న టాస్క్‌ఫోర్స్ ప్రస్తుత ఎకోసిస్టమ్‌ను అధ్యయనం చేస్తుంది. తదుపరి టెలి కం టెక్నాలజీ అభివృద్ధి నిధి, సెమికాన్ పాలసీ అండ్ పాలసీ ఇంటర్వెన్షన్ వంటి పథకాల ద్వారా 4–5 చిప్ డెవలప్‌మెంట్స్‌కు అవకాశాలను సూచిస్తుంది. తద్వా రా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించనుంది. కస్టమ్ క్లియరెన్స్‌లపై దృష్టి మూడో టాస్క్‌ఫోర్స్ కస్టమ్ క్లియరెన్స్, ఎయిర్ కార్గో రవాణా, మౌలికసదుపాయాల అందుబాటుపై పరిశీలన చేపడుతుంది. తద్వారా లీడ్ సమయాన్ని మెరుగుపరచడం, ఉత్పత్తి, అమ్మకాలలో ఇన్వెంటరీని తగ్గించడం, కీలక విమానాశ్రయాలలో ఫ్రీ ట్రేడ్ వేర్‌హౌసింగ్ జోన్ల ఏర్పాటు తదితరాల ద్వారా లాజిస్టిక్స్ సవాళ్లకు చెక్ పెడుతుంది. టెలికం గేర్ తయారీదారుల సమాఖ్య వీవోఐసీఈ(వాయిస్) డైరెక్టర్ జనరల్ ఆర్కే భట్నాగర్ అధ్యక్షతన మరో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ టాస్క్‌ఫోర్స్ డిజిటల్ ఇండియా, డేటా సెంటర్లు, రైల్వే ఆధునీకరణ తదితరాలకు అవసరమైన 5జీ ప్రొడక్టుల అభివృద్ధి, తయారీకి దేశీయంగా కొత్త అవకాశాలను గుర్తించనుంది. ఈ టాస్క్‌ఫోర్స్‌లన్నీ 45 రోజుల్లోగా నివేదికలను దాఖలు చేయవలసి ఉంటుందని అధికారిక మెమొరాండం పేర్కొంది. -
India digital ecosystem: ఎయిర్టెల్- మెటా పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత టెలికం మౌలికరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సామాజిక మాధ్యమ రంగ దిగ్గజం మెటా, టెలికం కంపెనీ భారతి ఎయిర్టెల్ సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. వేగవంతమైన డేటా, డిజిటల్ సేవలకు భారత్‌లో డిమాండ్ నేపథ్యంలో ఈ విభాగాల్లో సేవలు అందించేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్టు ఇరు సంస్థలు సోమవారం ప్రకటించాయి. (మారుతి బాటలో, టాటా మెటార్స్: కస్టమర్లకు కష్టకాలం!) అలాగే ప్రపంచంలో అతిపొడవైన సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ అయిన 2ఆఫ్రికా పెరŠల్స్ ప్రాజెక్టును భారత్‌కు పొడిగించేందుకు మెటా, సౌదీ టెలికం కంపెనీతో ఎయిర్టెల్ చేతులు కలుపుతుంది. 2ఆఫ్రికా పెరŠల్స్ ప్రాజెక్టును భారతదేశానికి విస్తరించే ప్రణాళికను సెప్టెంబర్ 2021లో మెటా ప్రకటించింది. ముంబైలోని ఎయిర్టెల్ ల్యాండింగ్ స్టేషన్‌కు కేబుల్‌ను విస్తరిస్తారు. నెట్‌వర్క్‌లను నిర్మించడానికి సర్వీస్ ప్రొవైడర్లతో ఆదాయాన్ని పంచుకోవాలన్న టెలికం ఆపరేటర్ల డిమాండ్ నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడడం గమనార్హం. -
దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరగాలంటే...
న్యూఢిల్లీ: దేశీయంగా సుస్థిరమైన విద్యుత్ వాహనాల వ్యవస్థను తీర్చిదిద్దాలంటే స్థానిక సరఫరా వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల సమాఖ్య ఎస్ఎంఈవీ పేర్కొంది. పర్యావరణహిత వాహనాల అవసరంపై ప్రజలు తమ కుటుంబాలు, మిత్రుల్లో అవగాహన పెంచాలని సూచించింది. వరల్డ్ ఈవీ డే సందర్భంగా ఎస్ఎంఈవీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 2024 నాటికి 18,000 చార్జింగ్ స్టేషన్లను కొత్తగా నెలకొల్పాలన్న ఢిల్లీ ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికను ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టెరి), ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ క్లీన్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రశంసించాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఇతర రాష్ట్రాలు కూడా ఈ తరహా వ్యూహాలు అమలు చేయాలని కోరాయి. ఈవీల వినియోగం పెద్ద యెత్తున పెరగాలంటే చార్జింగ్ మౌలిక సదుపాయాలు సులభంగా అందుబాటులో ఉండేలా అభివృద్ధి చేయాల్సి ఉంటుందని టాటా పవర్ హెడ్ (బిజినెస్ డెవలప్మెంట్ – ఈవీ) వీరేందర్ గోయల్ చెప్పారు. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింతగా పెరుగుతుందని మహీంద్రా అండ్ మహీంద్రా ఈడీ (ఆటో, వ్యవసాయ రంగాలు) రాజేష్ జెజూరికర్ పేర్కొన్నారు. ఎంఅండ్ఎం వచ్చే ఏడాది జనవరిలో తమ తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్ ఎక్స్‌యూవీ400ను వచ్చే ఏడాది జనవరిలో ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉంది. -
భవిష్యత్‌కు సిద్ధంగా వాణిజ్య శాఖ
న్యూఢిల్లీ: వాణిజ్య శాఖ భవిష్యత్తుకు సన్నద్ధమవుతోందని, 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించేందుకు కావాల్సిన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాణిజ్య శాఖ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా వాణిజ్య ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వద్ద సమర్థవంతమైన సంప్రదింపులు, చర్చలకు వీలుగా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం ఇందులో భాగంగా ఉంటుందన్నారు. సులభతర వాణిజ్య ప్రక్రియకు వీలుగా డిజిటైజేషన్, డేటా అనలైటిక్స్ ఎకోసిస్టమ్‌ను మెరుగుపరచనున్నట్టు మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ వాటా పెంచడం, దేశీయంగా ఉపాధి కల్పించడమే ఉద్దేశ్యమని చెప్పారు. వాణిజ్య శాఖ పునర్నిర్మాణంలో భాగంగా సిబ్బందిని తగ్గించబోమని మంత్రి భరోసా ఇచ్చారు. ఇతర దేశాలతో బహుమఖ, ద్వైపాక్షిక ఒప్పందాల దిశగా తమ శాఖ సంప్రదింపులు చేస్తోందన్నారు. అంతర్జాతీయ వేదికల వద్ద భారత్ తరఫున సమర్థంగా వాదనలు వినిపించేందుకు ప్రైవేటు రంగం నుంచి నిపుణులను నియమించుకుంటామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా పనితీరు ఉందన్నారు. -
స్టార్టప్‌లకు గుజరాత్ బెస్ట్!
న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అనువుగా స్టార్టప్ వ్యవస్థను అభివృద్ధి చేసే అంశంలో గుజరాత్, కర్ణాటక మరోసారి అత్యుత్తమంగా నిల్చాయి. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) రూపొందించిన ఉత్తమ పెర్ఫార్మర్ జాబితాలో గుజరాత్ వరుసగా మూడోసారి అగ్రస్థానం దక్కించుకుంది. ఈ కేటగిరీలో కర్ణాటకకు కూడా చోటు లభించింది. రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్ 2021 జాబితాను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సోమవారం విడుదల చేశారు. స్టార్టప్‌లపరంగా ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న భారత్ .. అగ్రస్థానానికి చేరాలన్న లక్ష్య సాధన దిశగా అంతా కృషి చేయాలని ఆయన సూచించారు. జిల్లాల స్థాయిలో కూడా పోటీపడాలని పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు (యూటీ) తమ తమ స్టార్టప్ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడంలో తోడ్పాటు అందించేందుకు ఈ ర్యాంకింగ్ విధానాన్ని ఉద్దేశించారు. అయిదు కేటగిరీలు.. సంస్థాగత మద్దతు, నవకల్పనలకు ప్రోత్సాహం, నిధులపరమైన తోడ్పాటు తదితర ఏడు అంశాల్లో సంస్కరణలకు సంబంధించి 26 యాక్షన్ పాయింట్లను పరిగణనలోకి తీసుకుని డీపీఐఐటీ ఈ ర్యాంకులను మదింపు చేసింది. 