ఈ సీఈవో వార్షిక జీతం పది రూపాయలు
బీజింగ్: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు లీ ఎకో ఛైర్మన్, జియా సీఈవో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంస్థ నష్టాలకు పూర్తి బాధ్యతను వహిస్తూ తన వార్షికజీతంలో భారీగా కోతపెట్టుకున్నారు. నామమాత్రపు వార్షిక వేతనంగా కేవలం ఒక యెన్ మాత్రమే(రూ.10లు)గా తీసుకోనున్నట్టు వెల్లడించారు. టీవీలు, ఎలక్ట్రిక్ కార్లు, స్మార్ట్ ఫోన్లు లాంటి హైటెక్ ఉత్పత్తుల్లో భారీ పెట్టుబడులకు దిగుతున్న ఈ చైనీస్ ఎలక్ట్రిక్ దిగ్గజం లీఎకో సీఈవో సిబ్బందికి రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. సంస్థలో నెలకొన్న ప్రస్తుత పరిస్తితికి తాను, మ్యానేజ్ మెంట్ టీం పూర్తి బాధ్యతను స్వీకరిస్తున్నామని చెప్పారు
టెక్ దిగ్గజం తెస్లా మెటార్స్‌ను అధిగమించాలని భావిస్తున్న ఈ బిలయనీర్ ..అనేక రంగాల్లో పెట్టుబడుల మూలంగా నగదు కొరత సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు ప్రకటించారు. తమ సంస్థ బిగ్ కంపెనీ డిసీజ్‌ని ఎదుర్కొంటున్నట్టు రాయిటర్స్ పంపిన మరో లేఖలో జియా పేర్కొన్నారు
గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా సహా వివిధ దేశాల మార్కెట్లకు సవాల్ విసురుతున్న లీఎకో సంస్థాగత ఇబ్బందులు, వ్యక్తిగత పనితీరు తదితర సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. కాగా జియో ఈ వ్యాఖ్యలతో లీ ఎకో అనుబంధ సంస్థ లేషి ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ బీజింగ్ లో 4.7శాతం పడిపోయింది.