Ind Vs Eng T20 Series: RRR Team Interesting Tweet About Virat Kohli, Rohit Sharma - Sakshi
Sakshi News home page

కోహ్లి, రోహిత్‌లపై ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఆసక్తికర ట్వీట్‌

Published Sun, Mar 21 2021 5:08 PM | Last Updated on Sun, Mar 21 2021 6:14 PM

RRR Movie Interesting Tweet On Openers - Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 3–2తో గెలుచుకున్న విషయం తెలిసిందే. చివరి టీ20ల్లో ఓపెనర్లుగా దిగిన విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడి 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలక్పొంది. ఈ బ్యాటింగ్‌ ద్వయం ప్రత్యర్థి జట్లకు  ఎక్కడా ఛాన్స్‌  ఇవ్వలేదు. ఆది నుంచే ప్రత్యర్థిపై విరుచుకుపడ్డారు. ఇరువురి విధ్వంసకర భాగస్వామ్యాన్ని  క్రిక్‌ ట్రాకర్‌  తమ ట్వీటర్‌ అకౌంట్‌లో విరాట్‌ కోహ్లిను రామరాజు(అగ్ని)తో , రోహిత్‌ శర్మను కొమరంభీమ్‌ (నీరు) పోల్చుతూ ట్వీట్‌ను వేసింది.  ఈ ట్వీట్‌ను రీ షేర్‌ చేస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఆసక్తికర ట్వీట్‌ను వేసింది. ఫైర్‌బ్రాండ్‌ విరాట్‌ కోహ్లి , మిస్లర్‌ కూల్‌ రోహిత్‌ శర్మల కలయిక ఒక సంచలనం. కప్పును గెలవండి అంటూ  ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అధికారిక ఖాతానుంచి ట్వీట్‌ వేసింది.

సిరీస్‌ నిర్ణాయక మ్యాచ్‌లో భారత జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని విరాట్‌  కోహ్లి, రోహిత్‌ శర్మ అందించారు. అంతర్జాతీయ టి20ల్లో తొలిసారి జంటగా ఓపెనింగ్‌కు దిగిన రోహిత్, కోహ్లి ఓవర్‌కు 10.44 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టారు. ముందుగా రోహిత్‌ బాధ్యత తీసుకొని తనదైన శైలిలో చెలరేగాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన కోహ్లి ఆ తర్వాత పుంజుకున్నాడు.  ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్‌ కోహ్లి(80 నాటౌట్‌; 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దుమ్ములేపగా, రోహిత్‌ శర్మ(64; 34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసకర ఆటతో అదరగొట్టాడు.

(చదవండి: రోహిత్‌ అత్యాశపరుడు.. ధోని షాకింగ్‌ వీడియో..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement