ఒక్క రోజులోనే 7.5 లక్షల ఫోన్లు సేల్
న్యూఢిల్లీ : చైనీస్ ఇంటర్ నెట్, టెక్నాలజీ దిగ్గజ సంస్థ 'లీ ఇకో' రెండో తరానికి చెందిన సూపర్ ఫోన్ల అమ్మకాల్లో దూసుకెళ్తోంది. ఒక్క రోజులోనే 7 లక్షల 50వేలకు పైగా సూపర్ ఫోన్లు అమ్ముడుపోయాయని కంపెనీ ప్రకటించింది. అదేవిధంగా లీమాల్.కామ్ లో దాదాపు 2 కోట్ల 30 లక్షల (23మిలియన్) రిజిస్ట్రేషన్లు నమోదైనట్టు పేర్కొంది.లీ మాక్స్2 కేవలం 57 సెకండ్లలో అమ్ముడుపోతుండగా, లీ2 మోడల్ 8.26 నిమిషాల్లో అమ్ముడు పోతుందని కంపెనీ తెలిపింది.
అదేవిధంగా నాలుగో తరానికి చెందిన సూపర్ టీవీ రిజిస్ట్రేషన్లు కూడా కోటి ఎనభై లక్షలు(18 మిలియన్లు) దాటిందని కంపెనీ పేర్కొంది. లీ ఇకో కంపెనీకి చెందిన ఉత్పత్తుల్లో కొత్త శ్రేణికి చెందిన వాటిని కంపెనీ గతవారం బీజింగ్ లో ప్రవేశపెట్టింది. మొబైల్, టీవీ, ఆటోమోటివ్, వీఆర్ లాంటి వివిధ రకాల మోడళ్లను కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. 153గ్రాముల బరువు, 8.5ఎంఎం వెడల్పు, 151ఎంఎం లాంగ్, యూఎస్ బీ టైప్-సీ ఆడియో పోర్టు ఫీచర్ కంటిన్యూల్ డిజిటల్ లాస్ లెస్ ఆడియో టెక్నాలజీతో మాక్స్2 ను కంపెనీ రూపొందించింది. 6జీబీ మెమరీ, 64జీబీ విస్తరణ మెమరీతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.
క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 820 క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో 5.7 అంగుళాల క్యూహెచ్ డీ డిస్ ప్లే ను ఈ ఫోన్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్ తో చుట్టిన లీ ఇకో కస్టమైజిడ్ ఈయూఐ 5.5, 3100 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, కనెక్టివిటీ ఆప్షన్లలో 802.11ఎసీ వైఫై, 4జీ ఎల్టీఈ, జీపీఎస్ లు మాక్స్ 2 ప్రత్యేకతలు. 16 ఎంపీ ఎఫ్/2 వెనుక కెమెరా, దాంతో పాటు ఎల్ ఈడీ, పీడీఏఎఫ్ ప్లాస్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ కలిగిఉంది.