24 గంటల్లో లక్ష ఫోన్లకు రిజిస్ట్రేషన్లు
బీజింగ్ : చైనా టెక్నాలజీ కంపెనీ లీ ఇకో మొదటి 'మేడ్ ఫర్ ఇండియా' స్మార్ట్ ఫోన్ అకా ది లీ 1ఎస్(ఎకో) కు 24గంటల వ్యవధిలోనే ఏకంగా లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చాయని కంపెనీ వెల్లడించింది. ఫ్లాస్ అమ్మకాల ద్వారా ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ మంగళవారం ప్రకటించింది. మొదటి 1,000 యూనిట్ల ఫ్లాస్ అమ్మకాలను మే 12న మధ్యాహ్నం రెండు గంటలకు చేపడతామని కంపెనీ తెలిపింది. మొదటి ఫ్లాస్ అమ్మకం కింద రూ.9,999 లకు ఈ ఫోన్ అందుబాటులోకి తేనున్నట్టు పేర్కొంది. లీ 1ఎస్(ఎకో) ఫోన్ ను కంపెనీ మంగళవారం ఆవిష్కరించింది.
లీ 1ఎస్(ఎకో) ఫీచర్స్ :
5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే
మీడియా టెక్ హెలియో ఎక్స్ 10 ప్రాసెసర్
3జీబీ ర్యామ్
32జీబీ ఇంటర్నెల్ మెమెరీ
13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
5 మెగా పిక్సెల్ ముందు కెమెరా
3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
మెటల్ బాడీ, ఫింగర్ ప్రింట్ స్కానర్
డ్యూయల్ సిమ్ (మైక్రో, నానో సిమ్)