న్యూఢిల్లీ: 2030 నాటికి ప్రపంచ స్టార్టప్స్ ఏకోసిస్టమ్‌లో ఇండియా మూడో స్థానానికి చేరుతుందని, అందుకు అవసరమైన నాలెడ్జ్ బేస్‌ను పెంచడంతో పాటు సరైన పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టిపెట్టామని డిజిటల్ స్టార్టప్ థింక్ ట్యాంక్ అలయన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్ (ఏడీఐఎఫ్) తెలిపింది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్లతో స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్చలు జరపుతున్నామని.. ఇరు వర్గాలను సమన్వయ పరిచే విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఏడీఐఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిజో కురువిలా జార్జ్ తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచ స్టార్టప్ ఏకోసిస్టమ్ ఇండియా 20వ ర్యాంకింగ్‌లో ఉందని... 50 యూనికార్న్ స్టార్టప్స్‌తో అమెరికా (122), చైనా (92) మూడో స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. నాలెడ్జ్ షేరింగ్ కోసం త్వరలోనే స్టార్టప్ ఫౌండర్లతో అలయన్స్‌తో ఏర్పాటు చేస్తామని చెప్పారు. యాపిల్ విధానాల మాదిరిగానే స్టార్టప్స్ తమ ఆదాయంలో 30 శాతం వరకు వసూలు చేయాలని గూగుల్ ప్లేస్టోర్ ప్రతిపాదించింది. అయితే దేశంలో చాలా వరకు స్టార్టప్‌లకు అధిక మార్జిన్లు లేవని, ఈ విషయంపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని వివరించారు. అమెరికాలో ఆరిజోనా రాష్ట్రం యాప్ స్టోర్ ఫీజులపై మార్గదర్శకాలను తీసుకొచ్చిందని.. ఇది ప్రారంభ సంకేతమని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment