న్యూఢిల్లీ : చైనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ లీఎకో వరుసగా రెండు స్మార్ట్ ఫోన్లను ఒకేరోజు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. లీఎకో లీ 2, లీ మ్యాక్స్ 2లను ఢిల్లీలో మెగా ఈవెంట్ గా బుధవారం విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లు లీమాల్, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉండనున్నాయని కంపెనీ తెలిపింది. లీ మ్యాక్స్ 2 జూన్ 28 నుంచి అందుబాటులో ఉంటుందని, లీ 2 ఎప్పటినుంచి మార్కెట్లో ఉంచుతామో తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ఈ రెండు డివైజ్‌ల రిజిస్ట్రేషన్లు జూన్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై మొదటి నుంచి ఫ్లాష్ అమ్మకాలను చేపడతామని కంపెనీ ప్రకటించింది. లీఎకో లీ2 స్మార్ట్ ఫోన్ ధర రూ.11,999గాను, లీ మ్యాక్స్ 2కు రూ.22,999కు మార్కెట్లోకి ఆవిష్కరించింది. అయితే వీటితో పాటు లీ 2 ప్రొ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తామని చెప్పిన లీఎకో ప్రస్తుతం ఆ ఫోన్ భారత మార్కెట్లోకి ఆవిష్కరించలేదు.
లీఎకో లీ 2 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు..
5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 652 చిప్ సెట్
3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ స్పేస్
16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
4జీ ఎల్ టీఈ బ్యాండ్స్ సపోర్టు
విస్తరణకు అవకాశం లేదు
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
లీఎకో లీ మ్యాక్స్ 2 ఫీచర్లు..
5.7 అంగుళాల 2కే డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో
4 జీబీ, 6 జీబీ ర్యామ్ లతో రెండు వేరియంట్లు
ప్రామాణికంగా 32 జీబీ స్టోరేజ్
64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ నూ అమర్చుకోవచ్చు
21 మెగా పిక్సెల్ వెనుక కెమెరా
8 మెగా పిక్సెల్ ముందు కెమెరా
4 జీ ఎల్ టీఈ సపోర్టు
3100 ఎంఏహెచ్ బ్యాటరీ