లీ ఎకో స్మార్ట్‌టీవీ వచ్చేసింది..! | LeEco Super3 TV series launched in India | Sakshi
Sakshi News home page

లీ ఎకో స్మార్ట్‌టీవీ వచ్చేసింది..!

Published Thu, Aug 4 2016 8:34 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

లీ ఎకో స్మార్ట్‌టీవీ వచ్చేసింది..!

లీ ఎకో స్మార్ట్‌టీవీ వచ్చేసింది..!

చైనా ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ 'లీ ఎకో'  తాజాగా తన సూపర్3’ సిరీస్ అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌టీవీలను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో 55 అంగుళాల ఎక్స్55 X 65 అంగుళాల ఎక్స్65 X 65 అంగుళాల మ్యాక్స్65’అనే ప్రొడక్టులు ఉన్నాయి. 4కే అల్ట్రా హెచ్‌డీ (3840 X 2160) రెజల్యూషన్ వీటి సొంతం.

 

ఎక్స్55’ ధర రూ.59,790గా, ఎక్స్65’ ధర రూ.99,790గా, మ్యాక్స్65’ ధర రూ.1,49,790గా ఉంది. ఈ టీవీలు ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయని, ఇందులో ఆండ్రాయిడ్ యాప్స్‌ను రన్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఎక్స్55’లో 2 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీని, మిగతా ప్రొడక్టులలో 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ ఫీచర్లను పొందుపరిచామని పేర్కొంది. ఈ ఆండ్రాయిడ్ టీవీలన్నీ వినియోగదారులకు కంపెనీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లీమాల్ సహా ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్ట్ 10 నుంచి అందుబాటులో ఉంటాయని వివరించింది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement