June 8
-
మోదీ రాజీనామా.. 17వ లోక్‌సభ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బుధవారం మధ్యాహ్నాం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన రాజీనామా సమర్పించారు. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మెజారిటీ చేజిక్కించుకున్న నేపథ్యంలో ఆయన 17వ లోక్‌సభను రద్దు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్మును కోరారు. రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము.. లోక్‌సభ రద్దుకు సైతం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రిమండలి సమావేశమై 17వ లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేసింది. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16వ తేదీతో ముగియనుంది. సాయంత్రం ఎన్డీయే కూటమి నేతల సమావేశం జరగనుంది. ఆ వెంటనే రాష్ట్రపతిని కూటమి నేతలంతా కలిసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని లేఖను అందించే అవకాశాలున్నాయి.మోదీ ప్రమాణానికి ముహూర్తంఇక ఈ నెల 8న ప్రధాని మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. కర్తవ్య్‌పథ్‌లో మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఏడో తేదీన బీజేపీ, ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఆ భేటీలో లాంఛనంగా పార్లమెంటరీ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. -
లీఇకో నుంచి ఒకేసారి మూడు స్మార్ట్ ఫోన్లు
చైనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ లీ ఇకో వరుసగా మూడు స్మార్ట్ ఫోన్లను ఒకేరోజు మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. లీ 2, లీ 2 ప్రొ, లీ మ్యాక్స్ 2లు న్యూఢిల్లీ ఈవెంట్ గా జూన్ 8న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు స్మార్ట్ ఫోన్లను గతనెలే బీజింగ్ లో లీ ఇకో ప్రవేశపెట్టింది. లీ 2 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు..... 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే మీడియా టెక్స్ కొత్త హెలియో ఎక్స్20 డెకా-కోర్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ స్పేస్ 16 మెగాపిక్సెల్ రేర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ధర రూ.10,990గా అంచనా లీ 2 ప్రొ ఫీచర్లు.. హెలియో ఎక్స్25 ప్రాసెసర్ 21 మెగా పిక్సెల్ వెనుక కెమెరా 32 జీబీ, 64 జీబీ రెండు స్టోరేజ్ వేరియంట్లు ధర రూ.14,900గా అంచనా పై రెండు ఫోన్లకు సౌండ్ కోసం సీడీఎల్ఏను, యూఎస్బీ టైప్-సీ హెడ్ ఫోన్స్ ను సపోర్టు చేయనున్నాయి. లీ మ్యాక్స్ 2 ఫీచర్లు.. 5.7 అంగుళాల 2కే డిస్ ప్లే క్వాల్ కామ్ 820 క్లాక్డ్ 2.15జీహెచ్ 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ స్పేస్ 21 మెగా పిక్సెల్ వెనుక కెమెరా 8 మెగా పిక్సెల్ ముందు కెమెరా స్నాప్ డ్రాగన్ ఫింగర్ ప్రింట్ ఐడీ 4జీబీ ర్యామ్ ఫోన్ రూ.20,099 6 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.24,900గా అంచనా. ఇటీవలే ఈ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారి లీ 1ఎస్ ఇకో ఫోన్ ను ముంబాయి ఈవెంట్ లో భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. లీ సిరీస్ కు చెందిన లీ 2, లీ 2 ప్రొ, లీ మ్యాక్స్ 2లను రెండు నెలల్లో ప్రవేశపెడతామని కంపెనీ వెల్లడించింది. -
బాబు ప్రమాణ స్వీకారంగుంటూరులోనే..!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈనెల 8న గుంటూరు- విజయవాడల మధ్య ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆచార్య నాగార్జున యూనివర్సీటీ వద్ద క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకొని వారంలో మూడు రోజుల పాటు ఇక్కడి నుంచే పాలన సాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే గుంటూరు రేంజ్ ఐజీ సునీల్‌కుమార్, అర్బన్, రూరల్ ఎస్పీలు గోపీనాథ్, సత్యనారాయణలు సోమవారం ఏఎన్‌యూ ఎదురుగా స్థలాలు పరిశీలించడం, వర్సిటీలో భవనాలు, సౌకర్యాలపై ఆరా తీశారు. 2009 ఎన్నికలకు ముందు ఇదే స్థలంలో తెలుగుదేశం పార్టీ యువగర్జన నిర్వహించిన వర్సీటీ ఎదుట ఉన్న ఖాళీస్థలంలో ప్రమాణ స్వీకార వేదిక నిర్మించాలని నిర్ణయించినట్లు పార్టీ శ్రేణుల నుంచి వినవస్తోంది. ఏర్పాట్లలో భాగంగా ఐజీ, ఎస్పీలు భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా పోలీసు అధికారులకు తగిన సూచనలు, సలహాలు చేశారు. సీఎం హెలీప్యాడ్, వసతికి ఏర్పాట్లు.. పోలీసు ఉన్నతాధికారులు వర్సిటీలోని క్రీడాప్రాంగణంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేసేందుకు క్రీడామైదానం, పరిసరాలను పరిశీలించారు. చంద్రబాబు విశ్రాంతి తీసుకొనేందుకు అవసరమైన వసతి గృహాలను ఏర్పాటు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగా ఆదివారం విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు ఏఎన్‌యూను సందర్శించి ఒకవేళ ఇక్కడ సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పడితే విద్యుత్ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేయాలి, ప్రత్యేక సబ్‌స్టేషన్ ఎక్కడ నిర్మించాలనే దానిపై ఉన్నతాధికారులు సూచనలు చేసినట్లు తెలిసింది. ఈ పరిణామాలు గమనిస్తున్న ప్రజలు ఇక విజయవాడ- గుంటూరు మధ్యనే రాజధాని ఏర్పడుతుందని బలంగా నమ్ముతున్నారు. పార్టీ శ్రేణులను తరలించే ఏర్పాట్లు.. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని జిల్లా టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సభా వేదిక ఏర్పాటు విషయంపై పార్టీ నాయకులు చర్చిస్తున్నారు. అలాగే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి టీడీపీ శ్రేణులను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలించాలని నిర్ణయించారు. -
జూన్ 8న కైలాస్ మానస సరోవర్ యాత్ర షురూ
డెహ్రాడూన్: ప్రతి ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక 'కైలాస్ మానససరోవరం యాత్ర' జూన్ 8న ప్రారంభంకానుంది. ఢిల్లీలో ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం యాత్రకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ధ్రువీకరణ పొందిన ప్రయాణికులను గ్రూపులుగా పంపుతారు. ఢిల్లీలోని భారత్-టిబెట్ సరిహద్దు పోలీస్ (ఐటీబీపీ) బేస్ ఆస్పత్రిలో పరీక్షించిన అనంతరం ప్రయాణికులను జూన్ 12న ఉత్తరాఖండ్‌కు పంపిస్తారు. ఢిల్లీలో ఉన్న సమయంలోనే ప్రయాణికులు ఫీజు, ఇతర ఖర్చులను చెల్లించాలని అధికారులు తెలిపారు. 60 మంది సభ్యులతో కూడిన 18 గ్రూపులకు విదేశీ వ్యవహరాల శాఖ అనుమతిచ్చింది. ఉత్తరాఖండ్‌లో కూడా ప్రయాణికులకు మరోసారి వైద్య పరీక్షలు చేస్తారు. యాత్ర ఏర్పాట్లను ఐటీబీపీ ఏడో బెటాలియన్ పర్యవేక్షిస్తుంది. వారి వెంట వైద్య బృందం కూడా ఉంటుంది. సెప్టెంబర్ 9న సరోవరం యాత్ర పూర్తవుతుంది. ఈ పర్వతాలు సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటం వల్ల పూర్తిగా ఆరోగ్యం ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు.