ఈ-కామర్స్ లోకి దూసుకొస్తున్న లీ మాల్
న్యూఢిల్లీ : భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సముచిత స్థానాన్ని దక్కించుకున్న చైనీస్ ఇంటర్నెట్ అండ్ ఎకో సిస్టమ్ సమ్మేళనం లీఇకో, భారత ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టబోతోంది. తన అధికార ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ 'లీమాల్' ను భారత్ లో ఆవిష్కరించబోతోంది. జూన్ 8న మెగా ఈవెంట్ తో దేశ రాజధాని ఢిల్లీలో ఈ ప్లాట్ ఫామ్ ను లాంచ్ చేస్తున్నామని లీఇకో కంపెనీ వెల్లడించింది. 2013లో మొదటిసారి చైనాలో ఈ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం అమెరికా, హాంగ్ కాంగ్ లో లీమాల్ ప్లాట్ ఫామ్ లు ఉన్నాయి.
స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రివర్స్ ఇన్-ఇయర్ హెడ్ ఫోన్లు, ఆల్ మెటల్ ఇయర్ ఫోన్లు, లెమె బ్లూటూత్ హెడ్ ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు లాంటివి లీఇకో ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంటున్నాయి. అదేవిధంగా తర్వాతి తరం 'సూపర్ ఫోన్లు' రెండింటిని 'టూ ఫ్యూచర్స్ ' ఈవెంట్ టైటిల్ తో లీఇకో ప్రారంభించనుంది. అయితే గత నెల ఏప్రిల్ లోనే ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ ఫీచర్(పీడీఏఎఫ్)తో ఈ సూపర్ ఫోన్లను చైనాలో ప్రవేశపెట్టింది. 16మెగాపిక్సెల్ పీడీఏఎఫ్ ప్రైమరీ కెమెరాతో లీ 2ను, యునిక్ ఓఐఎస్ ఫీచర్ తో 21 మెగాపిక్సెల్ కెమెరాను లీఇకో స్మార్ట్ ఫోన్లు వచ్చాయి.