24 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు (యూటీ) ఈ ప్రక్రియలో పాల్గొన్నాయి. ఉత్తమ (బెస్ట్) పెర్ఫార్మర్లు, టాప్ పెర్ఫార్మర్లు, లీడర్లు, వర్ధమాన లీడర్లు, వర్ధమాన స్టార్టప్ వ్యవస్థలు అంటూ అయిదు కేటగిరీల్లో ఆయా రాష్ట్రాలు, యూటీలను వర్గీకరించారు. దీని ప్రకారం ఉత్తమ వర్ధమాన స్టార్టప్ వ్యవస్థల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్, బీహార్, మిజోరం, లడఖ్ ర్యాంకులు దక్కించుకున్నాయి. అలాగే టాప్ పెర్ఫార్మర్లలో తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, జమ్మూ కాశ్మీర్లకు ర్యాంకులు దక్కాయి. కోటి కన్నా తక్కువ జనాభా ఉన్న చిన్న రాష్ట్రాల్లో మేఘాలయా బెస్ట్ పెర్ఫార్మర్గా నిల్చింది. -
ప్రపంచ స్టార్టప్ రంగంలో... 2030 నాటికి భారత్‌కు మూడో స్థానం
న్యూఢిల్లీ: 2030 నాటికి ప్రపంచ స్టార్టప్స్ ఏకోసిస్టమ్‌లో ఇండియా మూడో స్థానానికి చేరుతుందని, అందుకు అవసరమైన నాలెడ్జ్ బేస్‌ను పెంచడంతో పాటు సరైన పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టిపెట్టామని డిజిటల్ స్టార్టప్ థింక్ ట్యాంక్ అలయన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్ (ఏడీఐఎఫ్) తెలిపింది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్లతో స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్చలు జరపుతున్నామని.. ఇరు వర్గాలను సమన్వయ పరిచే విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఏడీఐఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిజో కురువిలా జార్జ్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ స్టార్టప్ ఏకోసిస్టమ్ ఇండియా 20వ ర్యాంకింగ్‌లో ఉందని... 50 యూనికార్న్ స్టార్టప్స్‌తో అమెరికా (122), చైనా (92) మూడో స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. నాలెడ్జ్ షేరింగ్ కోసం త్వరలోనే స్టార్టప్ ఫౌండర్లతో అలయన్స్‌తో ఏర్పాటు చేస్తామని చెప్పారు. యాపిల్ విధానాల మాదిరిగానే స్టార్టప్స్ తమ ఆదాయంలో 30 శాతం వరకు వసూలు చేయాలని గూగుల్ ప్లేస్టోర్ ప్రతిపాదించింది. అయితే దేశంలో చాలా వరకు స్టార్టప్‌లకు అధిక మార్జిన్లు లేవని, ఈ విషయంపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని వివరించారు. అమెరికాలో ఆరిజోనా రాష్ట్రం యాప్ స్టోర్ ఫీజులపై మార్గదర్శకాలను తీసుకొచ్చిందని.. ఇది ప్రారంభ సంకేతమని ఆయన పేర్కొన్నారు. -
ఈవీ జర్నీ.. రయ్!
దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) డిమాండ్‌ను సొమ్ము చేసుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే పర్యావరణ అనుకూల ప్రయోజనాలకు తోడు, చమురు దిగుమతుల బిల్లును తగ్గించుకోవడం లక్ష్యాలుగా.. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహక విధానాలతో ముందుకు వస్తుండడాన్ని చూస్తూనే ఉన్నాము. దీంతో సంప్రదాయ ఆటోమొబైల్ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ మోడళ్లతో కస్టమర్ల ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అనుకూల వ్యవస్థల (ఎకోసిస్టమ్) అభివృద్ధికి గతేడాది కరోనా మహమ్మారి తాత్కాలికంగా బ్రేకులు వేసింది. అయినప్పటికీ లాక్డౌన్, ఆంక్షలను క్రమంగా సడలిస్తూ రావడంతో తిరిగి ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) డిమాండ్ కొన్ని నెలల నుంచి మెరుగుపడుతోంది. కాకపోతే మన దేశంలో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ఇంకా ఆరంభ దశలోనే ఉంది. ప్రధానంగా పట్టణాలు, కొన్ని వాహన విభాగాల్లోనే విక్రయాలు నమోదవుతున్నాయి. అయినా సరే భవిష్యత్తుపై అంచనాలతో ద్విచక్ర ఈవీ మార్కెట్లోకి కొత్త సంస్థలు ఉత్సాహంగా ప్రవేశిస్తుంటే.. కార్ల విభాగంలో టాటా మోటార్స్ దూసుకుపోయే వ్యూహాలను అమలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్రాల సబ్సిడీ, రాయితీ పథకాలు ఇందుకు కొంత మేర సాయపడుతున్నాయని చెప్పుకోవాలి. రంగంలోకి కొత్త సంస్థలు దేశీయ ఈవీ మార్కెట్లో దూకుడుగా వెళ్లే వ్యూహాలతో కొత్త సంస్థలు అడుగుపెడుతుంటే.. మరోవైపు ఆటోమొబైల్ రంగంలో స్థిరపడిన ప్రముఖ కంపెనీలు కూడా పోటీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కార్లు, ద్విచక్ర, త్రిచక్ర ఈవీ విభాగంలో అవకాశాలను సొంతం చేసుకుని, వృద్ధి చెందేందుకు వేటికవే భిన్నమైన వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మహీంద్రా లీడర్‌గా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆచితూచి అన్నట్టుగా అడుగులు వేస్తోంది. రెవా ఎలక్ట్రిక్ కార్ కంపెనీని మహీంద్రా సొంతం చేసుకుని ఈ విభాగంలో ముందు నుంచి ఉన్న సంస్థగా పేరు సొంతం చేసుకున్నప్పటికీ.. త్రిచక్ర వాహనాలపైనే ప్రస్తుతం ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే, ‘బోర్న్ ఈవీ’ విధానంతో రానున్న 4–5 ఏళ్ల కాలంలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మరింతగా చొచ్చుకుపోయే వ్యూహంతో మహీంద్రా ఉంది. ఆకర్షణీయంగా లేని ఫేమ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో పదుల సంఖ్యలో కంపెనీలు వందకు పైగా మోడళ్లను ఆఫర్ చేస్తుండగా.. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఉన్న మోడళ్లను వేళ్లమీద లెక్క పెట్టొచ్చు. దీనికి కారణం ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఈవీ) పథకం ఎలక్ట్రిక్ కార్లకు ఆకర్షణీయంగా లేకపోవడమేనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. గడిచిన మూడేళ్ల కాలంలో కేవలం 35,000 వాణిజ్య కార్లకే రాయితీలు రావడం పరిస్థితిని తెలియజేస్తోంది. డిమాండ్ తగినంత లేని పరిస్థితుల్లో పెట్టుబడులతో ప్రయోజనం ఉండదని కార్ల తయారీ సంస్థలు భావిస్తున్నాయి. అతి తక్కువ విక్రయాల కారణంగా భారతీయ కార్ల తయారీ సంస్థలు ఈవీలకు అవసరమైన కీలక విడిభాగాలను.. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ నుంచి పొందడం కష్టమవుతుందని ఐహెచ్ఎస్ మార్కిట్‌కు చెందిన దక్షిణాసియా ప్రధాన అనలిస్ట్ సూరజ్ ఘోష్ అన్నారు. మెట్రోలకే పరిమితమైన ఈవీ టూవీలర్లు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు ప్రధానంగా మెట్రోలు, పట్టణాలకే పరిమితమయ్యాయి. ఎన్నో సంస్థలు డీలర్ల ద్వారా తమ ఉత్పత్తులను పట్టణాల్లో విక్రయిస్తున్నాయి. మరోవైపు సంప్రదాయ కంపెనీలైన టీవీఎస్, బజాజ్‌లు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఒక్కొక్క మోడల్‌నే మార్కెట్లోకి తీసుకొచ్చాయి. బెంగళూరులో ఏడాది క్రితం టీవీఎస్ ఐక్యూబ్ పేరుతో ఈవీ స్కూటర్‌ను ప్రవేశపెట్టగా.. ఇటీవలే ఢిల్లీ మార్కెట్లోకి ఈ ఉత్పత్తిని విడుదల చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని మార్కెట్లోకి దీన్ని విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. అంటే ప్రస్తుతానికి ఐ క్యూబ్ బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లకే పరిమితం. బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ కూడా ఇంతే. గ్రీవ్స్కాటన్కు చెందిన యాంపియర్ ఎలక్ట్రిక్ మాత్రం ద్విచక్ర, త్రిచక్ర ఈవీ విభాగంలో చాలా మోడళ్లను తీసుకొస్తోంది. నెట్‌వర్క్‌నూ విస్తరిస్తోంది. తన ఈవీ వ్యాపార బాధ్యతలను చూసేందుకు యమహా ఇండియా మాజీ మార్కెటింగ్ హెడ్ రాయ్ కురియన్ను నియమించుకుంది. ఈ సంస్థకు 230 ప్రాంతాల్లో 300 డీలర్‌షిప్‌లు ఉన్నాయి. టాటా మోటార్స్ దూకుడు టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో వేగంగా అడుగులు వేస్తోంది. భిన్నమైన విధానంతో ఈవీ కార్ల మార్కెట్లో ప్రముఖ స్థానాన్ని ఇప్పటికే సొంతం చేసుకుంది. ప్రస్తుతానికి రెండు ఎలక్ట్రిక్ కార్లు టాటా మోటార్స్ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో ఉండగా, మరిన్ని కార్లను ప్రవేశపెట్టే ప్రణాళికతో సంస్థ ఉంది. దేశవ్యాప్తంగా ప్రముఖ రహదారుల్లో ఇప్పటికే 300కు పైగా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ప్రముఖ పట్టణాలు, జాతీయ రహదారులపై 2021 మార్చి నాటికి చార్జింగ్ స్టేషన్ల సంఖ్యను 700కు చేర్చాలన్న లక్ష్యంతో ఉంది. ‘‘భారత్ వైవిధ్యమైన మార్కెట్. ఈవీ విలువ ఆధారిత చైన్‌లో ఉత్పత్తులు, సేవల పరంగా అపారమైన వృద్ధి అవకాశాలున్నాయి. ఓఈఎమ్ (ఎక్విప్మెంట్ తయారీ సంస్థలు) కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తుల తయారీ, సదుపాయాలపై పెట్టుబడులను ప్రారంభించాయి. సరైన విధానం, ప్రామాణిక టెక్నాలజీ, నియంత్రణ చర్యలు అన్నవి దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని గణనీయంగా పెంచేందుకు తోడ్పడతాయి’’ అని ఈవై ఇండియా ఆటోమోటివ్ రంగ పార్ట్నర్ వినయ్ రఘునాథ్ తెలిపారు. -
ఇన్ఫర్మేషన్ ఈకో సిస్టంలో తెలంగాణకు అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: జాతీయ అంతర్జాతీయ స్టార్టప్, ఇన్ఫర్మేషన్ ఈకో సిస్టంలో తెలంగాణకు అగ్రస్థానం లభించిందని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. టెక్నాలజీ రంగంలో 2020 తెలంగాణకు అత్యంత ప్రాధాన్యం కలిగిన సంవత్సరమని ఆయన పేర్కొన్నారు. ఇన్నోవేషన్ ద్వారా అనేక సవాళ్లకు సమాధానాలు లభిస్తాయని, తెలంగాణ స్టార్టప్ కంపెనీలు ఈ దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీ హబ్ నాలుగో వార్షికోత్సవ సంబరాల్లో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీ హబ్ ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని సాధించి పెట్టిందన్నారు. కేవలం రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుందని, గత నాలుగు సంవత్సరాల్లో సాధించిన ప్రగతి సంతృప్తికరంగా ఉందన్నారు. రానున్న సంవత్సరాల్లో మరిన్ని మైలురాళ్లను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ స్థాయి భాగస్వాములతో ఇన్నోవేషన్, స్టార్టప్ రంగంలో ముందుకు పోతున్నదన్నారు. ఇన్నోవేషన్ రంగంలో ముందు వరుసలో నిలవాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నోవేషన్ రంగంలో ప్రగతి ద్వారా కేవలం కార్పొరేట్ సెక్టార్లోనే కాకుండా, పారిశ్రామిక రంగంలోనూ అనేక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ఈ దిశగా తెలంగాణలోని యువత, స్టార్టప్ కంపెనీలు పనిచేయాలని ఆయన కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలోనూ ముందు వరుసలో నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. 2020 సంవత్సరంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్ 2, దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ టీ–వర్క్స్‌ని ప్రారంభించనున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. పలు టెక్నాలజీ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, ఐటీ, ఐటీ అనుబంధ పరిశ్రమల ప్రతినిధులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. -
అర్బన్ ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్‌కు ప్రాధాన్యత: ఎస్కే జోషి
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న పట్టణీకరణ ప్రభావంతోపాటు వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో అర్బన్ ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్‌కు ప్రాధాన్యత ఏర్పడిందని మాజీ సీఎస్ ఎస్కే జోషి అన్నారు. మంగళవారం తన పదవీ విరమణకు ముందు అర్బన్ పార్కులపై అటవీ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్కే జోషి మాట్లాడుతూ.. పట్టణాల్లో జనసాంద్రత పెరుగుతున్నందున, మరింత పచ్చదనాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అర్బన్ ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్ అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడం కీలకమన్నారు. రాష్ట్రంలోని మొత్తం 129 రిజర్వ్ ఫారెస్ట్ క్లస్టర్లలో 70 క్లస్టర్లను కన్జర్వేషన్ బ్లాక్‌లుగా ఉంచుతామని.. నగరాలు పెరిగే కొద్దీ వాటిని అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. 193 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లలో 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేస్తున్నామని, రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లున్న మున్సిపల్ పట్టణాల్లో అర్బన్ పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, పీసీసీఎఫ్ ఆర్.శోభ, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్ తదితరులు పాల్గొన్నారు. -
సవాళ్లున్నాయి... అధిగమిద్దాం!
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల ముందు రాజకీయ అనిశ్చితి సహా, 2019లో ఎన్నో స్థూల ఆర్థిక సవాళ్లు ఎదురు కానున్నాయని టాటా సన్స్ (టాటా గ్రూపు మాతృ కంపెనీ) చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ చెప్పారు. సమస్యలను అధిగమించడంపై దృష్టి సారించాలని టాటా గ్రూపు ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా గ్రూపు పరిధిలోని ఏడు లక్షల మంది ఉద్యోగులకు ఆయన లేఖ ద్వారా సందేశమిచ్చారు. డిజిటల్‌పై లోతైన పరిజ్ఞానం, సమష్టితత్వం, నిర్వహణపరమైన కార్యాచరణ, అంతర్జాతీయ మార్పులను సమర్థంగా పరిష్కరించే క్రియాశీలతలపై దృష్టి సారించాలని మార్గదర్శనం చేశారు. 2018లో టాటా గ్రూపు మిశ్రమ పనితీరు కనబరిచినట్టు చెప్పారు. ఇక ముందు చేయాల్సింది ఎంతో ఉందంటూ... 100 బిలియన్ డాలర్లకు పైగా విలువైన గ్రూపు నిర్మాణాన్ని మరింత సరళీకరించడాన్ని ఒకానొక కార్యక్రమంగా ప్రస్తావించారు. ‘‘2019 ఎన్నో స్థూల ఆర్థిక సవాళ్లను తీసుకురానుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక చక్రం పరిపక్వతకు చేరింది. అభివృద్ధి చెందిన దేశాల కదలికలపైనే ప్రపంచ ఆర్థిక వృద్ధి ఆధారపడటం పెరుగుతోంది. ద్రవ్య పరమైన కఠినతర పరిస్థితులు 2019లోనూ అంతర్జాతీయంగా కొనసాగుతాయి’’అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ‘‘మన పరుగు ను కొనసాగించడమే మన ఉద్యోగం. మరొకరి పరుగుపైకి మనసు మళ్లకూడదు’’ అని సూచించారు. కీలక ముందడుగు..: ‘టాటా కంపెనీల పునర్వ్యవస్థీకరణ, రుణాల తగ్గింపు, గ్రూపు పరిధిలో ఒక కంపెనీలో మరో కంపెనీ వాటాలను స్థిరీకరించడం, కీలకమైన ఆస్తుల కొనుగోలు, భవిష్యత్తు వృద్ధికి గాను రూ.70,000 కోట్లను వెచ్చించేందుకు కట్టుబడి ఉన్నాం. అదే సమయంలో మా ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్ 2018లో రూ.10 లక్షల కోట్లు దాటింది’’అని చంద్రశేఖరన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 7,02,000 మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే ఒకానొక అతిపెద్ద ఉద్యోగ కల్పన సంస్థగా టాటా గ్రూపు ఉన్నట్టు చెప్పారు. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల విషయంలో ఉపేక్షించేది లేదన్నారు. భద్రత, గౌరవనీయంగా పనిచేసే వాతావరణం అన్నది మొదటి నుంచి తమకు అత్యంత ప్రాధాన్యమైనవిగా పేర్కొన్నారు. టాటా గ్రూపు పరిధిలో మొత్తం ఉద్యోగుల్లో 1,86,000 మంది మహిళలు పనిచేస్తుండడం గమనార్హం. ఎలక్ట్రిక్ వాహనాలకు ఎకోసిస్టమ్... దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల ఎకోసిస్టమ్ ఏర్పాటుకు టాటా మోటార్స్... గ్రూపులోని టాటా పవర్, టాటా క్యాపిటల్‌తో కలసి పనిచేస్తుందని చంద్రశేఖరన్ చెప్పారు. ‘‘టాటా క్యాపిటల్ నుంచి ఆర్థిక సాయం, టాటా పవర్ నుంచి చార్జింగ్ వసతుల నెట్వర్క్ విషయమై టాటా మోటార్స్ కృషి చేస్తోంది’’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. -
సాగుకు స్కానింగ్!
⇔ భారీ డిజిటల్ పరిశోధనా ప్రాజెక్టుకు ఇక్రిశాట్ రూపకల్పన ⇔ వ్యవసాయశాఖకు ప్రతిపాదన... రిమోట్ సెన్సింగ్‌తో డేటా సేకరణ ⇔ ప్రతిపాదన ఆమోదం పొందితే వచ్చే నెల నుంచి ప్రాజెక్టు ప్రారంభం ⇔ తెలంగాణలో పంటల వర్గీకరణ, కనీసం మీటరు పరిధి నేలపైనా విశ్లేషణ సాక్షి, హైదరాబాద్: వ్యవసాయరంగ ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యవసాయ భూమి, పంటలు, నేలలు తదితర అంశాలపై కచ్చితమైన శాస్త్రీయ సమాచారం అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయ రంగం లోపభూయిష్టంగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. సాగు విస్తీర్ణం, ఏ నేలల్లో ఎటువంటి పంటలు సాగు చేస్తున్నారనే అంశాలపై ఎప్పుడో నిర్ధారించిన సమాచారం అరకొరగా ఉంది. దీనివల్ల వ్యవసాయరంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు లోపాలతో కూడుకొని ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవసాయరంగాన్ని పునర్వ్యవస్థీకరించి గాడిలో పెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై డాక్యుమెంటు తయారు చేసి ఇస్తామని ఇక్రిశాట్ ముందుకు వచ్చింది. డిజిటల్ వ్యవసాయ పరిశోధన ప్రాజెక్టు రూపకల్పనకు రూ.169.60 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ మేరకు వ్యవసాయశాఖకు ప్రాజెక్టు ప్రతిపాదన నివేదికను బుధవారం అందజేసింది. ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే వచ్చే నెల నుంచే ప్రాజెక్టు ప్రారంభిస్తామని ఇక్రిశాట్ తెలిపిందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. డిజిటల్ ప్రాజెక్టుతో ప్రయోజనాలివి ఈ ప్రాజెక్టు పూర్తి చేశాక కచ్చితమైన మ్యాపింగ్ చేసి అందజేస్తారు. గతంలో ఆస్ట్రేలియాలో ఇలాగే ప్రాజెక్టు నిర్వహించి ఒక మీటరు, 4 మీటర్లు, 24 మీటర్లు ఇలా భూమి పరిధిని పరిగణనలోకి తీసుకొని సూక్ష్మ విశ్లేషణ చేశారు. దీనివల్ల శాస్త్రీయ డేటా సేకరిస్తారు. అంటే ఒక మీటరు వ్యవసాయ విస్తీర్ణాన్ని కూడా విశ్లేషిస్తారన్నమాట దీనివల్ల పంట దిగుబడి, ఉత్పాదకతను అంచనా వేయవచ్చు కరువు, తుఫాన్లు, చీడపీడల వల్ల పంట నష్టం వాటిల్లితే సరైన అంచనా వేయవచ్చు పంట పండించాక జరిగే నష్టాన్ని రైతువారీగా వ్యక్తిగతంగా అంచనా వేయవచ్చు ∙భూముల వర్గీకరణ శాస్త్రీయంగా అంచనా వేయడానికి వీలు కలుగుతుంది ∙పంటల సాగు కాలాన్ని, పంట పండే కాలాన్ని శాస్త్రీయంగా అంచనా వేయవచ్చు భూగర్భ, ఉపరితల జలవనరులను అంచనా వేయవచ్చు. దానివల్ల వ్యవసాయానికి అవసరమైన ప్రణాళిక రచించవచ్చు ‘స్మార్ట్ ఫామింగ్’కు ఏర్పాట్లు చేసుకోవచ్చు. దానివల్ల ఇన్‌ఫుట్స్, సబ్సిడీలు, కూలీలు, వ్యవసాయానికి అందజేయాల్సిన ఆర్థిక సాయాన్ని సక్రమంగా అంచనా వేయడానికి వీలుకలుగుతుంది మూడేళ్లపాటు నిర్వహణ అగ్రి మానిటర్డ్ రీ ఇంజనీరింగ్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్(అమార్ట్) పేరుతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2020 జూలై నాటికి పూర్తి చేయాలని ఇక్రిశాట్ సంకల్పించింది. దీనికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ వ్యవసాయశాఖ సహా పలు రైతు సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం తీసుకోనుంది. రాష్ట్రంలో 85 శాతం మంది సన్న,చిన్న రైతులే ఉండటంతో వారికి తగినట్లుగా పంటల విధానం ఉండలన్నది ఇక్రిశాట్ ఆలోచన. అందుకోసం రిమోట్ సెన్సింగ్ డేటాను సేకరించడం అత్యంత కీలకమైన అంశమని ఇక్రిశాట్ స్పష్టం చేసింది. మల్టీస్పెక్ట్రల్ డేటా సేకరిస్తామని వెల్లడించింది. -
ఆకలిపై పోరులో కలసి రండి
శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపు - జీవవైవిధ్య చట్టాలతో సాగుకు నష్టం లేదు - అంతర్జాతీయ వ్యవసాయ జీవవైవిధ్య కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: వ్యవసాయ జీవ వైవిధ్య పరిరక్షణకు ఉద్దేశించిన చట్టాలతో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయ అభివృద్ధి దెబ్బ తినే అవకాశాలు లేవని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. వ్యవసాయంలో టెక్నాలజీ వాడకాన్ని పెంచడం ద్వారా స్థిరమైన అభివృద్ధి సాధించవచ్చన్నారు. ఆదివారం ఢిల్లీలో ప్రారంభమైన తొలి అంతర్జాతీయ వ్యవసాయ జీవ వైవిధ్య సదస్సులో మోదీ ప్రసంగించారు. ‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆకలి, పోషకాహారలోపం, పేదరికంతో అలమటిస్తున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం లభించాలంటే సైన్స్, టెక్నాలజీ కీలకం. పరిష్కారం చూపే క్రమంలో మనం స్థిరమైన అభివృద్ధిని, జీవవైవిధ్య పరిరక్షణను మరిచిపోకూడదు’ అని అన్నారు. వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగంపై జాగ్రత్త వహించాలని సూచించారు. పురుగుమందుల వినియోగం వల్ల తేనెటీగల పరపరాగ సంపర్క ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తు చేశారు. పురుగుమందుల వినియోగం వల్ల పురుగులు మాత్రమే కాక.. పర్యావరణ వ్యవస్థకు అవసరమైన కీటకాలూ అంతరించిపోతున్నాయని తెలిపారు. అందువల్ల సైన్స్ అభివృద్ధిని సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. జన్యువనరులు అంతరించిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని.. దీనిపై జాతీయ, అంతర్జాతీయ, ప్రైవేట్ సంస్థలు కలసి పనిచేసి.. వ్యవసాయ జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ఒక పరిష్కారాన్ని సూచించాలని కోరారు. అంతరిస్తున్న అరుదైన జాతులు.. 1992 నాటి జీవ వైవిధ్య సదస్సు సిఫార్సులను అమలు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం రోజుకు 50-150 జాతులు అంతరించిపోతున్నాయని, ప్రతి ఎనిమిది రకాల పక్షుల్లో ఒకటి, జంతువుల్లో నాలుగో వంతు అంతరించిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల మన ఆలోచనా విధానం మారాలని మోదీ సూచించారు. అభివృద్ధి పేరుతో చాలామంది సహజ వనరులను గుడ్డిగా దోపిడీ చేస్తున్నారన్నారు. దీనివల్లఅనేక సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ ఆహార అవసరాలు, పోషకాహారం, ఆరోగ్యం, పర్యావరణ భద్రత మొదలైన వాటిని సాధించాలంటే వ్యవసాయ జీవ వైవిధ్యంపై విస్తృత చర్చలు, పరిశోధనలు జరగడం అత్యావశ్యకమని అభిప్రాయపడ్డారు. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్ మాట్లాడుతూ.. పర్యావరణ మార్పుల వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌కు ఘనమైన జన్యువనరులు ఉన్నాయని చెప్పారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మాట్లాడుతూ.. భారత్‌లో ఆహార భద్రతకు వ్యవసాయ జీవవైవిధ్యం ముందడుగని చెప్పారు. వ్యవసాయ జీవవైవిధ్య సంవత్సరాన్ని నిర్వహించేలా ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదన చేయాలని మోదీని కోరారు. ఈ సదస్సుకు 60 దేశాల నుంచి 900 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 14న ఘాజీపూర్ పర్యటన ఘాజీపూర్(యూపీ): మోదీ ఈ నెల 14న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రైల్వే లైన్‌కు, గంగా నదిపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
ఈ-కామర్స్ లోకి దూసుకొస్తున్న లీ మాల్
న్యూఢిల్లీ : భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సముచిత స్థానాన్ని దక్కించుకున్న చైనీస్ ఇంటర్నెట్ అండ్ ఎకో సిస్టమ్ సమ్మేళనం లీఇకో, భారత ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టబోతోంది. తన అధికార ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ 'లీమాల్' ను భారత్ లో ఆవిష్కరించబోతోంది. జూన్ 8న మెగా ఈవెంట్ తో దేశ రాజధాని ఢిల్లీలో ఈ ప్లాట్ ఫామ్ ను లాంచ్ చేస్తున్నామని లీఇకో కంపెనీ వెల్లడించింది. 2013లో మొదటిసారి చైనాలో ఈ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం అమెరికా, హాంగ్ కాంగ్ లో లీమాల్ ప్లాట్ ఫామ్ లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రివర్స్ ఇన్-ఇయర్ హెడ్ ఫోన్లు, ఆల్ మెటల్ ఇయర్ ఫోన్లు, లెమె బ్లూటూత్ హెడ్ ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు లాంటివి లీఇకో ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంటున్నాయి. అదేవిధంగా తర్వాతి తరం 'సూపర్ ఫోన్లు' రెండింటిని 'టూ ఫ్యూచర్స్ ' ఈవెంట్ టైటిల్ తో లీఇకో ప్రారంభించనుంది. అయితే గత నెల ఏప్రిల్ లోనే ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ ఫీచర్(పీడీఏఎఫ్)తో ఈ సూపర్ ఫోన్లను చైనాలో ప్రవేశపెట్టింది. 16మెగాపిక్సెల్ పీడీఏఎఫ్ ప్రైమరీ కెమెరాతో లీ 2ను, యునిక్ ఓఐఎస్ ఫీచర్ తో 21 మెగాపిక్సెల్ కెమెరాను లీఇకో స్మార్ట్ ఫోన్లు వచ్చాయి.