Viral Video: A Man Sell Golgappas On A Moving Train, Internet Reacts - Sakshi
Sakshi News home page

కదులుతున్న రైలులో పానీపూరీల అమ్మకం.. ఆ స్కిల్‌కి నెటిజన్లు ఫిదా!

Published Thu, Jun 29 2023 12:09 PM | Last Updated on Thu, Jun 29 2023 3:23 PM

Viral Video: A Man Sell Golgappas On A Moving Train - Sakshi

చేయాలన్న సంకల్పం ముందు ఎలాంటి ప్రతికూల వాతావరణం అయిన అనుకూలంగా మారిపోతుంది. ఉత్సాహం, సాధించాలన్న తపన ఇవే ప్రధానం. బహుశా ఏ వ్యాపారినికైనా సక్సెస్‌ మంత్రం ఇదే కాబోలు. ఇక్కడొక వ్యక్తి అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ఆ వ్యక్తి కదులుతున్న రైలులో పానీ పూరీలు అమ్మి చూపించాడు. వీధి వ్యాపారి ఏ మాత్రం బెరుకు లేకుండా చాలా చక్యంగా ఆ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులుకు సర్వ్‌ చేశాడు.

అందులోనూ పానీపూరీలు కదులుతున్న రైలులో విక్రయించడం అంత ఈజీ కాదు. కానీ అతను నైపుణ్యం ప్రజలకు ఆ పానీ పూరీలను విక్రయిస్తూ అందరీ దృష్టిని ఆకర్షించాడు. అందుకు సంబంధించిన వీడియోన నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్లు సైతం తనను తాను బ్యాలెన్స్‌ చేసుకుంటూ అమ్ముతున్న విధానాన్ని చూసి ఫిదా అవ్వడమే గాక అతడిని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. 

ఈ ఘటన ముంబై లోకల్ రైల్లో జరిగింది. 14 సెకన్ల ఈ వీడియోను ఓ యువకుడు ట్విట్టర్ లో జూన్ 21న అప్ లోడ్ చేయగా.. వైరల్ గా మారింది. కనిపించిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సక్సెస్ అవుతారంటూ నెటిజన్లు ప్రశంసించారు. 

నోట్ : రైల్లో ఇలా పానీ పూరీ విక్రయించడం నిషేధం. తోటి ప్రయాణీకులకు ఇబ్బందికరం. దీన్ని ఎవరూ అనుకరించకూడదని మనవి

(చదవండి: రెండు వేల ఏళ్ల క్రితమే పిజ్జా వంటకం ఉందంటా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement