న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బుధవారం మధ్యాహ్నాం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన రాజీనామా సమర్పించారు. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మెజారిటీ చేజిక్కించుకున్న నేపథ్యంలో ఆయన 17వ లోక్‌సభను రద్దు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్మును కోరారు.
రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము.. లోక్‌సభ రద్దుకు సైతం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రిమండలి సమావేశమై 17వ లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేసింది. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16వ తేదీతో ముగియనుంది. సాయంత్రం ఎన్డీయే కూటమి నేతల సమావేశం జరగనుంది. ఆ వెంటనే రాష్ట్రపతిని కూటమి నేతలంతా కలిసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని లేఖను అందించే అవకాశాలున్నాయి.
మోదీ ప్రమాణానికి ముహూర్తం
ఇక ఈ నెల 8న ప్రధాని మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. కర్తవ్య్‌పథ్‌లో మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఏడో తేదీన బీజేపీ, ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఆ భేటీలో లాంఛనంగా పార్లమెంటరీ పక్ష నేతను ఎన్నుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment