చైనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ లీ ఇకో వరుసగా మూడు స్మార్ట్ ఫోన్లను ఒకేరోజు మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. లీ 2, లీ 2 ప్రొ, లీ మ్యాక్స్ 2లు న్యూఢిల్లీ ఈవెంట్ గా జూన్ 8న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు స్మార్ట్ ఫోన్లను గతనెలే బీజింగ్ లో లీ ఇకో ప్రవేశపెట్టింది.
లీ 2 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు.....
5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే
మీడియా టెక్స్ కొత్త హెలియో ఎక్స్20 డెకా-కోర్ ప్రాసెసర్
3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ స్పేస్
16 మెగాపిక్సెల్ రేర్ కెమెరా
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
ధర రూ.10,990గా అంచనా
లీ 2 ప్రొ ఫీచర్లు..
హెలియో ఎక్స్25 ప్రాసెసర్
21 మెగా పిక్సెల్ వెనుక కెమెరా
32 జీబీ, 64 జీబీ రెండు స్టోరేజ్ వేరియంట్లు
ధర రూ.14,900గా అంచనా
పై రెండు ఫోన్లకు సౌండ్ కోసం సీడీఎల్ఏను, యూఎస్బీ టైప్-సీ హెడ్ ఫోన్స్ ను సపోర్టు చేయనున్నాయి.
లీ మ్యాక్స్ 2 ఫీచర్లు..
5.7 అంగుళాల 2కే డిస్ ప్లే
క్వాల్ కామ్ 820 క్లాక్డ్ 2.15జీహెచ్
6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ స్పేస్
21 మెగా పిక్సెల్ వెనుక కెమెరా
8 మెగా పిక్సెల్ ముందు కెమెరా
స్నాప్ డ్రాగన్ ఫింగర్ ప్రింట్ ఐడీ
4జీబీ ర్యామ్ ఫోన్ రూ.20,099
6 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.24,900గా అంచనా.
ఇటీవలే ఈ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారి లీ 1ఎస్ ఇకో ఫోన్ ను ముంబాయి ఈవెంట్ లో భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. లీ సిరీస్ కు చెందిన లీ 2, లీ 2 ప్రొ, లీ మ్యాక్స్ 2లను రెండు నెలల్లో ప్రవేశపెడతామని కంపెనీ వెల్లడించింది.