'లీ మాక్స్ 2' స్మార్ట్ ఫోన్ ధర తగ్గిందోచ్! | LeEco Le Max 2 Gets a Limited Period Discount of Rs. 5,000 | Sakshi
Sakshi News home page

'లీ మాక్స్ 2' స్మార్ట్ ఫోన్ ధర తగ్గిందోచ్!

Published Wed, Sep 28 2016 1:51 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

'లీ మాక్స్ 2' స్మార్ట్ ఫోన్  ధర తగ్గిందోచ్!

'లీ మాక్స్ 2' స్మార్ట్ ఫోన్ ధర తగ్గిందోచ్!

న్యూఢిల్లీ:  చైనా మొబైల్ దిగ్గజం ‘లీ ఇకో’ తమ ఫ్లాగ్ షిప్ మొబైల్ పై భారీ ఆఫర్ ప్రకటించింది. పరిమిత కాలానికి గాను లీ ఇకో 'లీ మాక్స్ 2'  స్మార్ట్ ఫోన్ పై అయిదు వేల రూపాయల  తగ్గింపును  ప్రకటించింది. 4జీబీ ర్యామ్  32 జీబీ  స్టోరేజ్  వేరియంట్ స్మార్ట్ ఫోన్ ను అక్టోబర్ 1 నుంచి 6వరకు  లీ మాల్. కామ్ లో రూ.17,999ల  రాయితీ ధర వద్ద  లిమిటెడ్ పీరియడ్ లో అందుబాటులో ఉంటుందని    బుధవారం  ప్రకటించింది. దీంతోపాటు భవిష్యత్తులో లీమాల్, ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ లభ్యంకాదని, కానీ  వచ్చేవారం నుంచి అమెజాన్ ఇండియా, స్నాప్ డీల్ లో అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించింది. అలాగే  డిస్కౌంట్ ధరతో  లీ మాక్స్ 2 స్మార్ట్ ఫోన్ వేరు వేరు తేదీల్లో  అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ లో అందుబాటులో ఉంచనున్నట్టు  వెల్లడించింది.  అంతే కాదు శుక్రవారం రెండువేల మంది  కొనుగోలు దారులకు అదనంగా వెయ్యి  రూపాయల వోచర్  అందించేందుకు నిర్ణయించినట్టు తెలిపింది.
అలాగే ఫ్లిప్ కార్డ్ బిగ్ బిలియన్ సేల్ లో భాగంగా అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 6వరకు, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్   సందర్భంగా అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5వరకు,    స్నాప్ డీల్ అన్ బాక్స్ దీపావళి అమ్మకాల్లో అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 6 వరకు  'లీ మాక్స్ 2' స్మార్ట్ ఫోన్ ను ఇదే ధరకు అందుబాటులో  ఉంచనున్నట్టు తెలిపింది.   

4జీబీ ర్యామ్  32 జీవీ స్టోరేజ్  వేరియంట్ ను ఈ ఏడాది జూన్ లో రూ. 22,999  లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.అయితే మరో వేరియంట్  6జీబీ ర్యామ్, 64జీబీ  స్టోరేజ్ ధర రూ. 29,999)  ఎలాంటి  రాయితీ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ను వేరు వేరు తేదీల్లో  అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ లో అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది.

కొత్త ఇ-కామర్స్ భాగస్వామ్యాలపై  స్పందించిన  లీ ఇకో సీవోవో అతుల్ జైన్  ఇది తమ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఈ ఎత్తుగడ ద్వారా  తమ సొంత లీమాల్. కాం ద్వారా  భారతదేశం లో అన్ని ప్రధాన ఇ కామర్స్  ప్లాట్ ఫాం లపై  ఉనికిని కలిగి ఉన్నామన్నారు.  తమ డిస్కౌంట్ ధరను  వినియోగదారులు సంతోషంగా స్వీకరిస్తారని నమ్ముతున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement