రెండో అతిపెద్ద ఈ-కామర్స్ మార్కెట్గా భారత్!
న్యూఢిల్లీ: భారత్ వచ్చే రెండు దశాబ్దాల కాలంలో అమెరికాను వెనక్కునెట్టి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఈ-కామర్స్ మార్కెట్‌గల దేశంగా అవతరించనుంది. అలాగే నెంబర్‌వన్ స్థానం కోసం చైనాతో నువ్వానేనా అన్నట్లు పోటీపడనుంది. ప్రముఖ గ్లోబల్ పేమెంట్స్ సంస్థ వరల్డ్‌పే తన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. ప్రపంచ ఈ-కామర్స్ మార్కెట్ వృద్ధికి అభివృద్ధి చెందుతున్న దేశాలు బాగా దోహదపడనున్నారుు.
మరీముఖ్యంగా భారత ఈ-కామర్స్ మార్కెట్‌లో 2016-2020 మధ్యకాలంలో 28 శాతం వార్షిక వృద్ధిరేటు నమోదవుతుంది. దీంతో 2034 నాటికి ఇండియా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఈ-కామర్స్ మార్కెట్ గల దేశంగా అవతరిస్తుంది. దీనికి ఇంటర్నెట్ విస్తరణ, స్మార్ట్‌ఫోన్‌స విని యోగం పెరుగుదల వంటి అంశాలు కారణంగా నిలుస్తారుు.