దివాలీ ఆఫర్ పొడిగించిన లీ ఎకో | LeEco extends Diwali offers on its Super3 TVs | Sakshi
Sakshi News home page

దివాలీ ఆఫర్ పొడిగించిన లీ ఎకో

Published Wed, Nov 2 2016 1:01 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

దివాలీ ఆఫర్ పొడిగించిన లీ ఎకో

దివాలీ ఆఫర్ పొడిగించిన లీ ఎకో

న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు  లీ ఎకో తన స్మార్ట్ టీవీల దీపావళి ఆఫర్  ను  పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.   సూపర్ 3 టీవీలపై  అక్టోబర్ 26  నుంచి 30 వరకు అమలు చేసిన ప్రత్యేక ఆఫర్ మరికొంతకాలం పొడిగిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్ కింద క్యాష్ బ్యాక్ ఆఫర్ను,మూడు, లేదా ఆరు నెలలపాటు వడ్డీలేని ఈఎంఐ   సౌకర్యాన్ని అందిస్తున్నట్టు వెల్లడించింది.   అలాగే  ఎక్సేంజ్ ఆఫర్ కింద 25 వేల వరకు  తగ్గింపుధరను   అందిస్తోంది.  
దీపావళి ఆఫర్ సందర్భంగా  సంస్థ వెబ్ సైట్ లీమాల్,  ఫ్లిప్ కార్ట్ ద్వారా నిర్వహించిన ఓపెన్ అమ్మకాల్లో  2వేలకు పైగా సూపర్ టివీ 3  లనువిక్రయించినట్టు తెలిపింది

కాగా చైనా కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ సంస్థ లీ ఎకో ఇటీవలే మన దేశంలో స్మార్ట్ టీవీల బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. .   సూపర్ 3 టీవీ సిరీస్ పేరిట మూడు వేరియంట్లను మార్కెట్ లోకి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement