దాదాపు 200 సంవత్సరాలకు పైగా భారతదేశం చెట్ల పెంపకంపై ప్రయోగాలు చేసింది. అడవులను పునరుద్ధరించే వివిధ విధానాలు... అవి స్థానిక సమాజాలపై, విస్తృత పర్యావరణంపై చూపే పరిణామాల గురించి మన దేశం ముఖ్యమైన పాఠాలను అందిస్తోంది. అందుకే గత తప్పిదాలు పునరావృతం కాకుండా అటవీశాఖాధికారులు చూసుకోవాలి.
చెట్లను నాటడం అనగానే కచ్చితంగా అడవిని పునరుద్ధరించినట్టు అర్థం కాదు. చెట్ల కొరత ఉన్న పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం కూడా ముఖ్యం. పై నుండి అటవీ పందిరిని చూసి మురవడం కంటే కూడా దానివల్ల పర్యావరణం, స్థానిక ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలను నిర్ణయించడం విజయానికి మరింత సహాయ ప్రమాణంగా ఉంటుంది.
అడవులను తమకు తాముగా పునరుత్పత్తి చేసుకునేలా చేయడం అనేది, వాతావరణంలో భూమిని వేడెక్కించే కార్బన్ ను తగ్గించడం కోసం చేసే ఒక వ్యూహంగా ఉంటోంది. అదే సమయంలో జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థలు అందించే ప్రయోజనాలతోపాటు జీవనోపాధికి చెందిన ఫలవంతమైనదాన్ని కూడా అవి పెంచుతూ వచ్చాయి.
కానీ వాతావరణ మార్పును పరిమితం చేసే ఉద్దేశంతో చెట్ల విస్తృతిని పెంచే ప్రయత్నాలు చివరకు వేగంగా పెరిగే ఉద్యానవనాలను నిర్మించడం వైపు మొగ్గు చూపాయి.
పొలాలు, బంజరు భూముల్లో తోటలను పెంచితే అవి కలపను, వంటచెరుకును అందించగలవు. ఇవి సహజ అడవులపై ఒత్తిడిని తగ్గించి, వాటి పునరుత్పత్తికి సహాయపడతాయి. కానీ సరైన రీతిలో జరగని చెట్ల పెంపకం తొలగించలేని జాతులను పెంచుతుంది. అవి ప్రజలను తమ భూమికి దూరమయ్యేట్టు చేస్తాయి.
దాదాపు 200 సంవత్సరాలకు పైగా భారతదేశం చెట్ల పెంపకంపై ప్రయోగాలు చేసింది. అడవులను పునరుద్ధరించడంలో వివిధ విధా నాలు... అవి స్థానిక సమాజాలపై, విస్తృత పర్యావరణంపై చూపే పరిణామాల గురించి మన దేశం ముఖ్యమైన పాఠాలను అందిస్తోంది. గత తప్పిదాలు పునరావృతం కాకుండా నిరోధించడానికి, ఈ అరుదైన దీర్ఘకాలిక దృక్పథాన్ని నేడు అటవీశాఖాధికారులు గమనించాలి.
దురాక్రమణ చెట్లు
18వ శతాబ్దం మధ్యకాలం నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మన దేశానికి చెందిన అనేక వ్యవహారాలను బ్రిటన్ నియంత్రించింది. 1857 నుండి 1947 మధ్య బ్రిటిష్ రాణి నేరుగా దేశాన్ని పాలించింది.
భారతదేశం నుండి కొల్లగొట్టిన పత్తి, రబ్బరు, తేయాకును రవాణా చేయడం కోసం, బ్రిటన్ కు రైల్వే స్లీపర్‌లను వేయడానికి, ఓడ లను నిర్మించడానికి పెద్ద మొత్తంలో కలప అవసరమైంది. 1865 భారత అటవీ చట్టం ద్వారా, టేకు, సాల్, దేవదారు వంటి అధిక దిగుబడినిచ్చే కలప చెట్లతో కూడిన అడవులను ప్రభుత్వం ఆస్తిగా మార్చుకొంది.
ఈ అడవుల్లో ఈ కలప దిగుబడిని అధికం చేసేందుకు బ్రిటిష్ వలసపాలనాధికారులు గడ్డి, వెదురు కంటే మించిన రకాలను వేయకుండా స్థానిక ప్రజల హక్కులపై పరిమితులను విధించారు. ఆఖరికి పశువుల మేతపై కూడా ఆంక్షలు విధించారు. దీంతో భార తీయ సమాజాలు కొన్నిసార్లు అడవులను తగలబెట్టడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాయి.
ఈలోగా వేడి, తేమతో కూడిన భారతదేశ వాతావరణానికి బాగా అలవాటుపడిన, మన్నికైన, ఆకర్షణీయమైన కలపకు మూలమైన టేకు తోటలు (టెక్టోనా గ్రాండిస్) దూకుడుగా వ్యాపించాయి. దాంతో సహజమైన గడ్డి భూములు, పొదలతో కూడిన అడవులు ఏకరూప టేకు పంటలకు దారితీశాయి.
భారతదేశంలో లేని యూకలిప్టస్, ఇతర అన్యదేశ చెట్లను సుమారు 1790 నుండి బ్రిటిష్‌వాళ్లు పరిచయం చేశారు. ఐరోపా, ఉత్తర అమెరికా నుండి తెచ్చిన దేవదారు చెట్లను హిమాలయ ప్రాంతంలో జిగురు కోసం; ఆస్ట్రేలియా నుండి తెచ్చిన అకేసియా చెట్లను కలప, మేత కోసం నాటారు. ఈ జాతులలో ఒకటైన, ‘వాటిల్’ (అకే సియా మియర్న్‌సి– ఒక తుమ్మ రకం)ని 1861లో కొన్ని లక్షల మొక్కలతో పశ్చిమ కనుమలలోని నీలగిరి జిల్లాలో ప్రవేశపెట్టారు.
వాటిల్ అప్పటి నుండి ఆక్రమించే మొక్కగా మారి, ఈ ప్రాంతంలోని గడ్డి భూములను స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా, దేవదారు హిమాలయాలలో చాలావరకు వ్యాపించి, స్థానిక ఓక్(సిందూర) చెట్లను స్థానభ్రంశం చేసింది. మధ్య భారతదేశంలోని స్థానిక గట్టి చెక్క అయిన సాల్ స్థానంలోకి టేకు వచ్చింది. ఓక్, సాల్ రెండూ ఇంధనం, మేత, ఎరువులు, ఔషధం, నూనె కోసం విలువైనవి. వీటినీ, మేత భూమినీ కోల్పోవడం చాలా మందిని పేదలుగా మార్చింది.
ఏవి పనికొస్తాయి?
‘బాన్ ఛాలెంజ్’ కింద 2030 నాటికి సుమారు 2.1 కోట్ల హెక్టార్ల అడవులను పునరుద్ధరిస్తామని భారతదేశం ప్రతిజ్ఞ చేసింది. భారత ప్రభుత్వం, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) 2018లో విడుదల చేసిన ప్రోగ్రెస్ రిపోర్టులో దాదాపు ఒక కోటి హెక్టార్ల మేరకు అడవులు పునరుద్ధరణలో ఉన్నాయని పేర్కొన్నారు.
చెట్లతో కప్పబడిన భూమి విస్తీర్ణాన్ని పెంచడంపై పెడుతున్న ఈ దృష్టి, భారత జాతీయ అటవీ విధానంలో ప్రతిఫలిస్తోంది. ఇది దేశంలోని 33 శాతం విస్తీర్ణంలో చెట్లను పెంచడాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ విధానంలోని పథకాలలో యూకలిప్టస్ లేదా వెదురు వంటి ఒకే జాతితో కూడిన తోటలు ఉంటాయి. ఇవి వేగంగా పెరుగుతాయి, చెట్లు కప్పే స్థలాన్ని త్వరగా పెంచుతాయి.
కొన్నిసార్లు ఈ చెట్లను గడ్డి భూములు, చెట్ల వ్యాప్తి సహజంగా తక్కువగా ఉన్న ప్రాంతాలలో నాటారు. ఫలితంగా మేతకోసం, ఇతర ఉత్పత్తుల కోసం ఈ పర్యావ రణ వ్యవస్థలపై ఆధారపడిన గ్రామీణ, స్థానిక ప్రజలకు హాని కలుగు తోంది. అన్యదేశ చెట్లను నిరంతరం నాటడం వల్ల 200 ఏళ్ల క్రితం వాటిల్ మాదిరిగానే కొత్త ఆక్రమణ జాతులు వచ్చే ప్రమాదం ఉంది.
దీనికి సంబంధించి సానుకూల కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి. 2006 అటవీ హక్కుల చట్టం ఒకప్పుడు సాంప్రదాయ వినియోగంలో ఉన్న అటవీ ప్రాంతాలను నిర్వహించేందుకు గ్రామసభలకు అధికారం ఇచ్చింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో అనేక గ్రామసభలు క్షీణించిన అడవులను పునరుద్ధరించాయి. పైగా వాటిని బీడీలు చుట్టడానికి ఉపయోగించే తునికి ఆకులకు స్థిరమైన వనరుగా మార్చాయి. అలాగే గుజరాత్ కbŒ∙గడ్డి భూముల్లో, 19వ శతాబ్దం చివరలో బ్రిటిష్ అటవీ అధికారులు ప్రవేశపెట్టిన ‘పిచ్చి చెట్లను’ తొలగించడం ద్వారా అక్కడి సమాజాలు గడ్డి భూములను పునరుద్ధరించగలిగాయి.
ప్రయోజనాలూ ముఖ్యమే!
అటవీ పునరుద్ధరణ ప్రయత్నాల విజయాన్ని చెట్ల విస్తృతితో మాత్రమే కొలవలేము. ‘అడవి’ గురించిన భారత ప్రభుత్వ నిర్వచనం ఇప్పటికీ ఏకరూప చెట్టు జాతులు, çపళ్ల తోటలు, ఆఖరికి వెదురు (నిజానికి ఇది గడ్డి కుటుంబానికి చెందినది) లాంటిదానికి మాత్రమే పరిమితమై ఉంది. దీనర్థం ద్వైవార్షిక అటవీ సర్వేలు ఎంత సహజ అడవులను పునరుద్ధరించారో లెక్కించలేవు; స్థానిక చెట్లను పోటీ జాతులతో స్థానభ్రంశం చేయడం వల్ల కలిగిన పరిణామాలను తెలియజేయలేవు; అన్యదేశ చెట్లు మన సహజమైన గడ్డి భూములను ఎంత ఆక్రమించాయో గుర్తించలేవు. పైగా అవి పునరుద్ధరించిన అడ వులుగా తప్పుగా నమోదు అవుతాయి.
సహజ అటవీ పునరుత్పత్తిని, అలాగే కలప, ఇంధనం కోసం చెట్ల పెంపకాన్ని రెండింటినీ ప్రోత్సహించాలి. అయితే ఇతర పర్యావరణ వ్యవస్థలు, ప్రజల మీద వీటి ప్రభావాన్ని తప్పక పరిశీలించాలి. నాటు తున్న రకాలు దురాక్రమించేవిగా మారకుండా జాగ్రత్తగా ఎంచు కోవడం దీంట్లో భాగం. అటవీ హక్కులు, స్థానిక జీవనోపాధి, జీవ వైవిధ్యం, కర్బన నిల్వలపై దాని ప్రభావాల పరంగా చెట్ల కవరేజిని పెంచడానికి సంబంధించిన లక్ష్యాన్ని అంచనా వేయాలి.
చెట్లను నాటడం అనగానే కచ్చితంగా అడవిని పునరుద్ధరించి నట్టు అర్థం కాదు. చెట్ల కొరత ఉన్న పర్యావరణ వ్యవస్థలను పున రుద్ధరించడం కూడా ముఖ్యం. పై నుండి అటవీ పందిరిని చూసి మురవడం కంటే దానివల్ల పర్యావరణం, స్థానిక ప్రజలకు జరుగు తున్న ప్రయోజనాలను నిర్ణయించడం విజయానికి మరింత సహాయ ప్రమాణంగా ఉంటుంది.
ధనపాల్ గోవిందరాజులు
వ్యాసకర్త పరిశోధకుడు, మాంచెస్టర్ యూనివర్సిటీ
(‘ది కాన్వర్జేషన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment