దూసుకుపోతున్న లీమాల్ | LeMall receives 1 lakh registrations for first flash sale in India | Sakshi
Sakshi News home page

దూసుకుపోతున్న లీమాల్

Published Sat, Jun 25 2016 12:57 PM | Last Updated on Mon, Aug 13 2018 3:30 PM

దూసుకుపోతున్న లీమాల్ - Sakshi

దూసుకుపోతున్న లీమాల్

భారత ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టిన  'లీమాల్'  శరవేగంతో దూసుకుపోతోంది.  ఇటీవలే లాంచ్ చేసిన తమ స్టార్ల్ ఫోన్లకు లే 2, లే మ్యాక్స్ 2 లకు భారీ ఆదరణ లభిస్తోందని తెలిపింది. భారతదేశంలో  తమ మొదటి ఫ్లాష్ సేల్స్ లో  లక్ష పైగా రిజిస్ట్రేషన్లు  నమోదయ్యాయని లీ మెయిల్ .కామ్ వెల్లడించింది. జూన్ 28 ఉదయం11గం. నుంచి మధ్యాహ్నం 1గం. ముగిస్తే...  అమ్మకాలు  12 గం.నుంచి మధ్యాహ్నం 2 గంటల  నుంచి  ప్రారంభిస్తామని ప్రకటించింది. అలాగే  భారత ఆన్ లైన్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రివర్స్ ఇన్-ఇయర్ హెడ్ ఫోన్లు, ఆల్ మెటల్ ఇయర్ ఫోన్లు,  బ్లూటూత్ హెడ్ ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు  తదితర  డివైస్ ల అమ్మకాలు  లీఇకో ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లీ మాల్ లో ప్రవేశపెట్టింది.

లీమాల్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్  అని, ఈ నేపథ్యంలో భారత్ మార్కెట్లో అడుగు పెట్టడం, లీ ఇకో వ్యాపార అభివృద్ధికి ఒక మైలురాయి లాంటిదని  కంపెనీ పేర్కొంది. అమెరికాలో ఈ ఏడాది జనవరిలో  లీమాల్ లో రిజిస్టర్ అయిన  30 వేలమందితో కలిపి మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 60వేలకు చేరింది. అలాగే హాంకాంగ్ లో 12,423మంది తన సూపర్ ఫోన్ల కోసం పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపింది. 2013లో మొదటిసారి చైనాలో లీ మాల్ ప్రారంభించగా  ప్రస్తుతం అమెరికా, హాంగ్ కాంగ్ లో లీమాల్ ప్లాట్ ఫామ్ తో భారీ విజయాన్ని సాధించింది. అదే తరహాలో భారత్ మార్కెట్ లో  కూడా  దూసుకుపోవాలనేదే తమ ధ్యేయమని కంపెనీ  తెలిపింది.   

ఇండియా మార్కెట్లో సముచిత స్థానాన్ని దక్కించుకున్న చైనీస్ ఇంటర్నెట్ అండ్ ఎకో సిస్టమ్  తన అధికార ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్  ను భారత్ లో  జూన్ 8న మెగా ఈవెంట్ తో దేశ రాజధాని ఢిల్లీలో ఈ ప్లాట్ ఫామ్ ను లాంచ్ చేసిన  సంగతితెలిసిందే.  

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement