LeEco
-
టోటల్లీ ప్యాక్డ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ బైక్ కమింగ్ సూన్..!
బీజింగ్: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ లీ ఇకో మరో ఆవిష్కారానికి శ్రీకారం చుట్టింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారిత బైక్ లను త్వరలో ప్రవేశపెట్టనుంది. ఆండ్రాయిడ్ డివైస్‌తో అనుసంధానమై పనిచేసే ఈ బైక్‌ను చైనా సంస్థ లీఎకో రూపొందిస్తోంది. 2017 రెండో త్రైమాసికంలో ఈ టోటల్లీ ప్యాక్డ్ విత్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌బైక్‌ను అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. ఇందులో స్మార్ట్ రోడ్ బైక్, స్మార్ట్ మౌంటెన్ బైక్ పేరుతో రెండు వేరియంట్స్ ను తీసుకొస్తోంది. మిగతా సూపర్ బైక్ ల ఫీచర్లతో పాటు 6000 ఎంఏహెచ్ సామర్ధ్యంతో పనిచేసే రిమూవబుల్ బ్యాటరీ , స్నాప్ డ్రాగన్ 410 పవర్డ్ టచ్ స్ర్కీన్ టర్న్ బై టర్న్ నావిగేషన్ , వాకీ టాకీ లాంటి అదనపు ఫీచర్లు ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే ధర ఎంత అనేది మాత్రం ప్రస్తుతానికి సప్పెన్సే. ఈ స్మార్ట్ బైక్ హ్యాండిల్స్ పై ఉండే నాలుగు అంగుళాల టచ్ ఆధారిత స్మార్ట్ స్క్రీన్ ద్వారా మనం ఏ దిశలో వెళ్లాలో తెలుసుకోవచ్చు. ఏయే ప్రాంతాల్లో తిరిగామో రికార్డు కూడా చేస్తుంది. ఒంటరి ప్రయాణంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ సంగీతాన్ని ఆస్వాదించొచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు ఈ బైక్‌ను ఎవరైనా చోరీ చేసేందుకు ప్రయత్నిస్తే.. ఆ బైక్ సంబంధిత యజమాని ఫోన్‌కి అలర్ట్ ఆటోమేటిక్‌గా అందే ఏర్పాటు ఉంది. సెన్సర్ల ద్వారా రైడర్ ఫిట్నెస్ వివరాలను కూడా ఈ స్మార్ట్ బైక్ ట్రాక్ చేసేలా రూపొందించారట. దీంతో ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ కార్లు, స్మార్ట్ టీవీలే కాదు స్మార్ట్ బైక్ లు కూడా ఇక మార్కెట్లను ముంచెత్తబోతున్నాయన్నమాట. అయితే ముందుగా అమెరికాలో హల్ చల్ చేయనున్న ఈ స్మార్ట్ బైక్ లకోసం దేశీయ బైక్ లవర్స్ మాత్రం మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే. -
ఈ సీఈవో వార్షిక జీతం పది రూపాయలు
బీజింగ్: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు లీ ఎకో ఛైర్మన్, జియా సీఈవో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంస్థ నష్టాలకు పూర్తి బాధ్యతను వహిస్తూ తన వార్షికజీతంలో భారీగా కోతపెట్టుకున్నారు. నామమాత్రపు వార్షిక వేతనంగా కేవలం ఒక యెన్ మాత్రమే(రూ.10లు)గా తీసుకోనున్నట్టు వెల్లడించారు. టీవీలు, ఎలక్ట్రిక్ కార్లు, స్మార్ట్ ఫోన్లు లాంటి హైటెక్ ఉత్పత్తుల్లో భారీ పెట్టుబడులకు దిగుతున్న ఈ చైనీస్ ఎలక్ట్రిక్ దిగ్గజం లీఎకో సీఈవో సిబ్బందికి రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. సంస్థలో నెలకొన్న ప్రస్తుత పరిస్తితికి తాను, మ్యానేజ్ మెంట్ టీం పూర్తి బాధ్యతను స్వీకరిస్తున్నామని చెప్పారు టెక్ దిగ్గజం తెస్లా మెటార్స్ను అధిగమించాలని భావిస్తున్న ఈ బిలయనీర్ ..అనేక రంగాల్లో పెట్టుబడుల మూలంగా నగదు కొరత సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు ప్రకటించారు. తమ సంస్థ బిగ్ కంపెనీ డిసీజ్‌ని ఎదుర్కొంటున్నట్టు రాయిటర్స్ పంపిన మరో లేఖలో జియా పేర్కొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా సహా వివిధ దేశాల మార్కెట్లకు సవాల్ విసురుతున్న లీఎకో సంస్థాగత ఇబ్బందులు, వ్యక్తిగత పనితీరు తదితర సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. కాగా జియో ఈ వ్యాఖ్యలతో లీ ఎకో అనుబంధ సంస్థ లేషి ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ బీజింగ్ లో 4.7శాతం పడిపోయింది. -
దివాలీ ఆఫర్ పొడిగించిన లీ ఎకో
న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు లీ ఎకో తన స్మార్ట్ టీవీల దీపావళి ఆఫర్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. సూపర్ 3 టీవీలపై అక్టోబర్ 26 నుంచి 30 వరకు అమలు చేసిన ప్రత్యేక ఆఫర్ మరికొంతకాలం పొడిగిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్ కింద క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను,మూడు, లేదా ఆరు నెలలపాటు వడ్డీలేని ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తున్నట్టు వెల్లడించింది. అలాగే ఎక్సేంజ్ ఆఫర్ కింద 25 వేల వరకు తగ్గింపుధరను అందిస్తోంది. దీపావళి ఆఫర్ సందర్భంగా సంస్థ వెబ్ సైట్ లీమాల్, ఫ్లిప్ కార్ట్ ద్వారా నిర్వహించిన ఓపెన్ అమ్మకాల్లో 2వేలకు పైగా సూపర్ టివీ 3 లనువిక్రయించినట్టు తెలిపింది కాగా చైనా కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ సంస్థ లీ ఎకో ఇటీవలే మన దేశంలో స్మార్ట్ టీవీల బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. . సూపర్ 3 టీవీ సిరీస్ పేరిట మూడు వేరియంట్లను మార్కెట్ లోకి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. -
ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్స్ ఇవేనట!
పండుగ సీజన్లో ఈ-కామర్స్ దిగ్గజాలు ప్రారంభించే బంపర్ ఆఫర్లు వెల్లువ మొదలైంది. రెండో రోజు 'బిగ్ బిలియన్ డేస్' సందర్భంగా దేశీయ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, స్మార్ట్ఫోన్లు వాటికి సంబంధించిన ఉపకరణాలపై బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో ఎవరైతే కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారో వారికి తగ్గింపు ధరల్లో ఫోన్లను విక్రయించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో టాప్-20 డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఆఫర్లలో అందిస్తున్న స్మార్ట్ఫోన్లు ఇవేనట... ఆపిల్... ఆపిల్ ఐఫోన్6(గ్రే కలర్, 16జీబీ) ఫ్లాట్‌పై రూ.7,000 తగ్గింపు, ప్రస్తుత ధర రూ.29,990 ఆపిల్ ఐఫోన్ 5ఎస్(16జీబీ) ఎక్స్చేంజ్పై రూ.15వేల వరకు ధర తగ్గింపు- అందుబాటులో ఉండే ధర రూ.17,799 ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ ప్రస్తుత ధర రూ.30,990, రెగ్యులర్ ఎక్స్చేంజ్పై అదనపు రూ.2500 తగ్గింపు, నెలకు విధించే రూ.2,584 ఈఎంఐ లేకపోవడం శాంసంగ్... శాంసంగ్ గెలాక్సీ జే5-6(ఫ్లాట్‌పై రూ.2,300 తగ్గింపు) ప్రస్తుత ధర రూ.10,990, ఎక్స్చేంజ్పై రూ.9,000వరకు తగ్గింపు శాంసంగ్ ఆన్5- అందుబాటులో ఉన్న ధర రూ.6,990, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.5,500వరకు తగ్గింపు శాంసంగ్ ఆన్6- అందుబాటులో ఉన్న ధర రూ.6,990, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.5,500వరకు తగ్గింపు శాంసంగ్ గెలాక్సీ ఆన్7- ఫ్లాట్‌పై రూ.2,200 తగ్గింపు, ప్రస్తుత ధర రూ.7,990, ఎక్స్చేంజ్పై రూ.6500 వరకు తగ్గింపు శాంసంగ్ గెలాక్సీ ఆన్8(గోల్డ్,16జీబీ) ఫ్లాట్‌పై రూ.1,000 తగ్గింపు, ప్రస్తుత ధర రూ.14,900 లీఎకో... లీఎకో లీ 1ఎస్ ఎకో(32జీబీ)- ఫ్లాట్‌పై రూ.2,000 తగ్గింపు, ఎక్స్చేంజ్పై రూ.6,500వరకు తగ్గింపు లీఎకో లీ 2- ప్రస్తుత ధర రూ.10,499, ఎక్స్చేంజ్పై రూ.8,000వరకు తగ్గింపు లీఎకో లీ మ్యాక్స్2- ఫ్లాట్‌పై రూ.5,000 తగ్గింపు,ఎక్స్చేంజ్పై రూ.16,000వరకు తగ్గింపు షియోమి... షియోమి రెడ్మి 3ఎస్/3ఎస్ ప్రైమ్- రూ.500 తగ్గింపు, ప్రారంభ ధర రూ.6,499 షియోమి మి5- రూ.5,000వరకు తగ్గింపు, ప్రస్తుత ధర రూ.19,999, ఎక్స్చేంజ్ ఆఫర్ పై రూ.18,300 వరకు తగ్గింపు మోటోరోలా... మోటోరోలా మోటో ఎక్స్ ప్లే 32జీబీ ఫోన్ ఫ్లాట్‌పై రూ.4,000 తగ్గింపు, ఎక్స్చేంజ్పై రూ.12,000వరకు తగ్గింపు, ప్రస్తుత ధర రూ.14,999 మోటో ఈ3 వపర్ - ఈఎంఐ ధరలు లేకపోవడం, ఎక్స్చేంజ్పై రూ.7,000 వరకు తగ్గింపు మోటోరోలా మోటోజీ టర్బో ఎడిషన్, 16జీబీ, ప్రస్తుత ధర రూ.9,999, ఎక్స్చేంజ్పై రూ.8,000 తగ్గింపు -
నాలుగు వేరియంట్లలో లీఎకో కొత్త ఫోన్
ముందస్తు అంచనాల మాదిరిగా గానే చైనీస్ టెక్నాలజీ సంస్థ లీఎకో, తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. లీ ప్రో 3 పేరుతో ఈ ఫోన్‌ను ముందుగా స్వదేశంలో లాంచ్ చేసింది. వచ్చే వారం నుంచి ప్రారంభంకాబోతున్న ఫ్లాష్ అమ్మకాలకు ఆసక్తి గల వినియోగదారులు ఇప్పటినుంచే రిజిస్ట్రర్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. గోల్డ్, గ్రే, సిల్వర్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఒకటి 4 జీబీ ర్యామ్+32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వెర్షన్, 1,799 యువాన్లు (సుమారు 18,100 రూపాయలు) రెండు 6 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ వెర్షన్, 1,999 యువాన్లు (సుమారు రూ.20,100 రూపాయలు) ప్రముఖ చైనీస్ ఫిల్మ్‌మేకర్ జాంగ్ ఇమౌ పేరుమీద మరో రెండు వేరియంట్లను లీఎకో లీ ప్రో 3 ఫోన్‌ను ప్రవేశపెట్టింది. దానిలో ఒకటి 4 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ జాంగ్ ఇమౌ ఎడిషన్, ధర 2,499 యువాన్లు(సుమారు రూ.25,100). రెండోది 6 జీబీ ర్యామ్+128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వెర్షన్‌ను ధర 2,999 యువాన్ల(సుమారు రూ.30,100)కు కంపెనీ ఆవిష్కరించింది. మెమరీ, ఇన్‌బిల్ట్ స్టోరేజ్ తేడాలు మినహా మిగతా ఫీచర్లన్నీ ఈ వేరియంట్లలో సమానంగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. అయితే 8 జీబీ ర్యామ్ వేరియంట్‌తో ఈ ఫోన్‌ను లీఎకో తీసుకొస్తుందని టెక్ వర్గాలు భావించాయి. కానీ 6జీబీ ర్యామ్‌లో మాత్రమే ఈ ఫోన్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. అయితే దీనిలో మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమరీని విస్తరించుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించలేదు. రియర్ ప్యానెల్లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్ కలిగిఉంది. ఈ ఫోన్ ఫీచర్లు.. 5.5 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ప్లే విత్ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో 2.35 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 821 ఎస్ఓసీ 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 4జీ ఎల్టీఈ 4070 ఎంఏహెచ్ బ్యాటరీ 175 గ్రాములు -
వెయ్యికి పైగా ఇంజనీర్ ఉద్యోగాలు
న్యూఢిల్లీ: చైనీస్ ఇంటర్నెట్ సంస్థ లే ఎకో భారీ సంఖ్యలో ఇంజనీర్లను నియమించుకునేందుకు యోచిస్తోంది. భారతదేశంలో ఆర్ అండ్ డి సెంటర్ కు దాదాపు 1100 మందికి పైగా ఇంజనీర్ కేటగిరీ ఉద్యోగులు అవసరమని ప్రకటించింది. వచ్చే ఏడాదికల్లా వీరిని ఎంపిక చేయనుంది. ప్రధానంగా వీరిని టైర్ 1 ఇంజనీరింగ్ కాలేజీలనుంచి సెలెక్ట్ చేయనున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ ఐటీలనుంచి వీరినుంచి ఎంపిక చేయనున్నామని లె ఎకో ఒక ప్రకటనలో వెల్లడించింది. బెంగుళూరులో గత వారం నిర్వహించిన ఫ్రెషర్స్ డ్రైవ్ లో అత్యున్నత ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు నుంచి 2,000 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని కంపెనీ తెలిపింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన సంస్థ మోడెమ్ సాంకేతికతలు, బీఎస్పి, మల్టీమీడియా, టీవీ బ్రాడ్ కాస్ట్ , ఇంటర్నెట్ టెక్నాలజీస్ తదితర అంశాల్లో నైపుణ్యం ఉన్నవారికోసం అన్వేషిస్తున్నామని లే ఎకో ఇండియా హెడ్( ఆర్ అండ్ డి) శ్రీనివాస్ బైరి చెప్పారు. కాగా భారత్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ 2017లో నెలకొల్పనున్నట్టు ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
లీ ఎకో స్మార్ట్‌టీవీ వచ్చేసింది..!
చైనా ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ 'లీ ఎకో' తాజాగా తన సూపర్3’ సిరీస్ అల్ట్రా హెచ్డీ స్మార్ట్‌టీవీలను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో 55 అంగుళాల ఎక్స్55 X 65 అంగుళాల ఎక్స్65 X 65 అంగుళాల మ్యాక్స్65’అనే ప్రొడక్టులు ఉన్నాయి. 4కే అల్ట్రా హెచ్డీ (3840 X 2160) రెజల్యూషన్ వీటి సొంతం. ఎక్స్55’ ధర రూ.59,790గా, ఎక్స్65’ ధర రూ.99,790గా, మ్యాక్స్65’ ధర రూ.1,49,790గా ఉంది. ఈ టీవీలు ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయని, ఇందులో ఆండ్రాయిడ్ యాప్స్‌ను రన్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఎక్స్55’లో 2 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీని, మిగతా ప్రొడక్టులలో 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ ఫీచర్లను పొందుపరిచామని పేర్కొంది. ఈ ఆండ్రాయిడ్ టీవీలన్నీ వినియోగదారులకు కంపెనీ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ లీమాల్ సహా ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్ట్ 10 నుంచి అందుబాటులో ఉంటాయని వివరించింది. -
ఇండస్ట్రీ రికార్డులో ఆ ఫోన్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ లీఎకో తన స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. ఇండస్ట్రీ రికార్డు సేల్స్ ను నమోదు చేసింది. ఒకే రోజులో రూ.78.6 కోట్ల విలువైన 61,000 మొబైళ్లను ఆన్లైన్లో విక్రయించింది. ఇది ‘పరిశ్రమ రికార్డు’గా కంపెనీ వెల్లడించింది. తాజా విక్రయాలతో గడిచిన 5 నెలల్లోనే 7 లక్షల మొబైళ్ల విక్రయాలను అధిగమించినట్లు లీఎకో ఇండియా స్మార్ట్ ఎలక్ట్రానిక్స్ సీఓఓ అతుల్ జైన్ పీటీఐకి తెలిపారు. ప్రీమియం క్వాల్కమ్ స్నాప్ డ్రా గెన్ చిప్ సెట్ కలిగిన రెండు స్మార్ట ఫోన్ల అమ్మకాలు ప్రారంభించిన మొదటి సంస్థ తమదేనన్నారు. మంగళవారం కంపెనీ తన లీ 2, లీ మాక్స్2 మోడల్ మొబైళ్లను ఆన్లైన్లో విక్రయానికి ఉంచగా.. మొత్తం 61000 స్మార్ట్ ఫోన్లను విక్రయించినట్టు లీ ఇకో తెలిపింది. ఇందులో 80 శాతం లీ 2 కావడం విశేషం. లీ 2, లీ మాక్స్2 కొనుగోలుదార్లకు రూ.1990 విలువైన సీడీఎల్ఏ ఇయర్ ఫోన్లను ఉచితంగా ఇచ్చినట్లు జైన్ చెప్పారు. రెండు ఫోన్లకూ ఒక ఏడాది లీఎకో సభ్యత్వం(రూ.4900 విలువ చేసే) ఉంటుంది. తద్వారా 2000 బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలను చూడొచ్చు. అలాగే 150కి పైగా లైవ్ ఛానెళ్లను కూడా యాక్సెస్ చేసుకునే అవకాశాన్ని లీ ఇకో అందిస్తోంది. కాగా, లీ 2, లీ మాక్స్2రెండు మోడళ్లు క్వాల్‌కాం చిప్ సెట్లతో రూపొందించినవే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సంస్థ 4జీ స్మార్ట్ ఫోన్లను తన ఆన్ లైన్ లీ మాల్ ద్వారా విక్రయించడం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. -
దూసుకుపోతున్న లీమాల్
భారత ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టిన 'లీమాల్' శరవేగంతో దూసుకుపోతోంది. ఇటీవలే లాంచ్ చేసిన తమ స్టార్ల్ ఫోన్లకు లే 2, లే మ్యాక్స్ 2 లకు భారీ ఆదరణ లభిస్తోందని తెలిపింది. భారతదేశంలో తమ మొదటి ఫ్లాష్ సేల్స్ లో లక్ష పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని లీ మెయిల్ .కామ్ వెల్లడించింది. జూన్ 28 ఉదయం11గం. నుంచి మధ్యాహ్నం 1గం. ముగిస్తే... అమ్మకాలు 12 గం.నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభిస్తామని ప్రకటించింది. అలాగే భారత ఆన్ లైన్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రివర్స్ ఇన్-ఇయర్ హెడ్ ఫోన్లు, ఆల్ మెటల్ ఇయర్ ఫోన్లు, బ్లూటూత్ హెడ్ ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు తదితర డివైస్ ల అమ్మకాలు లీఇకో ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లీ మాల్ లో ప్రవేశపెట్టింది. లీమాల్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ అని, ఈ నేపథ్యంలో భారత్ మార్కెట్లో అడుగు పెట్టడం, లీ ఇకో వ్యాపార అభివృద్ధికి ఒక మైలురాయి లాంటిదని కంపెనీ పేర్కొంది. అమెరికాలో ఈ ఏడాది జనవరిలో లీమాల్ లో రిజిస్టర్ అయిన 30 వేలమందితో కలిపి మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 60వేలకు చేరింది. అలాగే హాంకాంగ్ లో 12,423మంది తన సూపర్ ఫోన్ల కోసం పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపింది. 2013లో మొదటిసారి చైనాలో లీ మాల్ ప్రారంభించగా ప్రస్తుతం అమెరికా, హాంగ్ కాంగ్ లో లీమాల్ ప్లాట్ ఫామ్ తో భారీ విజయాన్ని సాధించింది. అదే తరహాలో భారత్ మార్కెట్ లో కూడా దూసుకుపోవాలనేదే తమ ధ్యేయమని కంపెనీ తెలిపింది. ఇండియా మార్కెట్లో సముచిత స్థానాన్ని దక్కించుకున్న చైనీస్ ఇంటర్నెట్ అండ్ ఎకో సిస్టమ్ తన అధికార ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ను భారత్ లో జూన్ 8న మెగా ఈవెంట్ తో దేశ రాజధాని ఢిల్లీలో ఈ ప్లాట్ ఫామ్ ను లాంచ్ చేసిన సంగతితెలిసిందే. -
టీవీ రంగంలో స్మార్ట్ ఫోన్ కంపెనీల దూకుడు..!
కోల్ కత్తా : ఇప్పటివరకూ ధరల పోటీ కేవలం స్మార్ట్ ఫోన్లకే అనుకున్నాం.. కానీ టెలివిజన్ రంగంలోనూ ఈ పోటీ తెరలేవబోతోంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తమదైన శైలిలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో, చైనా లీ ఎకోలు భారత టెలివిజన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయట. చౌకైన ధరలకే ఈ టీవీలను మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే టీవీ మార్కెట్లో టాప్ బ్రాండ్లగా ఉన్న శామ్ సంగ్, ఎల్ జీ, సోనీలకు పోటీగా.. వారికి సీరియస్ చాలెంజ్ లా ఈ దీపావళి కంటే ముందే మార్కెట్లోకి రావాలని రిలయన్స్ జియో, లీఎకో ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. లైఫ్ బ్రాండ్ కింద వివిధ స్క్రీన్ సైజుల్లో స్మార్ట్ ఎల్ఈడీ టీవీలను రిలయన్స్ జియో త్వరలోనే ఆవిష్కరించబోతుందట. ప్రస్తుతం ఆ కంపెనీ 4జీ-ఎల్ టీఈ స్మార్ట్ ఫోన్లను కలిగిఉంది. మల్టీ బ్రాండ్ రిటైల్ స్టోర్లు, ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లో ఇవి అందుబాటులో ఉండనున్నాయని తెలుస్తోంది. మూడు స్క్రీన్ సైజులు 43 అంగుళాలు, 50 అంగుళాలు, 65 అంగుళాలను టీవీ సెట్లకు రిలయెన్స్ మార్గనిర్దేశనం చేస్తుందట. హై డెఫినేషన్ 4కే స్క్రీన్లతో టీవీలను ప్రవేశపెట్టడంతో, జియో అప్ కమింగ్ 4జీ హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులను కూడా జోడించనుంది. 4జీ సర్వీసులతో టీవీలను వినియోగదారుల ముందుకు తీసుకురావడం అత్యంత ముఖ్యమైన మార్గమని... మార్కెట్లో అగ్రస్థానంలో నిలవడానికి చౌకైన ధరలను ఆఫర్ చేస్తామని కంపెనీకి చెందిన ఓ ప్రతినిధి పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో దూసుకుపోతున్న మరో బ్రాండ్ లీఎకో.. చౌకైన ధరల్లో వచ్చే నెల టీవీ మార్కెట్లోకి రాబోతుందట. ఎలాంటి లాభాలను ఆశించకుండా.. స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో అనుసరించిన వ్యూహంతోనే టీవీలనూ ప్రవేశపెడుతుందని సీనియర్ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్స్ తెలిపారు. మన్నిక, ప్రత్యేకతలు దగ్గర అసలు రాజీ పడకుండా టీవీ సెట్లను ప్రవేశపెడతామని చైనీస్ కంపెనీ తెలుపుతోంది. -
మార్కెట్లోకి రెండు లీఎకో స్మార్ట్ ఫోన్లు
న్యూఢిల్లీ : చైనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ లీఎకో వరుసగా రెండు స్మార్ట్ ఫోన్లను ఒకేరోజు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. లీఎకో లీ 2, లీ మ్యాక్స్ 2లను ఢిల్లీలో మెగా ఈవెంట్ గా బుధవారం విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లు లీమాల్, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉండనున్నాయని కంపెనీ తెలిపింది. లీ మ్యాక్స్ 2 జూన్ 28 నుంచి అందుబాటులో ఉంటుందని, లీ 2 ఎప్పటినుంచి మార్కెట్లో ఉంచుతామో తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ఈ రెండు డివైజ్‌ల రిజిస్ట్రేషన్లు జూన్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై మొదటి నుంచి ఫ్లాష్ అమ్మకాలను చేపడతామని కంపెనీ ప్రకటించింది. లీఎకో లీ2 స్మార్ట్ ఫోన్ ధర రూ.11,999గాను, లీ మ్యాక్స్ 2కు రూ.22,999కు మార్కెట్లోకి ఆవిష్కరించింది. అయితే వీటితో పాటు లీ 2 ప్రొ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తామని చెప్పిన లీఎకో ప్రస్తుతం ఆ ఫోన్ భారత మార్కెట్లోకి ఆవిష్కరించలేదు. లీఎకో లీ 2 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు.. 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 652 చిప్ సెట్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ స్పేస్ 16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 4జీ ఎల్ టీఈ బ్యాండ్స్ సపోర్టు విస్తరణకు అవకాశం లేదు 3000 ఎంఏహెచ్ బ్యాటరీ లీఎకో లీ మ్యాక్స్ 2 ఫీచర్లు.. 5.7 అంగుళాల 2కే డిస్ ప్లే ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో 4 జీబీ, 6 జీబీ ర్యామ్ లతో రెండు వేరియంట్లు ప్రామాణికంగా 32 జీబీ స్టోరేజ్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ నూ అమర్చుకోవచ్చు 21 మెగా పిక్సెల్ వెనుక కెమెరా 8 మెగా పిక్సెల్ ముందు కెమెరా 4 జీ ఎల్ టీఈ సపోర్టు 3100 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఈ-కామర్స్ లోకి దూసుకొస్తున్న లీ మాల్
న్యూఢిల్లీ : భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సముచిత స్థానాన్ని దక్కించుకున్న చైనీస్ ఇంటర్నెట్ అండ్ ఎకో సిస్టమ్ సమ్మేళనం లీఇకో, భారత ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టబోతోంది. తన అధికార ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ 'లీమాల్' ను భారత్ లో ఆవిష్కరించబోతోంది. జూన్ 8న మెగా ఈవెంట్ తో దేశ రాజధాని ఢిల్లీలో ఈ ప్లాట్ ఫామ్ ను లాంచ్ చేస్తున్నామని లీఇకో కంపెనీ వెల్లడించింది. 2013లో మొదటిసారి చైనాలో ఈ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం అమెరికా, హాంగ్ కాంగ్ లో లీమాల్ ప్లాట్ ఫామ్ లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రివర్స్ ఇన్-ఇయర్ హెడ్ ఫోన్లు, ఆల్ మెటల్ ఇయర్ ఫోన్లు, లెమె బ్లూటూత్ హెడ్ ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు లాంటివి లీఇకో ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంటున్నాయి. అదేవిధంగా తర్వాతి తరం 'సూపర్ ఫోన్లు' రెండింటిని 'టూ ఫ్యూచర్స్ ' ఈవెంట్ టైటిల్ తో లీఇకో ప్రారంభించనుంది. అయితే గత నెల ఏప్రిల్ లోనే ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ ఫీచర్(పీడీఏఎఫ్)తో ఈ సూపర్ ఫోన్లను చైనాలో ప్రవేశపెట్టింది. 16మెగాపిక్సెల్ పీడీఏఎఫ్ ప్రైమరీ కెమెరాతో లీ 2ను, యునిక్ ఓఐఎస్ ఫీచర్ తో 21 మెగాపిక్సెల్ కెమెరాను లీఇకో స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. -
లీఇకో నుంచి ఒకేసారి మూడు స్మార్ట్ ఫోన్లు
చైనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ లీ ఇకో వరుసగా మూడు స్మార్ట్ ఫోన్లను ఒకేరోజు మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. లీ 2, లీ 2 ప్రొ, లీ మ్యాక్స్ 2లు న్యూఢిల్లీ ఈవెంట్ గా జూన్ 8న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు స్మార్ట్ ఫోన్లను గతనెలే బీజింగ్ లో లీ ఇకో ప్రవేశపెట్టింది. లీ 2 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు..... 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే మీడియా టెక్స్ కొత్త హెలియో ఎక్స్20 డెకా-కోర్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ స్పేస్ 16 మెగాపిక్సెల్ రేర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ధర రూ.10,990గా అంచనా లీ 2 ప్రొ ఫీచర్లు.. హెలియో ఎక్స్25 ప్రాసెసర్ 21 మెగా పిక్సెల్ వెనుక కెమెరా 32 జీబీ, 64 జీబీ రెండు స్టోరేజ్ వేరియంట్లు ధర రూ.14,900గా అంచనా పై రెండు ఫోన్లకు సౌండ్ కోసం సీడీఎల్ఏను, యూఎస్బీ టైప్-సీ హెడ్ ఫోన్స్ ను సపోర్టు చేయనున్నాయి. లీ మ్యాక్స్ 2 ఫీచర్లు.. 5.7 అంగుళాల 2కే డిస్ ప్లే క్వాల్ కామ్ 820 క్లాక్డ్ 2.15జీహెచ్ 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ స్పేస్ 21 మెగా పిక్సెల్ వెనుక కెమెరా 8 మెగా పిక్సెల్ ముందు కెమెరా స్నాప్ డ్రాగన్ ఫింగర్ ప్రింట్ ఐడీ 4జీబీ ర్యామ్ ఫోన్ రూ.20,099 6 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.24,900గా అంచనా. ఇటీవలే ఈ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారి లీ 1ఎస్ ఇకో ఫోన్ ను ముంబాయి ఈవెంట్ లో భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. లీ సిరీస్ కు చెందిన లీ 2, లీ 2 ప్రొ, లీ మ్యాక్స్ 2లను రెండు నెలల్లో ప్రవేశపెడతామని కంపెనీ వెల్లడించింది. -
24 గంటల్లో లక్ష ఫోన్లకు రిజిస్ట్రేషన్లు
బీజింగ్ : చైనా టెక్నాలజీ కంపెనీ లీ ఇకో మొదటి 'మేడ్ ఫర్ ఇండియా' స్మార్ట్ ఫోన్ అకా ది లీ 1ఎస్(ఎకో) కు 24గంటల వ్యవధిలోనే ఏకంగా లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చాయని కంపెనీ వెల్లడించింది. ఫ్లాస్ అమ్మకాల ద్వారా ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ మంగళవారం ప్రకటించింది. మొదటి 1,000 యూనిట్ల ఫ్లాస్ అమ్మకాలను మే 12న మధ్యాహ్నం రెండు గంటలకు చేపడతామని కంపెనీ తెలిపింది. మొదటి ఫ్లాస్ అమ్మకం కింద రూ.9,999 లకు ఈ ఫోన్ అందుబాటులోకి తేనున్నట్టు పేర్కొంది. లీ 1ఎస్(ఎకో) ఫోన్ ను కంపెనీ మంగళవారం ఆవిష్కరించింది. లీ 1ఎస్(ఎకో) ఫీచర్స్ : 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే మీడియా టెక్ హెలియో ఎక్స్ 10 ప్రాసెసర్ 3జీబీ ర్యామ్ 32జీబీ ఇంటర్నెల్ మెమెరీ 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 5 మెగా పిక్సెల్ ముందు కెమెరా 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ మెటల్ బాడీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ డ్యూయల్ సిమ్ (మైక్రో, నానో సిమ్) -
ఒక్క రోజులోనే 7.5 లక్షల ఫోన్లు సేల్
న్యూఢిల్లీ : చైనీస్ ఇంటర్ నెట్, టెక్నాలజీ దిగ్గజ సంస్థ 'లీ ఇకో' రెండో తరానికి చెందిన సూపర్ ఫోన్ల అమ్మకాల్లో దూసుకెళ్తోంది. ఒక్క రోజులోనే 7 లక్షల 50వేలకు పైగా సూపర్ ఫోన్లు అమ్ముడుపోయాయని కంపెనీ ప్రకటించింది. అదేవిధంగా లీమాల్.కామ్ లో దాదాపు 2 కోట్ల 30 లక్షల (23మిలియన్) రిజిస్ట్రేషన్లు నమోదైనట్టు పేర్కొంది.లీ మాక్స్2 కేవలం 57 సెకండ్లలో అమ్ముడుపోతుండగా, లీ2 మోడల్ 8.26 నిమిషాల్లో అమ్ముడు పోతుందని కంపెనీ తెలిపింది. అదేవిధంగా నాలుగో తరానికి చెందిన సూపర్ టీవీ రిజిస్ట్రేషన్లు కూడా కోటి ఎనభై లక్షలు(18 మిలియన్లు) దాటిందని కంపెనీ పేర్కొంది. లీ ఇకో కంపెనీకి చెందిన ఉత్పత్తుల్లో కొత్త శ్రేణికి చెందిన వాటిని కంపెనీ గతవారం బీజింగ్ లో ప్రవేశపెట్టింది. మొబైల్, టీవీ, ఆటోమోటివ్, వీఆర్ లాంటి వివిధ రకాల మోడళ్లను కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. 153గ్రాముల బరువు, 8.5ఎంఎం వెడల్పు, 151ఎంఎం లాంగ్, యూఎస్ బీ టైప్-సీ ఆడియో పోర్టు ఫీచర్ కంటిన్యూల్ డిజిటల్ లాస్ లెస్ ఆడియో టెక్నాలజీతో మాక్స్2 ను కంపెనీ రూపొందించింది. 6జీబీ మెమరీ, 64జీబీ విస్తరణ మెమరీతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 820 క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో 5.7 అంగుళాల క్యూహెచ్ డీ డిస్ ప్లే ను ఈ ఫోన్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్ తో చుట్టిన లీ ఇకో కస్టమైజిడ్ ఈయూఐ 5.5, 3100 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, కనెక్టివిటీ ఆప్షన్లలో 802.11ఎసీ వైఫై, 4జీ ఎల్టీఈ, జీపీఎస్ లు మాక్స్ 2 ప్రత్యేకతలు. 16 ఎంపీ ఎఫ్/2 వెనుక కెమెరా, దాంతో పాటు ఎల్ ఈడీ, పీడీఏఎఫ్ ప్లాస్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ కలిగిఉంది. -
భారత్ వైపు 'లీ ఇకో' దృష్టి
ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలు ప్రపంచదృష్టిని భారత్ వైపు మరల్చుతున్నాయి. ప్రపంచ ఇంటర్నెట్, టెక్నాలజీ కంపెనీలు భారత్‌లో తయారీ సంస్థలు ఏర్పాటుచేయడానికి మొగ్గుచూపుతున్నాయి. చైనీస్ ఇంటర్ నెట్, టెక్నాలజీ దిగ్గజ సంస్థ 'లీ ఇకో' తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్లను భారత్ లో ఏర్పాటుచేయాలని చూస్తున్నామని ఆ కంపెనీ వైస్ చైర్మన్, కో-ఫౌండర్ లియు హాంగ్ తెలిపారు. టెక్నాలజీ పరంగా భారత్ లో లీ ఇకో తమ శక్తిని చాటుకునేందుకు పెద్ద మొత్తంలో రిటైల్, ఆఫ్ లైన్ స్టోరులు కూడా ఏర్పాటుచేయబోతున్నట్టు పేర్కొన్నారు. సింగిల్ బ్రాండ్ రిటైల్ లైసెన్సు కోసం ఇప్పటికే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహకబోర్డులో దరఖాస్తు చేసుకున్నామని కంపెనీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయ్‌పూర్ ఎలక్ట్రానిక్ క్లస్టర్, భోపాల్, బైల్వాడ(రాజస్తాన్) ప్రాంతాల్లో ఎక్కడైనా తయారీ సంస్థను ఏర్పాటు చేసుకోవాలని టెక్నాలజీ శాఖ తమకు సూచించినట్లు లియు హాంగ్ చెప్పారు. ఆ ప్రాంతాలను విశ్లేషిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోదీతో, టెలికాం మంత్రితో సమావేశం అవుతామని, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల్లో తమవంతు సహాకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రారంభ పెట్టుబడిగా రూ.50 కోట్లతో 8-10 లీ ఇకో స్టోర్లు, 500 ఫ్రాంచైజీ దుకాణాలను తెరుస్తున్నట్టు హాంగ్ చెప్పారు. తమ ఆఫ్‌లైన్ స్టోర్లు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఉంటాయన్నారు. భారత్ లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ కు ఫుల్ క్రేజ్ ఉన్న నేపథ్యంలో లీ ఇకో సంస్థ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. -
ఓపెన్ సేల్ పై సోషల్ మీడియాలో ఆగ్రహం
న్యూఢిల్లీ: ఎల్ఈటీవీ 'ఓపెన్ సేల్' స్మార్ట్ ఫోన్ ప్రియులకు నిరాశ కలిగించింది. లె 1ఎస్ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో గురువారం ఓపెన్ సేల్ కు పెట్టింది. హైఎండ్ ఫీచర్లతో అందుబాటు ధరలో లభ్యమవుతున్న ఈ ఫోన్ దక్కించుకునేందుకు ప్రయత్నించిన వినియోగదారులకు ఆశాభంగం ఎదురైంది. అమ్మకానికి పెట్టిన కొద్ది నిమిషాల్లోనే ఫోన్లు అన్నీ అమ్ముడయ్యాయన్న మెసేజ్ దర్శనమివ్వడంతో స్మార్ట్ ఫోన్ అభిమానులు అవాక్కయ్యారు. 'సోల్డ్ అవుట్' సందేశంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఫోన్లు అమ్ముతామో చెప్పకుండా తమను పూల్స్ చేసిందని వాపోయారు. మొదటి ఫ్లాష్ అమ్మకాల్లో 2.2 లక్షల ఫోన్లు విక్రయించడంతో ఓపెన్ సేల్ లో కనీసం 2 లక్షల ఫోన్లు అమ్మకానికి పెడుతుందని భావించారు. స్టాక్ లేనప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం ఎందుకు చేశారని ఓ వినియోగదారుడు ప్రశ్నించాడు. ఎల్ఈటీవీ తమను డిసప్పాయింట్ చేసిందని పేర్కొన్నారు. ఫ్లిప్ కార్ట్ లో లె 1ఎస్ స్మార్ట్ ఫోన్ బుక్ చేశాను కానీ 20 నిమిషాల తర్వాత స్టాక్ అయిపోయినట్టు కనబడింది. ఏం జరుగుతోంది, సేల్స్ సక్రమంగా లేవని మరో అభిమాని వాపోయాడు. స్టాక్ అయిపోయిందంటున్నారు, ఓపెన్ సేల్ కు అర్థముందా అని మరొకరు ప్రశ్నించారు. అయితే దీనిపై ఎల్ఈటీవీ నుంచి ఎటువంటి స్పందన లేదు. చైనా నుంచి స్టాక్ రావాలంటే కనీసం వారం రోజులు పడుతుంది. కాగా, 16 నిమిషాల్లో 25వేల ఫోన్లు అమ్మినట్టు ప్రచారం జరుగుతోంది. లె 1ఎస్ స్టాక్ అయిపోయినా, లె మ్యాక్స్(ధర. రూ.32,999) మాత్రం లభ్యమవుతోంది. -
ఐఫోన్ కన్నా ఈ ఫోన్ కాస్ట్లీ గురూ!
న్యూఢిల్లీ: చైనా మొబైల్ హ్యాండ్సెట్ మేకర్ ఎల్ఈటీవీ తాజాగా భారత్ స్మార్ట్‌ఫోన్ విపణిలోకి అడుగుపెట్టింది. లెకో (LeEco)గా ఇటీవల పేరు మార్చుకున్న ఈ కంపెనీ విభిన్న రకాల స్మార్ట్ఫోన్లను భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆ కంపెనీ ప్రధాన మోడల్ అయిన 'లె మాక్స్ షప్పైర్' ధర అక్షరాల రూ. 69.999. అంటే ఈ మొబైల్ ఐఫోన్ 6ఎస్ కంటే ఖరీదైనది కావడం గమనార్హం. ప్రస్తుతం ఐఫోన్ 6 ఎస్ రూ. 62 వేల నుంచి లభిస్తున్నాయి. భారత్‌లో మొదటి విడతగా లెకో కంపెనీ ఈ మోడల్ వెయ్యి యూనిట్లను మాత్రమే అమ్మనుంది. దీంతోపాటు లెకో కంపెనీ 64 జీబీ, 128 జీబీలతో కూడిన లె మాక్స్ స్టాండర్డ్ మోడళ్లను భారత్‌లో అమ్మనుంది. వీటి ధర వరుసగా రూ. 32,999, రూ. 36,999గా ఉండనున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లో ఈ మొబైళ్లు లభిస్తాయి. ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ వెర్షన్‌తో లే మాక్స్ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. ఇందులో 6.33 అంగుళాల క్వాడ్ HD ( 2,560x1,440p) డిస్‌ప్లేతోపాటు, 2GHz ఆక్టా కోర్ స్నాప్డ్రాగెన్ 810 చిప్సెట్ శక్తి ఉంటుంది. ఇందులో 4GB RAM ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ 3,400mAhగా ఉంటుంది. సోనీ IMX230 సెన్సార్ తో కూడిన 21MP బ్యాక్ కెమెరాతోపాటు అనేక ఫీచర్స్ తో కూడిన 4MP ఫ్రంట్ కెమెరా ఈ మొబైల్లో ఉంటాయి. కనెక్టివిటీ కోసం 4G, 3G, Wi -Fi , బ్లూటూత్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.