టోటల్లీ ప్యాక్డ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ బైక్ కమింగ్ సూన్..! | LeEco’s new Android-powered smart bikes are coming to the US | Sakshi
Sakshi News home page

టోటల్లీ ప్యాక్డ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ బైక్ కమింగ్ సూన్..!

Published Thu, Jan 5 2017 8:54 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

టోటల్లీ ప్యాక్డ్  ఆండ్రాయిడ్ స్మార్ట్ బైక్ కమింగ్ సూన్..! - Sakshi

టోటల్లీ ప్యాక్డ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ బైక్ కమింగ్ సూన్..!

బీజింగ్: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ లీ ఇకో మరో ఆవిష్కారానికి శ్రీకారం చుట్టింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం ఆధారిత బైక్ లను త్వరలో  ప్రవేశపెట్టనుంది. ఆండ్రాయిడ్‌ డివైస్‌తో అనుసంధానమై పనిచేసే ఈ బైక్‌ను చైనా సంస్థ లీఎకో రూపొందిస్తోంది. 2017 రెండో త్రైమాసికంలో ఈ టోటల్లీ ప్యాక్డ్ విత్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌బైక్‌ను అమెరికా మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది.   ఇందులో స్మార్ట్ రోడ్ బైక్,  స్మార్ట్  మౌంటెన్ బైక్  పేరుతో రెండు వేరియంట్స్ ను తీసుకొస్తోంది. మిగతా సూపర్  బైక్ ల ఫీచర్లతో పాటు   6000 ఎంఏహెచ్ సామర్ధ్యంతో పనిచేసే రిమూవబుల్ బ్యాటరీ , స్నాప్ డ్రాగన్ 410 పవర్డ్  టచ్ స్ర్కీన్  టర్న్ బై టర్న్  నావిగేషన్ , వాకీ టాకీ  లాంటి అదనపు ఫీచర్లు  ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే ధర  ఎంత అనేది మాత్రం  ప్రస్తుతానికి సప్పెన్సే.

ఈ  స్మార్ట్ బైక్  హ్యాండిల్స్ పై ఉండే నాలుగు అంగుళాల టచ్ ఆధారిత స్మార్ట్ స్క్రీన్ ద్వారా మనం ఏ దిశలో వెళ్లాలో  తెలుసుకోవచ్చు. ఏయే ప్రాంతాల్లో తిరిగామో రికార్డు కూడా చేస్తుంది. ఒంటరి ప్రయాణంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ  సంగీతాన్ని ఆస్వాదించొచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు ఈ బైక్‌ను ఎవరైనా చోరీ చేసేందుకు ప్రయత్నిస్తే.. ఆ బైక్ సంబంధిత  యజమాని ఫోన్‌కి అలర్ట్‌ ఆటోమేటిక్‌గా అందే ఏర్పాటు ఉంది. సెన్సర్ల ద్వారా  రైడర్ ఫిట్‌నెస్‌ వివరాలను కూడా ఈ స్మార్ట్ బైక్ ట్రాక్‌ చేసేలా రూపొందించారట.

దీంతో ఆండ్రాయిడ్  ప్లాట్‌ఫాంపై స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, స్మార్ట్‌ కార్లు,  స్మార్ట్ టీవీలే కాదు స్మార్ట్ బైక్ లు  కూడా ఇక మార్కెట్లను ముంచెత్తబోతున్నాయన్నమాట.  అయితే ముందుగా అమెరికాలో హల్ చల్ చేయనున్న ఈ  స్మార్ట్ బైక్ లకోసం  దేశీయ బైక్  లవర్స్  మాత్రం మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement