
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సాంకేతిక రంగంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేశ్ నంబియార్ తెలిపారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ టెక్నాలజీ వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యత గల కీలక భాగస్వామిగా భారత్ ఉంటోందని ఆయన నాస్కామ్ గ్లోబల్ కాన్‌ఫ్లుయెన్స్ 2025లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.
అసాధారణ ప్రతిభావంతుల లభ్యత భారత్‌కి సానుకూలాంశంగా ఉంటోందని నంబియార్ వివరించారు. గ్లోబల్ స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ మొదలైన విభాగాలు) మార్కెట్లో భారత్‌కి 28 శాతం, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో 23 శాతం వాటా ఉందని తెలిపారు.
మరోవైపు, అందరికీ ఏఐ ప్రయోజనాలు లభించాలన్న లక్ష్య సాధన దిశగా కేంద్రం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని వాణిజ్య, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద చెప్పారు. పరిశ్రమ దిగ్గజాలు పరిశోధన, అభివృద్ధిపై (ఆర్‌అండ్‌డీ) మరింతగా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment