Le Max 2
-
'లీ మాక్స్ 2' స్మార్ట్ ఫోన్ ధర తగ్గిందోచ్!
న్యూఢిల్లీ: చైనా మొబైల్ దిగ్గజం ‘లీ ఇకో’ తమ ఫ్లాగ్ షిప్ మొబైల్ పై భారీ ఆఫర్ ప్రకటించింది. పరిమిత కాలానికి గాను లీ ఇకో 'లీ మాక్స్ 2' స్మార్ట్ ఫోన్ పై అయిదు వేల రూపాయల తగ్గింపును ప్రకటించింది. 4జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ ను అక్టోబర్ 1 నుంచి 6వరకు లీ మాల్. కామ్ లో రూ.17,999ల రాయితీ ధర వద్ద లిమిటెడ్ పీరియడ్ లో అందుబాటులో ఉంటుందని బుధవారం ప్రకటించింది. దీంతోపాటు భవిష్యత్తులో లీమాల్, ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ లభ్యంకాదని, కానీ వచ్చేవారం నుంచి అమెజాన్ ఇండియా, స్నాప్ డీల్ లో అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించింది. అలాగే డిస్కౌంట్ ధరతో లీ మాక్స్ 2 స్మార్ట్ ఫోన్ వేరు వేరు తేదీల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ లో అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడించింది. అంతే కాదు శుక్రవారం రెండువేల మంది కొనుగోలు దారులకు అదనంగా వెయ్యి రూపాయల వోచర్ అందించేందుకు నిర్ణయించినట్టు తెలిపింది. అలాగే ఫ్లిప్ కార్డ్ బిగ్ బిలియన్ సేల్ లో భాగంగా అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 6వరకు, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5వరకు, స్నాప్ డీల్ అన్ బాక్స్ దీపావళి అమ్మకాల్లో అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 6 వరకు 'లీ మాక్స్ 2' స్మార్ట్ ఫోన్ ను ఇదే ధరకు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. 4జీబీ ర్యామ్ 32 జీవీ స్టోరేజ్ వేరియంట్ ను ఈ ఏడాది జూన్ లో రూ. 22,999 లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.అయితే మరో వేరియంట్ 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ధర రూ. 29,999) ఎలాంటి రాయితీ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ను వేరు వేరు తేదీల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ లో అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది. కొత్త ఇ-కామర్స్ భాగస్వామ్యాలపై స్పందించిన లీ ఇకో సీవోవో అతుల్ జైన్ ఇది తమ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఈ ఎత్తుగడ ద్వారా తమ సొంత లీమాల్. కాం ద్వారా భారతదేశం లో అన్ని ప్రధాన ఇ కామర్స్ ప్లాట్ ఫాం లపై ఉనికిని కలిగి ఉన్నామన్నారు. తమ డిస్కౌంట్ ధరను వినియోగదారులు సంతోషంగా స్వీకరిస్తారని నమ్ముతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. -
మార్కెట్లోకి రెండు లీఎకో స్మార్ట్ ఫోన్లు
న్యూఢిల్లీ : చైనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ లీఎకో వరుసగా రెండు స్మార్ట్ ఫోన్లను ఒకేరోజు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. లీఎకో లీ 2, లీ మ్యాక్స్ 2లను ఢిల్లీలో మెగా ఈవెంట్ గా బుధవారం విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లు లీమాల్, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉండనున్నాయని కంపెనీ తెలిపింది. లీ మ్యాక్స్ 2 జూన్ 28 నుంచి అందుబాటులో ఉంటుందని, లీ 2 ఎప్పటినుంచి మార్కెట్లో ఉంచుతామో తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ఈ రెండు డివైజ్ల రిజిస్ట్రేషన్లు జూన్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై మొదటి నుంచి ఫ్లాష్ అమ్మకాలను చేపడతామని కంపెనీ ప్రకటించింది. లీఎకో లీ2 స్మార్ట్ ఫోన్ ధర రూ.11,999గాను, లీ మ్యాక్స్ 2కు రూ.22,999కు మార్కెట్లోకి ఆవిష్కరించింది. అయితే వీటితో పాటు లీ 2 ప్రొ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తామని చెప్పిన లీఎకో ప్రస్తుతం ఆ ఫోన్ భారత మార్కెట్లోకి ఆవిష్కరించలేదు. లీఎకో లీ 2 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు.. 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 652 చిప్ సెట్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ స్పేస్ 16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 4జీ ఎల్ టీఈ బ్యాండ్స్ సపోర్టు విస్తరణకు అవకాశం లేదు 3000 ఎంఏహెచ్ బ్యాటరీ లీఎకో లీ మ్యాక్స్ 2 ఫీచర్లు.. 5.7 అంగుళాల 2కే డిస్ ప్లే ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో 4 జీబీ, 6 జీబీ ర్యామ్ లతో రెండు వేరియంట్లు ప్రామాణికంగా 32 జీబీ స్టోరేజ్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ నూ అమర్చుకోవచ్చు 21 మెగా పిక్సెల్ వెనుక కెమెరా 8 మెగా పిక్సెల్ ముందు కెమెరా 4 జీ ఎల్ టీఈ సపోర్టు 3100 ఎంఏహెచ్ బ్యాటరీ -
లీఇకో నుంచి ఒకేసారి మూడు స్మార్ట్ ఫోన్లు
చైనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ లీ ఇకో వరుసగా మూడు స్మార్ట్ ఫోన్లను ఒకేరోజు మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. లీ 2, లీ 2 ప్రొ, లీ మ్యాక్స్ 2లు న్యూఢిల్లీ ఈవెంట్ గా జూన్ 8న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు స్మార్ట్ ఫోన్లను గతనెలే బీజింగ్ లో లీ ఇకో ప్రవేశపెట్టింది. లీ 2 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు..... 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే మీడియా టెక్స్ కొత్త హెలియో ఎక్స్20 డెకా-కోర్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ స్పేస్ 16 మెగాపిక్సెల్ రేర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ధర రూ.10,990గా అంచనా లీ 2 ప్రొ ఫీచర్లు.. హెలియో ఎక్స్25 ప్రాసెసర్ 21 మెగా పిక్సెల్ వెనుక కెమెరా 32 జీబీ, 64 జీబీ రెండు స్టోరేజ్ వేరియంట్లు ధర రూ.14,900గా అంచనా పై రెండు ఫోన్లకు సౌండ్ కోసం సీడీఎల్ఏను, యూఎస్బీ టైప్-సీ హెడ్ ఫోన్స్ ను సపోర్టు చేయనున్నాయి. లీ మ్యాక్స్ 2 ఫీచర్లు.. 5.7 అంగుళాల 2కే డిస్ ప్లే క్వాల్ కామ్ 820 క్లాక్డ్ 2.15జీహెచ్ 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ స్పేస్ 21 మెగా పిక్సెల్ వెనుక కెమెరా 8 మెగా పిక్సెల్ ముందు కెమెరా స్నాప్ డ్రాగన్ ఫింగర్ ప్రింట్ ఐడీ 4జీబీ ర్యామ్ ఫోన్ రూ.20,099 6 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.24,900గా అంచనా. ఇటీవలే ఈ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారి లీ 1ఎస్ ఇకో ఫోన్ ను ముంబాయి ఈవెంట్ లో భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. లీ సిరీస్ కు చెందిన లీ 2, లీ 2 ప్రొ, లీ మ్యాక్స్ 2లను రెండు నెలల్లో ప్రవేశపెడతామని కంపెనీ వెల్లడించింది.